బ్యాంకుల్లో 1163 స్పెషలిస్టు ఆఫీసర్లు


Fri,November 8, 2019 01:20 AM

IBPS
దేశంలోని 17 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది.పోస్టు : స్పెషలిస్ట్ ఆఫీసర్


మొత్తం పోస్టుల సంఖ్య: 1163
విభాగాలవారీగా ఖాళీలు: ఐటీ ఆఫీసర్ -76, అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్-670, రాజభాష అధికారి-27, లా ఆఫీసర్-60, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్-20, మార్కెటింగ్ ఆఫీసర్-310.
ఎస్‌వో ఖాళీలున్న బ్యాంకులు: అలహాబాద్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్&సింధ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
అర్హతలు: ఆయా పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.
వయస్సు: 2019, నవంబర్ 26 నాటికి 20-30 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా
ప్రిలిమినరీ పరీక్ష: 125 ప్రశ్నలు-150 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 120 ని॥

మెయిన్ పరీక్ష:

-ప్రిలిమినరీ పరీక్షలో నిర్దేశిత కటాఫ్ మార్కులను సాధించిన అభ్యర్థులను మెయిన్‌కు షార్ట్‌లిస్ట్ చేస్తారు. దీనిలో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేది: నవంబర్ 26
ప్రిలిమ్స్ పరీక్షతేదీ: డిసెంబర్ 28, 29
మెయిన్ పరీక్షతేదీ: 2020, జనవరి 25
వెబ్‌సైట్: https://www.ibps.in

896
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles