ఆర్‌ఆర్‌బీ-ఎన్‌టీపీసీ అర్థవంతమైన ప్రిపరేషన్‌


Wed,October 23, 2019 12:10 AM

group-students
- ఆర్‌ఆర్‌బీ, ఎన్‌టీపీసీ పరీక్షలు సీబీటీ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో సీబీటీ-1, సీబీటీ-2 ఉంటాయి. ఈ రెండింటిలో సిలబస్‌ ఒకేవిధంగా ఉంటుంది. సీబీటీ-1లో 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. సమయం 90 నిమిషాలు. ఇందులో అన్ని గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషలతోపాటు హిందీ/ఇంగ్లిష్‌ భాషలో కూడా ఉంటాయి. ఈ పరీక్షలో నెగెటివ్‌ (1/3 మార్కులు) మార్కింగ్‌ ఉంది. కాబట్టి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ప్రిపేర్‌ కావాలి.
- ఈ పరీక్షల్లో జనరల్‌ అవేర్‌నెస్‌లో 40 ప్రశ్నలకుగాను 40 మార్కులు, ప్రాథమిక గణితం & అర్థమెటిక్‌ల నుంచి 30 ప్రశ్నలకుగాను 30 మార్కులు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ & రీజనింగ్‌లో 30 ప్రశ్నలకుగాను 30 మార్కులు ఉంటాయి.
- మొదటగా మనం ఈ పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయనే అంశంపై దృష్టిపెట్టాలి. అందుకోసం ప్రీవియస్‌ పేపర్లు బాగా ప్రాక్టీస్‌ చేయాలి. మనం ప్రిపేరయ్యే విధానం లాజికల్‌గా, ప్రాక్టికల్‌గా ఉండాలి. పరీక్ష టైమ్‌ మేనేజ్‌మెంట్‌ దృష్ట్యా ఎక్కువగా మాక్‌టెస్టులు రాయాలి.


- గతంలో మనం వివిధ పోటీపరీక్షలు రాసి ఉంటే వాటి ద్వారా మనకు కొంత ఉపయోగం ఉంటుంది. ఒకవేళ ఆర్‌ఆర్‌బీ, ఎన్‌టీపీసీ వంటి పరీక్షలు మొదటిసారి రాస్తున్నట్లయితే ఒక ప్రణాళిక ప్రకారం ప్రిపేర్‌ కావాలి. అర్థమెటిక్‌ & రీజనింగ్‌ లాంటి అంశాలపై పట్టు సాధించడం కోసం NCERT పదో తరగతి వరకు అకాడమీ పుస్తకాలు చదవాలి. ఒకవేళ ఇప్పుడు పరీక్ష కోసం ప్రిపేరవుతున్నట్లయితే ప్రామాణికమైన కోచింగ్‌ మెటీరియల్‌ తీసుకుని ప్రాక్టీస్‌ చేయాలి.
- అభ్యర్థులు మానసికంగా ఏవైనా ఇబ్బందులు పడుతుంటే తప్పుకుండా పరీక్షల పట్ల అవగాహన కలిగిన వారి సలహాలు, సూచనలు తీసుకోవాలి. కోచింగ్‌ టెక్నిక్‌ తెలుసుకోవాలి.

మ్యాథ్స్‌&అర్థమెటిక్‌

- నంబర్‌ సిస్టమ్‌, డెసిమల్‌, ఫ్రాక్షన్స్‌, LCM& HCF, నిష్పత్తి-అనుపాతం, ప్రాపరేషన్స్‌, పర్సంటేజ్‌, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌, ఇంటరెస్ట్‌, వయస్సు, యావరేజెస్‌, కాలం-పని, కాలం-దూరం, రైలు, పడవల రేసులు, మెన్సురేషన్స్‌, బాడ్‌మాస్‌ మొదలైనవి. మొదటగా నిష్పత్తి-అనుపాతాలపై బాగా ప్రాక్టీస్‌ చేయాలి. తర్వాత శాతాలు, లాభనష్టాలు, వడ్డీలు, వయస్సులు, సరాసరి, కాలం-పని, కాలం-దూరం, క్షేత్రమితి, దత్తాంశ విశ్లేషణ, వాటితోపాటు ప్రాథమిక సంఖ్యామానంపై పట్టు సాధించాలి.

జనరల్‌ ఇంటెలిజెన్స్‌ & రీజనింగ్‌

- అనాలజీ, కంపారిజన్స్‌, నంబర్‌ సిస్టమ్‌, మిస్సింగ్‌ నంబర్స్‌, అక్షరమాల, కోడింగ్‌, డీకోడింగ్‌, రక్తసంబంధాలు, దిశలు, సిట్టింగ్‌ అరేంజ్‌మెంట్‌, వెన్‌ చిత్రాలు, పజిల్స్‌తోపాటు క్యాలెండర్‌, గడియారాలు, లాజికల్‌ రీజనింగ్‌, స్టేట్‌మెంట్స్‌-కంక్లూజన్స్‌, స్టేట్‌మెంట్స్‌-వాదనలు, డాటా సఫిషియన్స్‌, డాటా ఇంటర్‌ప్రిటేషన్‌ మొదటైనవాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. బాగా ప్రాక్టీస్‌ చేయాలి.

జనరల్‌ అవేర్‌నెస్‌, సైన్స్‌&టెక్నాలజీ

- జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అన్ని అంశాలను జాగ్రత్తగా, క్షుణ్ణంగా పరిశీలించాలి. స్టాక్‌ జీకే, కరెంట్‌ అఫైర్స్‌పై పట్టు సాధించాలి. గత ఆరు నెలలుగా జరిగిన అన్ని అంశాలను బాగా చదవాలి. ఉదా: చంద్రయాన్‌-2 లాంటి అంశాలు.
- ఇండియన్‌ పాలిటీ, హిస్టరీ, ఎకనామిక్స్‌, జాగ్రఫీ, ప్రముఖ వ్యక్తులు, బిరుదులు, ప్రథమములు, ప్రభుత్వ పథకాలు, విధానాలు, క్రీడలు మొదలైనవి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చూడాలి. కంప్యూటర్‌పై బేసిక్‌ నాలెడ్జ్‌ అనాలసిస్‌ చదవాలి.
- ఆర్‌ఎస్‌ అగర్వాల్‌, అరిహంత్‌ లాంటి స్టాండర్డ్‌ బుక్స్‌ ఇంగ్లిష్‌ మీడియంలో లభిస్తాయి. తెలుగు మీడియంలో మీకు నచ్చిన ఏవైనా పుస్తకాలు తీసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌, గ్రూప్స్‌, వీఆర్‌వో, వీఆర్‌ఏ, పంచాయతీ కార్యదర్శి వంటి పోటీ పరీక్షల పుస్తకాలు లభిస్తున్నాయి. వీటితోపాటు కోచింగ్‌ సంస్థల రన్నింగ్‌ నోట్స్‌ సేకరించుకోవాలి.
- ఇదేవిధంగా సీబీటీ-2లో అదే సిలబస్‌ ఉంటుంది. కానీ 120 ప్రశ్నలకు 120 మార్కులు, సమయం 90 నిమిషాలు కేటాయించారు. మ్యాథ్స్‌, అర్థమెటిక్‌ నుంచి 35 ప్రశ్నలు, 35 మార్కులు, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజన్స్‌ 35 ప్రశ్నలు, 35 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 50 ప్రశ్నలు, 50 మార్కులు కేటాయించారు.
- ఆర్‌ఆర్‌బీ, ఎన్‌టీపీసీ పరీక్షలు అక్టోబర్‌ చివరివారంలో లేదా నవంబర్‌ మొదటి వారంలో జరుగుతాయి. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా ప్రిపేర్‌ కావాలి.
group-students1

840
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles