బీఎస్ ఎంఎస్ @ ఐసర్


Wed,October 30, 2019 01:44 AM

సైన్స్.. ప్రపంచ మానవాళి మనుగడను సుఖవంతం, భద్రమైన దిశకు నడిపించేందుకు నిరంతరం పరిశ్రమిస్తుంటుంది. సైన్స్ పరిశోధనల విషయంలో భారత్‌లో అనుకున్నంత ప్రగతి లేదు. విజ్ఞానశాస్త్రంలో పరిశోధనల ద్వారా సామాజిక సమస్యలకు స్థిరమైన పరిష్కారాలను కనిపెట్టి, అమలు చేయడమే ప్రధాన లక్ష్యంగా ప్రారంభించిన సంస్థ ఐసర్... అంటే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్&రిసెర్చ్ (ఐసర్). పరిశోధనల పై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ సంస్థలు వరదాయినిగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయస్థాయి పరిశోధనలు చేయడానికి వీలుగా వీటిని స్థాపించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐసర్‌లలో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం...
IISER


ఐసర్: 2006లో మొదట కోలకతా, పుణెలలో ఐసర్‌ను ప్రారంభించారు. అనంతరం మొహాలి, భోపాల్, తిరువనంతపురం, తిరుపతి, బెర్హంపూర్‌లలో వీటిని ప్రారంభించారు.
ప్రత్యేకతలు: ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ విద్య, పరిశోధనలను ఏకీకృతం చేయడానికి, ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. తక్కువ వ్యవధిలో ఐసర్‌లు ప్రచురణలు, పేటెంట్ల రూపంలో నమ్మశక్యం కాని మేధో సంపత్తిని సృష్టించాయి.

ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2020

ఈ టెస్ట్ ద్వారా బీఎస్-ఎంఎస్ ప్రోగ్రామ్‌లో ప్రవేశం కల్పిస్తారు.
బీఎస్-ఎంఎస్: ఇది ఐదేండ్ల డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ (సైన్స్ విద్యార్థులకు), వీటిలో బయలాజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, డాటా సైన్సెస్, ఎర్త్&ైక్లెమెట్ సైన్సెస్/ఎర్త్&ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, ఇంజినీరింగ్ సైన్సెస్ (కెమికల్ ఇంజినీరింగ్, డాటా సైన్స్&ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్&కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్), జియాలజికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ ఉన్నాయి.
నోట్: ఐసర్ భోపాల్‌లో నాలుగేండ్ల బీఎస్ ఇంజినీరింగ్ సైన్సెస్ అండ్ ఎకనామిక్స్ ప్రోగ్రామ్ ఉంది.

ఎవరు అర్హులు?

-ఇంటర్ లేదా తత్సమాన కోర్సు (ఎంపీసీ/బైపీసీ) ఉత్తీర్ణులు (2019) లేదా 2020లో సెకండియర్ పరీక్షలు రాయనున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
-ప్రవేశాలను మూడు చానల్స్ ద్వారా చేస్తారు. అవి.. కేవీపీవై, జేఈఈ అడ్వాన్స్‌డ్, స్టేట్ అండ్ సెంట్రల్ బోర్డ్స్ చానెల్ (ఎస్‌సీబీ).

ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ తేదీ

పరీక్ష కేంద్రాలు: రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 2020, మార్చి 23 నుంచి ప్రారంభం (ఎస్‌సీబీ చానెల్)
చివరితేదీ: 2020, ఏప్రిల్ 30 (సాయంత్రం 5 గంటలకు)
పరీక్ష తేదీ: 2020, మే 31
వెబ్‌సైట్: http://www.iiseradmission.in

-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

694
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles