కెరీర్‌@ఎన్‌ఐడీ


Wed,October 16, 2019 02:15 AM

NID
డిజైన్‌.. ప్రపంచం ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటుంది. వస్తువులు లేదా పరికరాలు, వాహనాలు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా చూడటానికి అహ్లాదం కలిగించే డిజైన్‌లకు ఎల్లప్పుడు డిమాండ్‌ ఉంటుంది. ప్రొడక్ట్‌ డిజైనింగ్‌, ఫర్నీచర్‌, ఇంటీరియర్‌, సిరామిక్‌, గ్లాస్‌, యానిమేషన్‌ ఫిల్మ్‌, వీడియో, గ్రాఫిక్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌ ఇలా ఏ రంగంలోనైనా ఆయా వస్తువుల ఆకృతికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దేశంలో నిపుణులైన డిజైనర్లను తయారుచేయాలని కేంద్రం స్థాపించిన విద్యాసంస్థ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ). ఈ సంస్థలు యూజీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయిలో కోర్సులను అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐడీల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆయా కోర్సులు, అర్హతలు, ఉపాధి అవకాశాలపై సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం...


- ఎన్‌ఐడీ: స్వాతంత్రం వచ్చిన తరుణంలో జరిగిన మేధోమదనం సందర్భంగా 1957లో భారత ప్రభుత్వం దేశంలో పారిశ్రామికీకరణకు తోడ్పడే సూచనలు, సలహాలు ఇవ్వమని ఫోర్డ్‌ ఫౌండేషన్‌ను ఆహ్వానించింది. దేశవ్యాప్తంగా అనేక రంగాలకు చెందిన వేలాదిమందిని కలిసిన ఫోర్డ్‌ ఫౌండేషన్‌ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదికల ఆధారంగా సారాభాయ్‌ కుంటుంబం 1961లో అహ్మదాబాద్‌లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ డిజైన్‌ను ప్రారంభించింది. మొదట దీన్ని స్వతంత్ర సంస్థగా అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేశారు. గౌతమ్‌ సారాభాయ్‌, గిరా సారాభాయ్‌ దీని ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు.

కోర్సులు- వివరాలు:

- బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బీ.డిజైన్‌): సీట్లు-125.
- అహ్మదాబాద్‌ క్యాంపస్‌ ఆఫర్‌ చేస్తుంది.

స్పెషలైజేషన్లు

1. కమ్యూనికేషన్‌ డిజైన్‌
2. ఇండస్ట్రియల్‌ డిజైన్‌
3. టెక్స్‌టైల్‌, అప్పెరల్‌, లైఫ్‌ైస్టెల్‌ అండ్‌ యాక్సెసరీ డిజైన్‌
- గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌ ఇన్‌ డిజైన్‌ (జీడీపీడీ): సీట్ల సంఖ్య-300.
- నాలుగేండ్ల కాలవ్యవధిగల కోర్సు. దీన్ని ఎన్‌ఐడీ- ఏపీ, హర్యానా, మధ్యప్రదేశ్‌, అసోం క్యాంపస్‌లు ఆఫర్‌ చేస్తున్నాయి. ఒక్కో క్యాంపస్‌లో 75 సీట్లు ఉన్నాయి.
- స్పెషలైజేషన్స్‌: ఇండస్ట్రియల్‌ డిజైన్‌, కమ్యూనికేషన్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ &అప్పెరల్‌ డిజైన్‌.
-ఉపాధి అవకాశాలు: ఈ కోర్సులు చేసినవారికి మంచి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ఉంటాయి. వివరాలు ఎన్‌ఐడీ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ఎవరు అర్హులు...?

- వయస్సు: 2000, జూలై 1న లేదా తర్వాత జన్మించి ఉండాలి.
- విద్యార్హతలు: ఇంటర్‌లో ఆర్ట్స్‌, సైన్స్‌, కామర్స్‌ తదితర ఏ స్ట్రీమ్‌లోనైనా ఉత్తీర్ణులైనవారు లేదా సెకండియర్‌ పరీక్షలు రాయబోతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రవేశాలు ఎలా కల్పిస్తారు...?

- రెండుదశల్లో నిర్వహించే టెస్ట్‌ల ద్వారా ఎంపికచేస్తారు.
- డీఏటీ ప్రిలిమ్స్‌:2019, జనవరి 6న నిర్వహించనున్నారు.
- దీనిలో అర్హత సాధించినవారి మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి డీఏటీ మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపికచేస్తారు.
- రాష్ట్రంలో హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రం ఉంది.

డీఏటీ మెయిన్స్‌:

- ఇది రెండు రోజులు, 100 మార్కులకు ఉంటుంది.
- పరీక్ష కేంద్రాలు అహ్మదాబాద్‌, బెంగళూరు, గాంధీనగర్‌, కురుక్షేత్ర, విజయవాడ.
- తుది ఎంపిక: డీఏటీ ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కులకు 30 శాతం, మెయిన్స్‌లో వచ్చిన మార్కులకు 70 శాతం చొప్పున కేటాయించి తుది ఎంపికచేస్తారు.
- బీ.డిజైన్‌, ఎం.డిజైన్‌ కోర్సులకు ముఖ్యతేదీలు:
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్‌ 7
- ప్రిలిమ్స్‌ పరీక్షతేదీ: 2019, డిసెంబర్‌ 29
- వెబ్‌సైట్‌: http://admissions.nid.edu

మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎం.డిజైన్‌)

- ఇది రెండున్నరేండ్ల పీజీ కోర్సు. ఈ కోర్సును అహ్మదాబాద్‌, బెంగళూరు, గాంధీనగర్‌ క్యాంపస్‌లు అందిస్తున్నాయి. మొత్తం 347 సీట్లు ఉన్నాయి.
- ఎం.డిజైన్‌లో కమ్యూనికేషన్‌ డిజైన్‌, ఇండస్ట్రియల్‌ డిజైన్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ-ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్స్‌, ఇంటర్‌ డిసిప్లినరీ డిజైన్‌ స్టడీస్‌, టెక్స్‌టైల్‌-అప్పెరల్‌-లైఫ్‌ైస్టెల్‌ అండ్‌ యాక్ససరీ డిజైన్‌ గ్రూపులు ఉన్నాయి. పైన చెప్పిన వాటిలో పలు స్పెషలైజేషన్లు కూడా ఉన్నాయి.
- వయస్సు: 1990, జూలై 1న లేదా తర్వాత జన్మించిన వారు
- విద్యార్హతలు: మూడేండ్ల/నాలుగేండ్ల డిగ్రీ ఉత్తీర్ణులు లేదా ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎంపిక: రెండు దశల్లో నిర్వహించే డిజైనింగ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

- కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

500
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles