బీసీ స్టడీ సర్కిళ్లు కొలువులకు నెలవులు


Wed,November 6, 2019 12:24 AM

ఉద్యోగాలకు సంబంధించి రోజూ ఏదో ఒక నోటిఫికేషన్‌ విడుదలవుతూనే ఉంటుంది. వాటికి పోటీ తీవ్రంగానే ఉంటుంది. దీనికోసం సొంతంగా ప్రిపేరయ్యేవారు, వివిధ కోచింగ్‌ సెంటర్లకు వెళ్లి శిక్షణ తీసుకునేవారు ఉంటారు. అయితే ఇలా సొంతంగా ప్రిపరేషన్‌ కొనసాగించలేనివారికి, వేల రూపాయలు వెచ్చించి కోచింగ్‌కు వెళ్లలేనివారికి రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లు నెలవుగా మారాయి. శిక్షణకు సంబంధించిన సకల సౌకర్యాలు, స్టడీ మెటీరియళ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకుల బోధన, నిరంతర పర్యవేక్షణ ఉద్యోగార్థుల విజయానికి బాటలు వేస్తున్నాయి. టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన గ్రూప్‌-2 ఫలితాల్లో బీసీ స్టడీ సర్కిళ్లలో కోచింగ్‌ తీసుకున్న 235 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారి సక్సెస్‌లో బీసీ స్టడీసర్కిళ్లు ఎలాంటి పాత్ర పోషించాయనేదానిపై ప్రత్యేక కథనం..


- రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో మొత్తం 492 మంది గ్రూప్‌-2 కోచింగ్‌ తీసుకున్నారు. అందులో 15 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అదేవిధంగా పరీక్ష ఫలితాల అనంతరం నిర్వహించిన మాక్‌ ఇంటర్యూలకు 498 మంది హాజరుకాగా 235 మంది ఎంపికయ్యారు.
- గ్రూప్‌-2 శిక్షణ తరగతులు 2015, అక్టోబర్‌ నుంచి నాలుగు నెలలపాటు నిర్వహించారు. మాక్‌ ఇంటర్వ్యూలకు సంబంధించి అవగాహన తరగుతులను ఈ ఏడాది జూన్‌ 26 నుంచి 28 వరకు నిర్వహించారు. అనంతరం జూన్‌ 29 నుంచి ఆగస్టు 16 వరకు ప్రతి రోజు మాక్‌ ఇంటర్వ్యూలను నిర్వహించారు. టీఎస్‌పీఎస్సీ బోర్డు ఏవిధంగా ఇంటర్వ్యూలను నిర్వహిస్తుందో అదే తరహాలో జీడీ అరుణ (రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌), వీ సైదా (ప్రభుత్వ అదనపు సెక్రెటరీ), కే అలోక్‌ కుమార్‌ (బీసీ కార్పొరేషన్‌ ఎండీ), ప్రొ. అడపా సత్యనారాయణ (హిస్టరీ), నూతనకంటి వెంకట్‌ (డిప్యూటీ డైరెక్టర్‌, ఆడిట్‌ డిపార్ట్‌మెంట్‌), శ్రీలీల (డిప్యూటీ కమిషనర్‌, వాణిజ్య పన్నుల శాఖ), సీ వీరేందర్‌ (సైకాలజిస్ట్‌), ప్రొ. అనుపమరెడ్డి (ఇంగ్లిష్‌) వంటి సీనియర్‌ అధికారులు, విషయ నిపుణులతో ఇంటర్వ్యూ బోర్డులను ఏర్పాటు చేశారు. దీనివల్ల అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ నిర్వహించే ఇంటర్వ్యూపై ఒక అవగాహన కలగడంతోపాటు, వారికి తాము ఉద్యోగం సాధించగలమనే నమ్మకాన్ని ఏర్పర్చారు.
- ఉచితంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతోపాటు, ప్రధాన సబ్జెక్టులైన పాలిటీ, ఎకానమీ, చరిత్రలకు సంబంధించి మంచి అనుభవజ్ఞులైన అధ్యాపకులతో తరగతులను నిర్వహించింది. ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నది, వాటికి మనం ఎలా సమాధానాలు చెప్పాలి, మన హావభావాలు ఎలా ఉండాలి (బాడీ లాంగ్వేజ్‌), కమ్యూనికేషన్‌ విధానం వంటి అంశాల్లో వారికి నిపుణులతో శిక్షణ ఇచ్చింది.

ఏ ఉద్యోగానికి ఎంతమంది

- మున్సిపల్‌ కమిషనర్‌ (గ్రేడ్‌-3)- 1
- అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌- 37
- సబ్‌ రిజిస్ట్రార్‌ (గ్రేడ్‌-2)- 6
- ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (పంచాయతీరాజ్‌)- 14
- ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌- 84
- డిప్యూటీ తహసీల్దార్‌ (భూ పరిపాలన)- 63
- అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ (రిజిస్ట్రార్‌ కో ఆపరేటివ్‌ సొసైటీలు)- 7
- ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (గ్రేడ్‌-1), ఎండోమెంట్‌- 2
- అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌- 1
- అసిస్టెంట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ (హ్యాండ్లూమ్స్‌)- 6
- అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (జీఏడీ)- 14
- అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఆర్థికశాఖ)- 7
- అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (న్యాయశాఖ)- 2
A-RAKESH
- ఎ.రాకేష్‌, మంచిర్యాల

26 ఏండ్లకే డిప్యూటీ తహసీల్దార్‌గా

- నిరుపేద గ్రామీణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నేను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో డిప్యూటీ తహసీల్దార్‌ (డీటీ)గా ఎంపికయ్యాను. బీటెక్‌ పూర్తి చేసిన తర్వాత ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ కేంద్రంలో గ్రూప్స్‌ కోచింగ్‌లో చేరాను. అక్కడున్న పోటీ వాతావరణం, సౌకర్యాలు, సెంటర్‌ నిర్వాహకుడి నిరంతర పర్యవేక్షణ, ఉత్తమ అధ్యాపకుల బోధనతో గ్రూప్‌- 2 పరీక్షలో ఉత్తీర్ణత సాధించాను. అయితే ఇంటర్వ్యూలు ఆలస్యమవడం, టీఎస్‌పీఎస్సీ ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయడంతో జూనియర్‌ పంచాయతీ సెక్రెటరీ (జేపీఎస్‌)గా ఉద్యోగం లభించింది. అయినా గ్రూప్‌ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రిపరేషన్‌ను కొనసాగించాను. ఇటీవల విడుదలైన ఇంటర్వ్యూ ఫలితాల్లో డీటీగా ఎంపికయ్యాను. రామ్మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని బోర్డు నన్ను ఇంటర్వ్యూ చేసింది. నేను జేపీఎస్‌గా పనిచేస్తున్నందువల్ల గ్రామాల్లో వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలను గుర్తించావు (ప్రభుత్వం గుర్తించినవి కాకుండా), ఎలా అయితే గ్రామాలను అభివృద్ధి చేయవచ్చు, బీటెక్‌ కంప్యూటర్స్‌ కావడంతో టెక్నాలజీకి, సోషల్‌ మీడియాకు సంబంధించిన ప్రశ్నలు, ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యపానాన్ని నిషేధిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురైతాయి, ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయాలు ఏంటివి అనే ప్రశ్నలు అడిగారు.
A-RAKESH1
నామోజు బాలాచారి
తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌
స్టేట్‌ డైరెక్టర్‌

- గ్రూప్‌-2 కి సంబంధించి బీసీ స్టడీ సర్కిల్‌ నిర్వహించిన మాక్‌ ఇంటర్వ్యూల్లో పాల్గొన్న వారిలో 235 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఒకే నోటిఫికేషన్‌లో ఇంతమంది ఎంపికవడం ఇప్పటి వరకు ఇదే మొదటిసారి. మొత్తం 558 మంది తమ పేర్లను నమోదుచేసుకోగా 498 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వివిధ హోదాల్లో ఉన్న సీనియర్‌ అధికారులు, సైకాలజిస్టులు, విషయ నిపుణులైన 17 మందితో ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటు చేసి 45 రోజులు ఇంటర్యూలు నిర్వహించాం. చాలా మంది ఎంపిక కావడంతో ఇది ఒక మంచి అనుభూతిని మిగిల్చింది. 2014 నుంచి 19 వరకు మొత్తం 1970 మంది ఎంపికయ్యారు. ప్రభుత్వ ఉద్యోగాలకోసం సన్నద్ధమయ్యేవారికి బీసీ స్టడీ సర్కిళ్లు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. జిల్లాల్లోని సెంటర్లలో జాబ్‌ కార్నర్‌ ఏర్పాటు చేశాం. ప్రతి రోజు విడుదలయ్యే నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంచుతున్నాం. ఈ ఏడాది గ్రూప్‌-1కు సంబంధించి ఫౌండేషన్‌ కోర్సును రెండు బ్యాచులు, అర్థమెటిక్‌, రీజనింగ్‌, ఇంగ్లిష్‌కు సంబంధించి ఫౌండేషన్‌ కోర్సును రెండు బ్యాచులు నిర్వహిస్తున్నాం. స్టడీ సెంటర్లలో అందుబాటులో ఉన్న కంప్యూటర్లలో వివిధ పోటీ పరీక్షలకు అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకునేలా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సరిగా అవగాహన ఉండటంలేదు. వారికోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి, ఆయా పరీక్షల్లో జనరల్‌ సబ్జెక్టులైన ఇంగ్లిష్‌, రీజనింగ్‌, అర్థమెంటిక్‌పై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. స్టడీ సర్కిల్‌లో రిజిస్టర్‌ అయిన అభ్యర్థులకు ప్రతి నెలా ఉండే పోటీ పరీక్షలు, విడుదలైన నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలు, నిపుణుల సలహాలతో కూడిన మ్యాగజీన్‌ను పోస్టుద్వారా పంపించాలని నిర్ణయించాం. దీన్ని త్వరలో విడుదల చేస్తాం.
A-RAKESH2
- జీ రోహిణి, గద్వాల

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో..

- నేను ఎంఎస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ పూర్తిచేశాను. కొన్ని రోజులు ఒక ల్యాబ్‌లో ఉద్యోగం చేసిన తర్వాత ఆత్మకూర్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కాంట్రాక్ట్‌ అధ్యాపకురాలిగా చేరాను. గద్వాలలో డిగ్రీవరకు చదివాను. హైదరాబాద్‌లో పీజీ చేశాను. నేను మొదటి నుంచి ఫస్ట్‌ ర్యాంక్‌ స్టూడెంట్‌నే. పీజీలో ఆర్గానిక్‌ కెమిస్ట్రీ చేసినప్పటికీ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఇక్కడి ప్రజలకు నావంతు సేవచేయాలని అనుకున్నాను. మాది పేద కుటుంబం. తండ్రి చనిపోయారు. అమ్మ టైలరింగ్‌ చేస్తూ చదివించింది. అందువల్ల నా లక్ష్యం మేరకు 2013లో బీసీ స్టడీ సర్కిల్‌లో గ్రూప్స్‌ కోచింగ్‌లో చేరాను. అక్కడ ఉచితంగా పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌, స్కాలర్‌షిప్‌ అందుకున్నాను. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో తరగతులు నిర్వహించడం, నా పట్టుదలతో మొత్తం నాలుగు ఉద్యోగాలకు ఎంపికయ్యాను. తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన నోటిఫికేషన్‌లో గ్రూప్‌-2 పరీక్ష రాశాను. ఫలితాలు వెలువడే లోపే టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గురుకుల, టీఆర్‌టీ ఉద్యోగాలకు ఎంపికయ్యాను. ప్రస్తుతం హన్వాడ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో పీజీటీగా పనిచేస్తున్నాను. టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన గ్రూప్‌-2 ఫలితాల్లో నేను ఏసీటీవోగా ఎంపికయ్యాను.

కోచింగ్‌ చాలా ఉపయోగపడింది

- రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో ఉద్యోగం చేయాలని నా కోరిక. బీటెక్‌ ఎలక్ట్రానిక్స్‌ పూర్తిచేసినప్పటికీ టెక్నికల్‌ వైపు వెళ్లలేదు. గ్రూప్స్‌కి ప్రిపేపవ్వాలని నిర్ణయించుకున్నాను. దానికి అనుగుణంగా కరీంగనర్‌లోని బీసీ స్టడీసర్కిల్‌ (2013)లో గ్రూప్స్‌ కోచింగ్‌కు సీటు సంపాదించాను. అక్కడ పొందిన శిక్షణ నాకు చాలా ఉపయోగపడింది. నోటిఫికేషన్లు ఆలస్యమవడంతో బ్యాంకింగ్‌ పరీక్షలవైపు దృష్టిసారించాను. 2014లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు క్లర్క్‌గా ఉద్యోగం లభించింది. అది చేస్తూనే గ్రూప్స్‌ ప్రిపరేషన్‌ కొనసాగించాను. టీఎస్‌పీఎస్సీ విడుదలచేసిన గ్రూప్‌-2 ఫలితాల్లో ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌గా ఎంపికయ్యాను.
- బీ. ప్రదీప్‌ కుమార్‌, పెద్దపల్లి
A-RAKESH3
- చాంద్‌బీ షేక్‌, సూర్యాపేట

అనుభవం, అంకిభావం కలిగిన అధ్యాపకులు

- మాది సూర్యాపేటలోని లక్కవరం. అమ్మ నాన్నలు ఇద్దరు రైతులు. 2014లో ఎంఫార్మసీ పూర్తిచేశాను. తర్వాత గ్రూప్స్‌కి సన్నద్ధమవడం ప్రారంభించాను. నల్లగొండ బీసీ స్టడీ సర్కిల్‌లో 2015, అక్టోబర్‌లో గ్రూప్స్‌ కోచింగ్‌లో జాయిన్‌ అయ్యాను. అక్కడ అనుభవజ్ఞులు, అంకితభావం కలిగిన అధ్యాపకులతో తరగతులు నిర్వహించారు. దీంతోపాటు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన మోటివేషనల్‌ తరగతులు నిర్వహించారు. ఇది ఉద్యోగాన్ని సంపాదించగలమన్న నమ్మకాన్ని కలిగించింది. అక్కడ కోచింగ్‌ బాగా ఉండటం వల్ల గ్రూప్‌-2, ఎస్‌ఐ పరీక్షలు కొద్ది రోజుల తేడాతో జరిగినప్పటికీ, రెండు పరీక్షల్లో విజయం సాధించగలిగాను. గ్రూప్‌-2 ఫలితాలు ఆలస్యమవడంతో ఎస్‌ఐగా శిక్షణ పొందుతున్నాను. అయినప్పటికీ గ్రూప్‌-2 ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రిపరేషన్‌ కొనసాగించాను. అయితే ఇంటర్వ్యూలు ఎదుర్కోవడం మొదటిసారి కావడంతో ఒకింత కంగారుకు లోనయ్యాను. నల్లగొండ స్టడీ సెంటర్‌ నిర్వాహకుని సూచనతో మాక్‌ ఇంటర్వ్యూకి రిజిస్ట్రేషన్‌ చేసుకుని, అవగాహన తరగతులు, ఇంటర్వ్యూకి హాజరయ్యాను. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో నేను చేసిన పొరపాట్లు, ఎక్కడ మెరుగవ్వాలి అనే విషయాల గురించి వివరించారు. నేను వాటిని సరిచేసుకోవడానికి అవకాశం లభించింది. టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో ఎక్సైజ్‌ ఎస్‌ఐగా ఎంపికయ్యాను.

నేటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలంటే భగీరథ ప్రయత్నమే చేయాల్సి వస్తుంది. ఎంతోమంది రాత్రీపగలూ కష్టపడి చదివినా ఎక్కడో చిన్న పొరపాటుతో విజయం సాధించలేకపోతుంటారు. మరికొందరు మాత్రం ఒకే సమయంలో ఒకటికి మించి ఉద్యోగాలు సాధిస్తుంటారు. వారు ఇతరులకంటే భిన్నంగా చేసే పని సరైన ప్రణాళికతో ముందుకెళ్లడం... ఈ కోవలోకే వస్తారు ఇటీవల గ్రూప్‌-2లో విజయం సాధించిన లక్కిరెడ్డి శివతేజ.. నిపుణతో వారు తమ అనుభవాలను పంచుకున్నారు.
A-RAKESH4
- లక్కిరెడ్డి శివతేజ
- నా పేరు లక్కిరెడ్డి శివతేజ. అమ్మానాన్నలు ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. చిన్నప్పటి నుంచి చదువుపై పెద్దగా శ్రద్ధ ఉండేది కాదు. మ్యాథ్స్‌ అంటే విపరీతంగా భయపడేవాడిని. నాలుగేండ్లయినా బీటెక్‌ ఫస్టియర్‌ మ్యాథమెటిక్స్‌ పేపర్‌ పాస్‌ కాలేదు. దాంతో ఐదో ఏడాది మ్యాథ్స్‌ ట్యూషన్‌లకు వెళ్లి మంచి మార్కులతో పాసయ్యాను. అప్పటి నుంచి నాకు మ్యాథ్స్‌పై ఆసక్తితోపాటు, ఆత్మవిశ్వాసం పెరిగింది. 2014లో హైదరాబాద్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో చేరాను. కానీ మధ్యలోనే మానేశాను. 2015లో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు కోచింగ్‌ తీసుకున్నాను.
- మొదటి ప్రయత్నంలోనే గ్రూప్‌-2 ్రఉద్యోగం సాధించాను. దీనిక సంబంధించినప్రిపరేషన్‌ చాలా జాలీగా సాగిపోయింది. నాలాగే పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న 25 మంది స్నేహితులతో నిత్యం టచ్‌లో ఉంటూ ప్రిపరేషన్‌ కొనసాగించాను. సాధారణంగా రోజుకు 4 నుంచి 5 గంటలు చదివేవాడిని. అయితే గ్రూప్‌-2, ఎస్‌ఐ, సీజీఎల్‌ పరీక్షలు ఒకే రోజు రావడంతో ఆఖరి నెల మొత్తం రోజుకు 15 గంటలపాటు చదవాల్సి వచ్చింది.
- NCERT పుస్తకాలతోపాటు మార్కెట్‌లో ఉన్న అన్ని ప్రామాణిక పుస్తకాలు చదివాను.
- 2017 ఎస్‌ఐ రిజల్ట్స్‌లో స్టేట్‌ 4వ ర్యాంక్‌, తర్వాత ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పరీక్షలో స్టేట్‌ 2వ ర్యాంక్‌ వచ్చింది. ప్రస్తుతం వరంగల్‌ కమిషనరేట్‌లో ఎస్సైగా పనిచేస్తున్నాను. ఇప్పుడు గ్రూప్‌-2లో స్టేట్‌ 5వ ర్యాంక్‌ సాధించి డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యాను.
- ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రిపరేషన్‌ సాగించాలి. ఒత్తిడిని జయిస్తేనే సక్సెస్‌ వరిస్తుంది. ఉన్నవా టిలో ఒక ఉద్యోగం మనదే అన్న నమ్మకంతో చదవాలి. దినపత్రికల్లో వచ్చే వార్తలతోపాటు ఇంటర్నెట్‌లో అవసరమైన సమాచారం సేకరించుకుని చదివితే పరీక్షలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
- నా మొదటి ఇంటర్వ్యూ FRO ఉద్యోగం కోసం వెళ్లినప్పుడు జరిగింది. చక్రపాణి సార్‌ బోర్డు నన్ను ఇంటర్వ్యూ చేసింది. గ్రూప్‌-2 ఇంటర్వ్యూకి సంబంధించి విఠల్‌ సార్‌ బోర్డు నన్ను ఇంటర్వ్యూ చేసింది. బోర్డు అడిగిన వాటిలో దాదాపు 30 శాతం ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పలేకపోయాను. కాస్ట్‌ బెనిఫిట్‌ అనాలిసిస్‌ అంటే ఏమిటి? శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు తీసుకుని కాస్ట్‌ బెనిఫిట్‌ అనాలిసిస్‌ చేయండి లాంటి ప్రశ్నలు అడిగారు.
- నాకు తెలిసినంత వరకు ఇంటర్వ్యూకు కావాల్సిన మూడు ముఖ్యమైన లక్షణాలు ఆత్మవిశ్వాసం, మర్యాదపూర్వక ప్రవర్తన, నిజాయితీ. ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడానికి మాక్‌ టెస్టులకు హాజరైతే సరిపోతుంది.

- గణేష్‌ సుంకరి

950
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles