సహజ జంతు ప్రదర్శనశాల అని దేన్ని పిలుస్తారు?


Wed,December 4, 2019 01:41 AM

ఆసియా శీతోష్ణస్థితి


ఆసియా ఖండం
అక్షాంశాల దృష్ట్యా- దక్షిణార్థగోళంలో 10o దక్షిణ అక్షాంశం నుంచి ఉత్తరార్ధగోళంలో 80o అక్షాంశాల వరకు విస్తరించబడి ఉన్నది. ఆసియా ఖండం మధ్యగుండా 90o తూర్పు రేఖాంశం పోతున్నది.
-ఈ ఖండం నుంచి భూమధ్యరేఖ(0o అక్షాంశం) దక్షిణ, ఆగ్నేయంగా పోతున్నది.
-23 1/2o ఉత్తర అక్షాంశమైన కర్కటరేఖ ఈ ఖండం నుంచి పోతున్నది.
-66 1/2o ఉత్తర అక్షాంశమైన ఆర్కిటిక్ వలయం ఈ ఖండం నుంచి పోతున్నది.
-ప్రపంచంలో అత్యుష్ణమండలం కర్కటరేఖ, మకరరేఖల మధ్య ఉన్న ప్రాంతం. అదేవిధంగా భూమధ్యరేఖకు రెండువైపుల అత్యధిక వర్షపాతం ఉంటుంది. ఎక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత వలన ఇక్కడ దట్టమైన అడవులు ఉన్నాయి.
Nature

ఆసియాఖండపు అడవుల విస్తరణ

-ఆసియా ఖండం ఉత్తరభాగం మంచుతో కప్పబడి ఉంది. దీన్నే టండ్రామండలం అంటారు. టండ్రాలకు దక్షిణంగా ఉండే టైగా మండలంలో శృంగాకారపు అడవులు ఉంటాయి. టైగాలకు దక్షిణంగా ఉండే గడ్డి భూములను స్టెప్పీలు అంటారు.
-ఇవేగాక ఆగ్నేయాసియా దేశాలైన ఇండియా, ఇండోనేషి యా, మలేషియా, మయన్మార్, థాయ్‌లాండ్, న్యూగినియా మొదలైన దేశాల్లో ఉష్ణమండల రుతుపవన అరణ్యాలు ఉన్నాయి.
-తూర్పు ఆసియాలోని అడవులను సమశీతోష్ణ అడవులు అంటారు.
-ఆసియా ఖండానికి దక్షిణాన గల భూమధ్యరేఖా ప్రాంతా ల్లో పెరిగే అరణ్యాలను సతతహరితారణ్యాలు/ భూమధ్యరేఖా ప్రాంత అరణ్యాలు అంటారు.

ఆసియాలో అడవుల విస్తరణ

టండ్రా మండలం అరణ్యాలు
-ఇవి ఖండానికి ఉత్తరభాగాన 70o-80o వరకు విస్తరించినవి. టండ్రా అంటే శీతల ఎడారి (నిస్సారమైన భూము లు) ఇది అక్కడి ఉద్బిజ్జ సంపదలను సూచిస్తుంది. ఈ మండలం ఆసియాలోని రష్యా, సైబీరియా దేశాల్లో విస్తరించబడినది.
-టండ్రాల్లో వేసవి సగటు ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెంటిగ్రేడ్, వర్షపాతం వేసవికాలంలో సంభవిస్తుంది.

వృక్షసంపద

-ఇక్కడ పెరిగే వృక్షాలు ఫర్, పైన్, స్రూస్, లార్చీ, బిర్చ్. ఈ వృక్షాల నుంచి మెత్తని కలప లభిస్తుంది.
-ఫర్: దీనిని ఇండియాలో సిల్వర్‌ఫర్ అంటారు. దీనిని అగ్గిపుల్లల తయారీలో ప్యాకింగ్ పెట్టెల తయారీలో ఉపయోగిస్తారు.
-పైన్: కర్పూరతైలం తయారీలో ఉపయోగిస్తారు.
-బిర్చ్: ైప్లెవుడ్ తయారీలో వాడతారు.
-విల్లాస్: క్రికెట్ బ్యాట్ల తయారీలో వాడతారు.

టైగా/శృంగాకారపు అరణ్యాలు

-ఈ అరణ్యాలు ఖండానికి ఉత్తరభాగాన 55o- 70o వరకు విస్తరించి ఉన్నాయి. వీటినే కొనిఫెరస్ అరణ్యాలు అని పిలుస్తారు.
-టైగా అంటే శృంగాకారము అని అర్థం.
-ఈ రకమైన అరణ్యాలు ఆసియా ఖండంలోని రష్యా, సైబీరియాలోని కొంతభాగం సకాలిన్ దీవుల్లో విస్తరించినవి.
-ఇక్కడ పెరిగే అరణ్యాలు మెత్తని కలపనిస్తాయి. దీన్ని వాణిజ్య భాషలో డీల్‌ఉడ్ అంటారు. ఈ కలపతో చేసే వ్యాపారాన్ని లంబరింగ్ అంటారు.

ఇక్కడ పెరిగే వృక్షసంపద

-ఫర్, పైన్, స్రూస్, విల్లాస్, అల్డర్, జానిఫర్.
-టండ్రా, టైడా మండలంలోని ప్రధాన జంతువులు ధృవపు జింక, ధృవపు ఎలుగుబంటి, కస్తూరిమృగం, ధృవపునక్క

స్టెప్పీ మండలం/ సమశీతల గడ్డిభూములు

-ఇవి ఖండాలకు మధ్యభాగంలో 35o- 55o వరకు విస్తరించబడి ఉన్నాయి.
-ఇవి ఆసియా ఖండంలో వాయవ్వ చైనా ప్రాంతంలో లోయస్ భూములుగా పిలవబడుతున్నాయి. టర్కీలో అనటోలియా పీఠభూమిలో విస్తరించి ఉన్నాయి.
-ఈ మండలం విశిష్టలక్షణం ఏడాది మొత్తం వాతావరణం ఆర్ధ్రత తక్కువగాను, వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటుంది.
-ఈ మండలంలో వర్షపాతం వరుసగా కొన్ని సంవత్సరాలు సంభవించి ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు కరువు పరిస్థితులు ఏర్పడుతాయి.
-ఇక్కడి వర్షపాతం ఆయనరేఖా ప్రాంతాలకు దగ్గరలో సంవాహన రూపంలోనూ, సమశీతల ప్రాంతాల్లో చక్రవాత రూపంలోనూ ఉంటుంది.

సమశీతోష్ణ అడవులు

-తూర్పు ఆసియాలోని అడవులను సమశీతోష్ణ అడవులు అంటారు. ఇవి హాంకాంగ్, తైవాన్, దక్షిణకొరియా, జపాన్, ఉత్తరకొరియా, చైనా వంటి దేశాల్లో విస్తరించినవి.
-సతతహరిత అరణ్యాలు (భూమధ్యరేఖా ప్రాంత అరణ్యాలు)
-ఆసియా ఖండానికి దక్షిణాన భూమధ్యరేఖా ప్రాంతాల్లో పెరిగే అరణ్యాలను సతత హరితారణ్యాలు అంటారు.

దేశంలో విస్తరించిన ప్రాంతాలు

-పశ్చిమ కనుమలు, ఈశాన్య రాష్ర్టాలు, అండమాన్ నికోబార్ దీవులు

ఇక్కడ పెరిగే వృక్షాలు

-సింకోనా, మహగని, రోజ్‌వుడ్, ఎబోని, సాలు మొదలైనవి.
-ఎబోని కలప: పియానోకిట్స్ తయారీలో వాడతారు.
-సాలు: రైల్వే స్లీపర్ల తయారీలో వాడతారు. ఇంకా వీటిని అస్సాంలో బోట్ల తయారీకి ఉపయోగిస్తారు. మిగతావి వాణిజ్యానికి ఎక్కువగా పనికిరావు కాని వంటచెరుకుగా ఉపయోగిస్తారు.
నోట్: దేశంలో వంట చెరుకుకు ప్రసిద్ధి- కర్ణాటక, ప్రపంచంలో వంట చెరుకుకు ప్రసిద్ధి- ఇండోనేషియా

ఉష్ణమండల రుతుపవన అరణ్యాలు

-ఇవి ఆసియాఖండం మధ్య భాగంలో 10o- 25o ఉత్తరంగా వ్యాపించి ఉన్న అరణ్యాలను ఉష్ణమండల పచ్చిక బయళ్లు అంటారు.
-ఈ మండలంలో అధిక ఉష్ణోగ్రత, అల్పవర్షపాతం, అల్ప ఆర్థ్రత ఉంటుంది. వర్షపాతం సంవహన రకానికి చెంది.. భూమధ్యరేఖ నుంచి దూరం పోయేకొలది 150 సెం.మీ. నుంచి 25 సె.మీ.కు తగ్గిపోతుంది.
-ఈ మండలంలో పొగమంచు ఏర్పడదు.
-ఈ మండలంలో అన్ని జంతువులు కన్పిస్తాయి. అందువల్ల ఈ మండలాన్ని సహజ జంతు ప్రదర్శనశాల, వేటగాళ్లకు స్వర్గం అంటారు.
-ఇవి దేశంలో విస్తరించిన ప్రాంతాలు.. ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతం

పెరిగే ప్రధాన వృక్షాలు

-టేకు, వెదురు, గంధం, ఎర్ర చందనం, హల్దా, కేన్ మొదలైనవి.
-దేశంలో టేకు ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిన రాష్ట్రం- మధ్యప్రదేశ్
-ప్రపంచంలో టేకు ఉత్పత్తిలో ప్రసిద్ధి చెందిన దేశం- మయన్మార్

వెదురు

-దీన్ని పేదవారు గృహ అవసరాలకు, వివిధ ఉపకరణాల తయారీలో ఉపయోగిస్తారు. దీనిని పేదవానికలప అంటారు.

గంధం

-దీన్ని కాస్మొటిక్స్ తయారీలో ఉపయోగిస్తారు. ఇండియాలో గంధం ప్రసిద్ధి చెందిన రాష్ట్రం- కర్నాటక

ఎర్రచందనం

-దీన్ని జంత్ర (తీగ) వాయిద్యాల తయారీలో ఉపయోగిస్తారు.
ఉదా: వీణ, తుంబురా
-ఏపీలోని నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో లభిస్తుంది. వీటిని దిగుమతి చేసుకునే దేశాలు జపాన్, జర్మనీ

హల్దా

-దీనిని దువ్వెన, రూళ్ల కర్రల తయారీలో ఉపయోగిస్తారు.

కేన్

-కుర్చీలు, బుట్టలు, ఊయల తయారీలో ఉపయోగిస్తారు.

ప్రపంచంలోని కొన్ని ఉష్ణమండల రుతుపవన అరణ్యాలు
ప్రదేశం వాటిపేర్లు
ఆఫ్రికా సవాన్నాలు
దక్షిణా అమెరికా కంపాలు(బ్రెజిల్, బొలివియా)
వెనెజులా, కొలంబియా- లానోలు
-ఉష్ణమండల రుతుపవన అరణ్యాల్లోని ప్రధాన జంతువు- ఏనుగు

ఆసియా-వ్యవసాయం

-వ్యవసాయంలో నూతనంగా వచ్చిన మార్పుల్లో వ్యవసాయ ప్రత్యేకీకరణ ముఖ్యమైనది.
-వ్యవసాయ అభివృద్ధి మీద శీతోష్ణస్థితి, ఇతర సాంఘిక, ఆర్థిక కారణాంశాలు వ్యవసాయదారునికి అనుకూలంగా ఉండటం వల్ల అతడున్న ప్రాంతంలో ఒక రకమైన వ్యవసాయం క్రమేణ వృద్ధిలోకి వస్తూ ఉంది.

శీతోష్ణస్థితి, ఇతర కారణాంశాలు

-మరో విధంగా ఉన్న ప్రాంతాల్లో వేరొక రకమైన వ్యవసాయం అభివృద్ధిలోకి వస్తుంది.
-ప్రపంచ వ్యాప్తంగా, 1925 నుంచి వ్యవసాయంలోని రకాలను వ్యవసాయ ప్రాంతాలను గురించి తీవ్రంగా జరుగుతూ వచ్చింది. 1936లో డర్వెంట్ వైటల సీ అనే భూగోళ శాస్త్రజ్ఞుడు వ్యవసాయంలో 13 రకాలను పేర్కొన్నాడు. వాటిలో ముఖ్యమైనవి

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని సమశీతోష్ణ గడ్డిభూములు

-యూరేషియా: స్టెప్పీలు
(ఉక్రెయిన్ నుంచి కాస్పియస్ సముద్రం వరకు)
-ఆఫ్రికా: వెల్డులు (డ్రాకెన్‌బర్గ్ పర్వతాల వద్ద)
-ఉత్తర అమెరికా: ప్రయరీలు
(ఇంటర్‌మౌంటెన్ పర్వతాల వద్ద)
-దక్షిణ అమెరికా: పంపాలు
(పెటగొనియా ప్రాంతం వద్ద)
-ఆస్ట్రేలియా: డౌనులు
(ఈస్టర్న్ ఇలాండ్స్ పర్వతాల వద్ద)
-ప్రయరీలు గడ్డిభూములు చినూక్ అనే ఉష్ణపవనాల వలన వెచ్చగా ఉంటాయి.
-స్టెప్పీలు గడ్డిభూములు బురాన్ అనే శీతలపవనాల వలన శీతలంగా ఉంటాయి.
-హంగేరి ప్రాంతంలో గడ్డిభూములను పుస్తాజ్ అంటారు.
Kasam

1070
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles