సొంత జిల్లాలో సర్కారీ కొలువు


Wed,October 23, 2019 12:23 AM

FEMA
దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) 2435 లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సవాళ్లను అధిగమించి, జీవితంలో స్థిరపడాలనుకునే అర్హులైన అభ్యర్థులకు ఇది చక్కని అవకాశం. పోస్టులు భారీ సంఖ్యలో ఉండటంతో చక్కటి ప్రణాళికతో ప్రిపరేషన్‌ కొనసాగిస్తే తక్కువ సమయంలో సిలబస్‌ను పూర్తిచేసి జేఎల్‌ఎం ఉద్యోగాలు పొందవచ్చు.
- అర్హత: పదోతరగతి ఉత్తీర్ణులవ్వాలి. ఎలక్ట్రికల్‌ లేదా వైర్‌మెన్‌ ట్రేడ్‌లో రెండేండ్ల ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ కోర్సు (ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌) ఉత్తీర్ణత పొంది ఉండాలి.
- వయోపరిమితి: 2019, జూలై 1 నాటికి 18 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేండ్లు సడలింపు ఉంటుంది.
- పే స్కేల్‌: రూ. 15,585,-25,200
- ప్రొబేషన్‌: అపాయింటెడ్‌ అభ్యర్థులు మొదటి రెండేండ్లు ప్రొబేషన్‌ సర్వీసులో ఉంటారు. రెండ్లే తర్వాత సర్వీస్‌ రెగ్యులరైజ్‌ చేస్తారు. ప్రొబేషన్‌ పీరియడ్‌ నుంచి పేస్కేల్‌ వర్తిస్తుంది.


పరీక్ష విధానం

- సెక్షన్‌-ఏ: ఐటీఐ ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌ (కోర్‌ సబ్జెక్టుల నుంచి)- 65 ప్రశ్నలు, 65 మార్కులు
- సెక్షన్‌-బీ: జనరల్‌ నాలెడ్జ్‌ - 15 ప్రశ్నలు, 15 మార్కులు
- పరీక్ష సమయం: 120 నిమిషాలు (2 గంటలు)
- రాత పరీక్ష 80 మార్కులకు నిర్వహిస్తారు.
- పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను పోల్‌ ైక్లెంబింగ్‌కు పిలుస్తారు. ఇది 20 మార్కులకు ఉంటుంది.
- తర్వాత ధృవీకరణ పత్రాల నిర్ధారణ ఉంటుంది. ఇందులో అర్హత సాధించినవారే ఉద్యోగానికి అర్హులవుతారు.

ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌ (సెక్షన్‌-ఏ)

- ఇది 65 మార్కులకు ఉంటుంది. ఇందులో ఫండమెంటల్స్‌ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ, బ్యాటరీలు, మ్యాగ్నటిజమ్‌, ఫండమెంటల్స్‌ ఆఫ్‌ ఏసీ, బేసిక్‌ ఎలక్ట్రానిక్స్‌, డీసీ మెషిన్స్‌, ట్రాన్స్‌ఫార్మర్స్‌, ఏసీ మెషిన్స్‌, ఎలక్ట్రికల్‌ మెజర్‌మెంట్స్‌, ఎలక్ట్రికల్‌ పవర్‌ జనరేషన్‌, ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

జనరల్‌ నాలెడ్జ్‌ (సెక్షన్‌-బీ)

- ఇది 15 మార్కులకు ఉంటుంది. ఇందులో అనలిటికల్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, కరెంట్‌ అఫైర్స్‌ (వర్తమాన అంశాలు), జనరల్‌ సైన్స్‌ ఎవ్రీడేలైఫ్‌ (నిత్య జీవితంలో విజ్ఞానశాస్త్రం), వినియోగదారుల సంబంధాల విషయాలు, ఎన్విరాన్‌మెంటల్‌ ఇష్యూస్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (పర్యావరణ సమస్యలు, విపత్తుల నిర్వహణ), తెలంగాణ, భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రం, అర్థశాస్త్రం, తెలంగాణ చరిత్ర, ఉద్యమం, సొసైటీ, కల్చర్‌, హెరిటేజ్‌, ఆర్ట్స్‌ అండ్‌ లిటరేచర్‌ ఆఫ్‌ తెలంగాణ (సంఘం, సంస్కృతి, వారసత్వం, కళలు, తెలంగాణ సాహిత్యం) నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- కోర్‌ సబ్జెక్టులో ప్రధానంగా చదవాల్సిన అంశాలు...

ఫండమెంటల్స్‌ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ

- సిలబస్‌లో ఎలక్ట్రికల్‌ ఆక్యుషేషనల్‌ సేఫ్టీ టూల్స్‌, ఓమ్స్‌ లా, కిర్చాఫ్‌ నియమాలు, సిరీస్‌ అండ్‌ ప్యారలల్‌ కనెక్షన్‌, స్టార్‌ డెల్టా ప్రాబ్లమ్స్‌, ఎలక్ట్రోస్టాటిక్స్‌ అండ్‌ కెపాసిటర్స్‌, ఎర్తింగ్‌ ప్రిన్సిపుల్స్‌, ఎర్తింగ్‌ పద్ధతులు వంటి అంశాలు ఉన్నాయి. ఇందులో తరచుగా కిర్చాఫ్‌ నియమాలు, నిరోధాల సిరీస్‌, ప్యారలల్‌, సంధానం, కెపాసిటర్లు, ఎర్తింగ్‌ పద్ధతుల నుంచి విరివిగా ప్రశ్నలు అడుగుతున్నారు.
ఉదా: ఒక వాహక నిరోధం R.... దాని వ్యాసార్థాన్ని సగం చేసి, పొడవును రెండు రెట్లు చేస్తే ఎంత నిరోధాన్ని కలిగి ఉంటుంది? (4)
1) R....
2) 2R...
3) 4R....
4) 8R....

బ్యాటరీలు

- ఇందులో ప్రైమరీ అండ్‌ సెకండరీ సెల్స్‌, లెడ్‌ యాసిడ్‌ సెల్స్‌, మెథడ్స్‌ ఆఫ్‌ చార్జింగ్‌, టెస్టింగ్‌ అండ్‌ అప్లికేషన్‌ ఆఫ్‌ బ్యాటరీస్‌, ఇన్వర్టర్స్‌, బ్యాటరీ చార్జర్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ అంశాలు ఉంటాయి. వీటిలో ప్రైమరీ అండ్‌ సెకండరీ సెల్స్‌ మధ్య వ్యత్యాసం-రకాలు, లెడ్‌ యాసిడ్‌ బ్యాటరీ, అప్లికేషన్స్‌, మెథడ్స్‌ ఆఫ్‌ చార్జింగ్‌లోని అంశాలను క్షుణ్ణంగా చదవాలి.

ఉదా

- రెడ్‌ యాసిడ్‌ సెల్స్‌ స్పెసిఫిక్‌ గ్రావిటీ ఎంత?
- ఆనోడ్‌, క్యాథోడ్లుగా ఏ మెటీరియళ్లను వాడుతారు?
- ఎలక్ట్రోరైట్‌గా లెడ్‌ యాసిడ్‌ సెల్‌లో దేన్ని ఉపయోగిస్తారు?
- లెడ్‌ యాసిడ్‌ సెల్‌ కెపాసిటీ ఎంత?
- మెథడ్స్‌ ఆఫ్‌ చార్జింగ్‌ (ట్రికిల్‌ చార్జింగ్‌ లేదా బూస్ట్‌ చార్జింగ్‌) వంటి ప్రశ్నలు అడుగుతారు.

మ్యాగ్నటిజమ్‌

- ఇందులో మ్యాగ్నటిక్‌ మెటీరియల్స్‌ అండ్‌ ప్రాపర్టీస్‌, లాస్‌ ఆఫ్‌ మ్యాగ్నటిజమ్‌, ఎలక్ట్రోమ్యాగ్నటిక్‌ ఇంక్షన్‌ అంశాలు ఉన్నాయి. వీటిలో అయస్కాంత పదార్థాలు (డయా, పారా, ఫెర్రో)-వాటి ధర్మాలు, విద్యుత్‌ అయస్కాంత ప్రేరణ అంశాలపై ప్రధానంగా దృష్టి కేద్రీకరించాలి.

1. నీరు ఏ అయస్కాంత పదార్థం? (3)

1) పారా
2) ఫెర్రో
3) డయా
4) ఏదీకాదు

2. విద్యుదయస్కాంత ప్రేరణ ఆధారంగా ఏది పనిచేస్తుంది? (3)

1) రేడియో
2) మోటర్‌
3) జనరేటర్‌
4) రెక్టిఫైర్‌

ఫండమెంటల్స్‌ ఆఫ్‌ ఏసీ

- ఇందులో సింపుల్‌ ప్రాబ్లమ్స్‌ ఆఫ్‌ ఏసీ ఫండమెంటల్స్‌, పవర్‌, పవర్‌ ఫ్యాక్టర్‌, సింగిల్‌ ఫేజ్‌ అండ్‌ త్రీ ఫేజ్‌ సర్క్యూట్స్‌ వంటి అశాలు ఉంటాయి. వీటిలో ఆర్‌ఎంఎస్‌ వ్యాల్యూ, యావరేజ్‌ వ్యాల్యూ, పవర్‌, పవర్‌ ఫ్యాక్టర్‌, యూనిట్స్‌ అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి.
- నైన్‌వేవ్‌కు ఆర్‌ఎంఎస్‌ విలువ ఎంత?, రియల్‌ పవర్‌ను ఏ యూనిట్లలో కొలస్తారు? పవర్‌ ఫ్యాక్టర్‌ గరిష్ట విలువ ఎంత? వంటి ప్రశ్నలు అడుగుతారు.

1. పవర్‌ ఫ్యాక్టర్‌ విలువ సాధారణంగా? (3)

1) >1
2) <2
3) 0, 1
4) -1. +1

బేసిక్‌ ఎలక్ట్రానిక్స్‌

- ఇందులో ఎలక్ట్రానిక్‌ కాంపొనెంట్స్‌, రెక్టిఫైర్స్‌, ఆంప్లిఫైర్స్‌, అసిలేటర్స్‌ అండ్‌ పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ కాంపోనెంట్స్‌ వంటి అంశాలు ఉంటాయి. వీటిలో బేసిక్‌ ఎలక్ట్రానిక్‌ కాంపోనెంట్స్‌ (డయోడ్‌, ట్రాన్సిస్టర్‌), క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ సెమీ కండక్టర్స్‌, పవర్‌ ఎలక్ట్రానిక్‌ కాంపోనెంట్స్‌ (ఎస్‌సీఆర్‌ థైరిస్టర్‌) అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- ఐటీఐ అభ్యర్థులకు కోర్సులో ఎలక్ట్రానిక్స్‌ గురించి సమగ్రంగా ఉండదు. కాబట్టి ప్రాథమిక (క్లాసిఫికేషన్‌పై) అంశాలపై మాత్రమే ప్రశ్నలు అడుగుతారు.

1. రెక్టిఫైర్‌ ......ను ......గా మారుస్తుంది? (1)

1) ఏసీ, డీసీ
2) డీసీ, ఏసీ
3) ఏసీ, ఏసీ
4) డీసీ, డీసీ

2. అర్ధవాహకాలకు మలినాలను కలిపే ప్రక్రియ? (2)

1) పంపింగ్‌
2) డోపింగ్‌
3) డంపింగ్‌
4) డ్రిల్లింగ్‌

డీసీ మెషీన్స్‌

- ఇందులో కన్‌స్ట్రక్షన్‌, వర్కింగ్‌ ప్రిన్సిపుల్‌ అండ్‌ సింపుల్‌ ప్రాబ్లమ్స్‌ ఆన్‌ డీసీ జనరేటర్స్‌ అండ్‌ మోటార్స్‌, స్పీడ్‌ కంట్రోల్‌ అండ్‌ అప్లికేషన్స్‌ ఆఫ్‌ డీసీ మోటార్స్‌ వైండింగ్స్‌ వంటి అంశాలు ఉంటాయి. వీటిలో కన్‌స్ట్రక్షన్‌, ఆర్మేచర్‌ కోర్‌ మెటీరియల్‌, ఆర్మేచర్‌ వైండింగ్‌ రకాలు, ఆర్మేచర్‌ రియాక్షన్‌, ఈఎంఎఫ్‌ ఈక్వేషన్‌ పైన ప్రాబ్లమ్స్‌, అప్లికేషన్స్‌, స్పీడ్‌ కంట్రోల్‌ మెథడ్స్‌ వంటివి ప్రధానాంశాలు.

1. డీసీ మెషీన్స్‌లో కాముటేటర్‌ ......ని ......గా మార్చుతుంది. (3) 1) ఏసీని డీసీగా
2) డీసీని ఏసీగా
3) 1, 2
4) లో ఫ్రీక్వెన్సీని హై ఫ్రీక్వెన్సీగా

ట్రాన్స్‌ఫార్మర్స్‌

- సిలబస్‌లో కన్‌స్ట్రక్షన్‌, వర్కింగ్‌ ప్రిన్సిపుల్‌, బేసిక్‌ కాన్సెప్ట్స్‌, సింపుల్‌ ప్రాబ్లమ్స్‌ ఆన్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌, ఆటో ట్రాన్స్‌ఫార్మర్స్‌, పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌, కరెంట్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ (సీటీ), పొటెన్షియల్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ (పీటీ) వంటి అంశాలుంటాయి. ఇందులో కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్స్‌, కోర్‌టైప్‌, షేర్‌టైప్‌, సీటీ, పీటీ అప్లికేషన్స్‌, నోలోడ్‌ టెస్స్‌, షార్ట్‌ సర్క్యూట్‌ టెస్ట్‌ అంశాలు ముఖ్యమైనవి.
1. నో లోడ్‌ టెస్ట్‌ని ట్రాన్స్‌ఫార్మర్‌లో ఏ వైపు నిర్వహిస్తారు? (1)
1) HV వైపు
2) LV వైపు
3) HV లేదా LV
4) HV, LV

ఏసీ మెషీన్స్‌

- ఇందులో బేసిక్‌ కాన్సెప్ట్స్‌, కన్‌స్ట్రక్షన్‌ ప్రిన్సిపుల్‌ అండ్‌ సింపుల్‌ ప్రాబ్లమ్స్‌ ఆన్‌ త్రీ ఫేజ్‌ అండ్‌ సింగిల్‌ ఫేజ్‌ ఇండక్షన్‌ మోటార్‌, యూనివర్సల్‌ మోటార్‌, ఆల్టర్నేటర్‌, సింక్రోనస్‌ మోటార్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌ అండ్‌ వైండింగ్స్‌, కాన్సెప్ట్‌ ఆఫ్‌ పవర్‌ ఎలక్ట్రానిక్‌ డ్రైవ్స్‌ అంశాలు ఉన్నాయి. వీటిలో కన్‌స్ట్రక్షన్‌, అప్లికేషన్స్‌, వైండింగ్స్‌ పై ప్రశ్నలు అడుగుతారు. ఇవి అప్లికేషన్‌ మెథడ్‌లో ఉంటాయి.

- మిక్సీలో ఏ మోటర్‌ వాడుతారు?
- స్టెప్పర్‌ మోటర్‌ ఎక్కడ వాడుతారు?
- క్రేన్స్‌లో వాడే మోటర్‌ ఏది?

1. ఇండక్షన్‌ మోటర్‌ని ఇలా కూడా పిలుస్తారు? (4)

1) స్టాటిక్‌ ట్రాన్స్‌ఫార్మర్‌
2) ఓపెన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌
3) షార్ట్‌ సర్క్యూటెడ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌
4) రొటేటింగ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌

ఎలక్ట్రికల్‌ మెజర్‌మెంట్స్‌

- ఇందులో డిఫరెంట్‌ టైప్స్‌ ఆఫ్‌ ఏసీ అండ్‌ డీసీ మెజరింగ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, డొమెస్టిక్‌ అప్లయెన్సెస్‌ అండ్‌ ఇల్యూమినేషన్‌ కాన్సెప్ట్స్‌, టైప్స్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ ల్యాంప్స్‌ అంశాలు ఉంటాయి. ఇందులో క్లాసిఫికేషన్‌ ఆఫ్‌ ఏసీ, డీసీ ఇన్‌స్ట్రుమెంట్స్‌, మెజర్‌మెంట్‌ ఆఫ్‌ పవర్‌, టైప్స్‌ ఆఫ్‌ డాంపింగ్‌, ఎంఐ, ఎంసీ ఇన్‌స్ట్రుమెంట్స్‌, టైప్స్‌ ఆఫ్‌ ల్యాంప్స్‌ (ఎంవీ ల్యాంప్‌, ఎస్వీ ల్యాంప్‌, ఆర్క్‌ ల్యాంప్‌), ఇల్యూమినేషన్‌ యూనిట్స్‌ అంశాలు ప్రధానమైనవి.

1. కాంతి తీవ్రత (ల్యూమినస్‌ ఇంటెన్సిటి)కి ప్రమాణం? (1)

1) క్యాండెలా
2) ల్యూమెన్‌
3) వాట్‌
4) స్టెరీడియన్‌

ఎలక్ట్రిక్‌ పవర్‌ జనరేషన్‌

- ఇందులో థర్మల్‌, హైడల్‌, న్యూక్లియర్‌ ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌, బేసిక్‌ కాన్సెప్ట్స్‌, నాన్‌ కన్వెన్షనల్‌ ఎనర్జీ సోర్సెస్‌ అంశాలు ఉంటాయి. వీటిలో పవర్‌ప్లాంట్‌, అపారటస్‌ ఫంక్షనింగ్‌, కన్వెన్షనల్‌ అండ్‌ నాన్‌ కన్వెన్షనల్‌ ఎనర్జీ సోర్సెస్‌, స్కిన్‌ ఎఫెక్ట్‌, ఇన్సులేటర్స్‌, కేబుల్స్‌ అప్లికేషన్స్‌, కరోనా లాస్‌, డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ టైప్స్‌ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

జనరల్‌నాలెడ్జ్‌

- ఇందులో ప్రధానంగా కరెంట్‌ అఫైర్స్‌, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్రపై ప్రశ్నలు అడుగుతారు.

1. కిందివాటిలో వారసత్వంగా సంక్రమించే వ్యాధి ఏది? (4)

1) తలసేమియా
2) వర్ణాంధత్వం
3) హీమోఫీలియా
4) లుకేమియా

ఎలా ప్రిపేరవ్వాలి

- తొలుత సిలబస్‌ను పరిశీలించి తగిన మెటీరియల్‌ను సిద్ధం చేసుకోవాలి. చదవాల్సిన అంశాలతో రోజువారీ ప్రణాళికను రూపొందించుకోవాలి. ఒక్కో అంశానికి రెండు, మూడు రోజులు కేటాయించాలి.
- టెక్నికల్‌ సబ్జెక్టులకు సంబంధించిన ఫార్ములాలను ఒకదగ్గర రాసుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రాక్టీస్‌ చేయాలి.
- ప్రిపరేషన్‌ సమయంలో ఏదైనా సందేహముంటే వెంటనే ఫ్యాకల్టీ, స్నేహితుల సహాయంతో నివృత్తి చేసుకోవాలి.
- గత ప్రశ్నపత్రాలను సేకరించి అందులోని ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేయాలి. ఈ సెట్‌ గత ప్రశ్నపత్రాలు, మోడల్‌ పేపర్లను ప్రాక్టీస్‌ చేయాలి.

చదవాల్సిన పుస్తకాలు

- బేసిక్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌- ఎంఎల్‌ అద్వాణీ.......
- బేసిక్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌- పీఎస్‌ ధోగల్‌
- పాఠశాల స్థాయి పుస్తకాలు
- న్యూస్‌ పేపర్లు
FEMA1

1605
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles