ఫాటి ఆమ్లాల నుంచి లవణాలు ఏర్పడటం?


Wed,October 2, 2019 12:25 AM

oils-and-nuts

మైనములు (waxes)

- ఇవి తినదగినవి కావు.
- వీటిని కీటకాలు ఉత్పత్తి చేస్తాయి.
- ఉదా. తేనేటీగల మైనము, లక్క, చెవిగూమిలి

సంయుగ్మ కొవ్వులు (Conjugated/ Compound Lipids)

- కొవ్వు (లిపిడ్‌) అణువుతో కొవ్వు కాని అణువు బంధం ఏర్పర్చుకుంటే అలాంటి లిపిడ్‌లను సంయుగ్మ లిపిడ్‌లు అంటారు. వీటినే హెటిరోలిపిడ్‌లు అని కూడా అంటారు.
oils-and-nuts1
- లైసిథిన్‌, స్పింగోమయోలిన్‌లు ప్లాస్మాత్వచం బయటిభాగంలో ఉంటాయి.
- లెసిథిన్‌ అనేది గుడ్డుసొన, మెదడులో ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల్లోని వాయుగోణుల తలతన్యతను తగ్గించడంలో తోడ్పడుతుంది.
- సెఫాలిల్‌ అనేది మెదడులో ఉంటుంది. ఇది మెదడును రక్షించడంలో తోడ్పడుతుంది.

ఉత్పన్న కొవ్వులు (Derived Lipids)

- జీవక్రియ ఫలితంగా ఏర్పడిన కొవ్వులను ఉత్పన్న కొవ్వులు అంటారు.
- స్టిరాయిడ్స్‌, పైత్యఆమ్లాలు, లైంగికహార్మోన్‌లు, కొవ్వులో కరిగే విటమిన్లు మొదలైనవి ఉత్పన్న లిపిడ్లలోని రకాలు.
ఉదా. కొలెస్టిరాల్‌, సహజరబ్బరు

కొలెస్టిరాల్‌

- ఇది తెల్లని ఘనరూప స్పటికపదార్థం
- ఇది ఒక స్టిరాయిడ్‌
- దీని అణుఫార్ములా- C27 H46O
- ఇది మెదడు, నాడీకణాలు, అడ్రినల్‌గ్రంథులు, గుడ్డుసొన లలో ఎక్కువగా ఉంటుంది.
- పిండిపదార్థాలు (కార్బొహైడ్రేట్‌లు), కొవ్వులను ఎక్కువగా తీసుకుని తక్కువ పనిచేస్తే ఎక్కువైన శక్తి కొలెస్టిరాల్‌ రూపంలోకి మార్చబడుతుంది.
- ఇది ఎడిపోజ్‌ కణజాలంలో నిల్వ చేయబడుతుంది.
- ఇది ఉపవాస సమయంలో శక్తిని ఇవ్వడానికి తోడ్పడుతుంది.
- ఇది శరీర ఉష్ణోగ్రతను బయటకు పోకుండా నిరోధిస్తుంది.
నోట్‌. మానవ శరీర ఉష్ణోగ్రత 37oC లేదా 98.4 F
- ఇది విటమిన్‌-డి తయారీలో ఉపయోగపడుతుంది.
- ఇది జంతువులు, మొక్కలలో ప్లాస్మాత్వచం తయారీలో తోడ్పడుతుంది.
- కొలెస్టిరాల్‌ ఎక్కువైతే హైబీపీ, స్థూలకాయం (Obesity), కామెర్లు, గుండెజబ్బులు వస్తాయి.

కొవ్వు ఆమ్లాలు

- కొవ్వు (లిపిడ్‌) అణువు ఏర్పడటానికు కొవ్వు ఆమ్లాలు (Fatty acids) అవసరం.
- కొవ్వు ఆమ్లాలు పొడవైన కర్బన శృంఖలంను కలిగి చివరన COOH గ్రూపును కలిగి ఉండును.
- కొవ్వు ఆమ్లాలన్నింటిలో ఫార్మిక్‌ ఆమ్లం అతిసరళమైనది.
- కొవ్వు ఆమ్లాలు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. అవి..
సంతృప్త కొవ్వు ఆమ్లాలు (Saturated Fatty acids)
అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (UnSaturated Fatty acids)

సంతృప్త కొవ్వు ఆమ్లాలు

- ఒక ఫాటి ఆమ్ల (కొవ్వు ఆమ్ల) అణువులో రెండు కర్బన పరమాణువుల మధ్య ఎలాంటి ద్విబంధం లేకుంటే అలాంటి ఫాటీ ఆమ్లాలను సంతృప్త ఫాటీ ఆమ్లాలు అంటారు.
- జంతువుల నుంచి లభించే కొవ్వులలో సంతృప్త ఫాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి.
- ఇవి జీవక్రియ పరంగా మానవునికి అంత ఉపయోగకరమైనవికావు.
ఉదా: పామిటిక్‌ ఆమ్లం (Palamitic acid)
స్టియరిక్‌ ఆమ్లం (Stearic acid )
అరాఖిడిక్‌ ఆమ్లం (Arachidi acid)

అంసతృప్త కొవ్వు ఆమ్లాలు

- ఒక ఫాటీ ఆమ్ల (కొవ్వు ఆమ్ల) అణువలో రెండు కర్బన పరమాణువుల మధ్య ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ద్విబంధాలు ఉన్నట్లయితే అలాంటి ఫాటిఆమ్లాలను అసంతృప్త ఫాటీ ఆమ్లాలు అంటారు.
- మొక్కల నుంచి లభించే కొవ్వులలో అసంతృప్త ఫాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి.
- ఇది జీవక్రియ పరంగా మానవునికి ఉపయోగకరమైనవి.

ఉదా:
- ఓలిక్‌ ఆమ్లం (Oleic acid)- ఒక ద్విబంధం ఉంటుంది.
- లినోలిక్‌ ఆమ్లం (Linoleic acid)- రెండు ద్విబంధాలు ఉంటాయి.
- లినోలైనిక్‌ ఆమ్లం (Linolenic acid)- మూడు ద్విబంధాలు ఉంటాయి.
- అరాఖిడోనిక్‌ ఆమ్లం (Arachidonic acid)- నాలుగు ద్విబంధాలు ఉంటాయి.
- లినోలిక్‌, లినోలెనిక్‌, అరాఖిడోనిక్‌ ఫాటీ ఆమ్లాలను ఆవశ్యక కొవ్వుఆమ్లాలు (Essential fatty acid) అంటారు. ఇవి మానవ దేహంలో సంశ్లేషించబడవు. కావున వీటిని బయటి నుంచి ఆహర రూపంలో తీసుకోవాలి.
- మొక్కలు అన్ని రకాల ఫాటీ ఆమ్లాలను సంశ్లేషిస్తాయి.
- సాల్మన్‌, మెకరల్‌, ట్యూనా చేపలలో ఒమెగా-3 ఫాటీ ఆమ్లాలు లభిస్తాయి.
- చాల్‌ మూగ్రా నూనెను కుష్టువ్యాధి నివారణలో ఉపయోగిస్తారు.

LDL (Low Density Lipoprotien)

- దీనిని చెడు కొలెస్టిరాల్‌ అంటారు.
- ఇది సంతృప్త కొవ్వులను ఎక్కువగా తీసుకోవడం వలన ఏర్పడుతుంది.

HDL (High Density Lipoprotien)

- దీనిని మంచి కొలెస్టిరాల్‌ అంటారు.
- ఇది అసంతృప్త కొవ్వులను ఎక్కువగా తీసుకోవటం వలన ఏర్పడుతుంది.

హైడ్రోజనీకరణం

- మొక్కలలోని అసంతృప్త కొవ్వు ఆమ్లాలకు సరైన ఉష్ణోగ్రత పీడనాల వద్ద హైడ్రోజన్‌ వాయువును కలిపి వాటిని సంతృప్తస్థితిలోకి మార్చి డాల్డా/ వనస్పతి (Vegetable ghee) ని తయారుచేసే ప్రక్రియను హైడ్రోజనీకరణం అంటారు. ఈ ప్రక్రియకు నికెల్‌ (Ni) ప్లాటినం (pt) పెల్లాడియం (Pd) లను ఉత్పేరకాలుగా వాడుతారు.

సఫోనిఫికేషన్‌

- ఇది సబ్బులను తయారుచేసే ప్రక్రియ
- సోడియం హైడ్రాక్సైడ్‌ (NaOH), పొటాషియం హైడ్రాక్సైడ్‌ (KoH) లతో ఫాటి ఆమ్లాలను చర్య జరిపినప్పుడు ఫాటి ఆమ్లాల నుంచి లవణాలు ఏర్పడటాన్ని సఫొనిఫికేషన్‌ అంటారు.
- సోడియం (Na) లవణంతో తయారుచేయబడిన సబ్బులను డిటర్జెంట్‌లు (Detergents) అంటారు. పొటాషియం (K) లవణంతో తయారుచేయబడిన సబ్బులను స్నానపు సబ్బులు (bath soaps) అంటారు.
- సబ్బుల్లో ఎక్కువగా స్టియరిక్‌ ఆమ్లం అనే కొవ్వు ఆమ్లం ఉంటుంది.
- తిమింగలం, ధృవపు ఎలుగుబంటి, పెంగ్విన్‌ పక్షులు, డాల్ఫిన్‌ వంటి జంతువుల శరీరం కింద ఉండే మందమైన కొవ్వుపొరను బ్లబ్బర్‌ (Blubbar) అంటారు. ఇది శీతల పరిస్థితుల నుంచి తప్పించుకోవటంలో ఉష్ణప్రతిబంధకంగా పనిచేస్తుంది.
- మానవునిలో ఉండే 7-Dehydrocholestrol సూర్యరశ్మీ సమక్షంలో విటమిన్‌-డి తయారవుతుంది.

పౌష్టికాహర లోపాలు (Nutritional Deficiency Disorders)

- మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్‌లు ప్రధాన శక్తి సరఫరాదారులు- Chiefenergy providers), ప్రొటీన్లు (దేహనిర్మాణకారులు- Body builders), లిపిడ్‌లు (శక్తినిల్వలు- Energy Reseves), విటమిన్లు (సహజ ఎంజైములు- Co-Enzymes) ఖనిజమూలకాల వంటి ఆవశ్యకమైన పదార్థాలు ఉంటాయి.
- ఆహారపదార్థాలు తక్కువగా తీసుకుంటే కలిగే లోపాలను పౌష్టికాహార లోపాలు అంటారు.
.

క్వాషియార్కర్‌

- కార్బోహైడ్రేట్‌లు, లిపిడ్‌లను కెలోరీలు అంటారు.
- తీసుకునే ఆహారంలో కెలోరీ (కార్బోహైడ్రైట్‌లు, లిపిడ్‌) ల స్థాయి సాధారణంగా ఉండి ప్రొటీన్లు తగ్గితే క్వాషియార్కర్‌ వ్యాధి వస్తుంది.
- క్వాషియార్కర్‌ అనగా నిర్లక్ష్యం చేయబడ్డ శిశువు అని అర్థం.
- ఇది పిల్లలలో 18నెలల తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది.

మరాస్మస్‌

- ప్రొటీన్లు, కెలోరీల లోపం వలన వచ్చే వ్యాధిని మరాస్మస్‌ అంటారు.
- ఇది సాధారణంగా ఏడాది లోపు పిల్లల్లో కనిపిస్తుంది.

స్థూలకాయత్వం (Obesity)

- శరీర బరువులో 20శాతం కంటే ఎక్కువ కొవ్వు ఉన్నట్లయితే వచ్చే పోషకాహర సమస్యను స్థూలకాయత్వం అంటారు.
- శక్తిని ఇచ్చే ఆహర పదార్థాలైన కార్బోహైడ్రేట్‌లు, కొవ్వులను ఎక్కువగా తీసుకునే తక్కువ వ్యక్తులలో ఈ సమస్య వస్తుంది.
- ఇది వ్యాధి కాదు. ఒక పోషకాహర సమస్య మాత్రమే.
oils-and-nuts2
- స్థూలకాయత్వం గలవారిలో గల కొవ్వులను తీసివేసి సర్జరీ-బేరియాట్రిక్‌ సర్జరీ (Weight loss surgery/ Liposuction). ఈ సర్జరీలో జీర్ణాశయం చుట్టూ గల కొవ్వును తొలగిస్తారు.
- ఈ సమస్య గల వారికి పుట్ట గొడుగులను (Mushrooms) మంచి ఆహారంగా పరిగణిస్తారు.
- స్థూలకాయత్వం వలన Heart attack (గుండెసమస్య) హైబీపీ, హైపటైటిస్‌ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
oils-and-nuts3

596
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles