ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌-2019


Wed,October 23, 2019 12:52 AM

SSC
కేంద్రంలోని వివిధ శాఖల్లో గ్రూప్‌ బీ, సీ పోస్టుల భర్తీ ప్రక్రియను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ చేపడుతుంది. వేలాది ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఎస్‌ఎస్‌సీ కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ (సీజీఎల్‌) ఎగ్జామ్‌ను నిర్వహిస్తుంది. ఏటా విడుదలయ్యే ఈ నోటిఫిషన్‌ ఈసారి కొంత ఆలస్యమైంది. దీని ద్వారా భర్తీ చేసే పోస్టులు, అర్హతలు, పరీక్ష విధానం నిపుణ పాఠకుల కోసం...


- సీజీఎల్‌: కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామ్‌. దీనిద్వారా కేంద్రప్రభుత్వ వివిధ శాఖల్లో గ్రూప్‌ బీ, సీ స్థాయి పోస్టులను భర్తీ చేస్తారు. దేశంలో బాగా క్రేజీ ఉన్న ఎగ్జామ్‌లలో ఇది ఒకటి. గతేడాది ఈ పరీక్షకు 25.97 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష రాసినవారి సంఖ్య మాత్రం 8,34,746 మంది మాత్రమే. అంటే దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం 32.27 శాతం మాత్రమే పరీక్ష రాశారు. గతేడాది 131 పట్టణాల్లో 362 కేంద్రాల్లో 22 షిప్టుల్లో పరీక్షను నిర్వహించారు.

భర్తీచేసే పోస్టులు

గ్రూప్‌ బీ కేటగిరీ పోస్టులు:

- అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఇన్‌కంట్యాక్స్‌, ఇన్‌స్పెక్టర్‌ (సెంట్రల్‌ ఎక్సైజ్‌), ఇన్‌స్పెక్టర్‌ ప్రివింటివ్‌ ఆఫీసర్‌, ఇన్‌స్పెక్టర్‌ ఎగ్జామినర్‌, అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌, ఎస్‌ఐ (సీబీఐ), ఇన్‌స్పెక్టర్‌ పోస్ట్స్‌, డివిజనల్‌ అకౌంటెంట్‌, ఇన్‌స్పెక్టర్‌ (సీబీఎన్‌), ఎస్‌ఐ (ఎన్‌ఐఏ), జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌.

గ్రూప్‌ సీ కేటగిరీ పోస్టులు:

- ఆడిటర్‌, అకౌంటెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌, సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌/యూడీసీ, ట్యాక్స్‌ అసిస్టెంట్‌, ఎస్‌ఐ (సీబీఎన్‌) పోస్టులు.

పేస్కేల్‌:

- గ్రూప్‌ బీ పోస్టులకు రూ.9,300-34,800
(గ్రేడ్‌ పే రూ.5,400/4,800
లేదా 4,600/4,200/-)

- గ్రూప్‌ సీ పోస్టులకు పేస్కేల్‌: 5,200-20,200/-
(గ్రేడ్‌ పే రూ.2,800/2400 లేదా
2000/1900 లేదా 1800/-)

ఎంపిక విధానం

- నాలుగు దశల్లో ఎంపిక ఉంటుంది.

- టైర్‌-I, II, III, IV. వీటిలో టైర్‌-I, IIలు కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామ్స్‌. టైర్‌-III పెన్‌ అండ్‌ పేపర్‌ మోడ్‌ (డిస్క్రిప్టివ్‌ పేపర్‌), టైర్‌- IV కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌/స్కిల్‌ టెస్ట్‌ /డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ (టైర్‌- IV కొన్ని పోస్టులకు మాత్రమే ఉంటుంది)
- టైర్‌-I, II లలో జనరల్‌ ఇంటెలిజెన్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌లపై ప్రశ్నలు ఇస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్‌ 22
- పరీక్ష తేదీలు: 2020, మార్చి 2 నుంచి 11 మధ్య నిర్వహిస్తారు.
- వెబ్‌సైట్‌: https://ssc.nic.in

ఈ పరీక్షలు రాయడానికి అర్హులు

- జూనియర్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా లేదా డిగ్రీలో స్టాటిస్టిక్స్‌ చదివి ఉండాలి. మిగిలిన పోస్టులన్నింటికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
- వయస్సు: 20-32 ఏండ్ల మధ్య ఉండాలి. ఆయా పోస్టులను బట్టి వయస్సు వేర్వేరుగా ఉంటుంది. రిజర్వ్‌డ్‌ కేటగిరీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

- కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

1068
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles