ఉత్తరార్ధగోళంలో లేని ఆసియా దేశ దీవులు?


Wed,September 25, 2019 01:49 AM

Lhasa

ఖండాలు

- సూర్యకుటుంబ వరుసలో మూడోదిగాను, పరిమాణంలో ఐదోదిగాను ఉన్నదే భూమి. దీని గురించి భూగోళశాస్త్రం వివరించినంతగా మరే శాస్త్రం వివరించదు.
- భోగోళశాస్త్రం ప్రకారం భూమి వివిధ ఆకారాల్లో ఉన్నదనే భావన అభూత కల్పనే. భూమి ఆకారాన్ని ‘జియాయిడ్‌ (Geoid)’ అంటారు.
- ఏ వస్తువైతే భూమి ఆకారం కలిగి ఉందో దాన్ని జియాయిడ్‌ అంటారు.
- ఈ ఆకారంగల వస్తువు మన భూమి తప్ప సృష్టిలో మరొకటి లేదు.
- జాయాయిడ్‌ పూర్తిగా దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది.
- అక్షాంశాలపరంగా ఉత్తరార్ధగోళంలో భూభాగం ఎక్కువ. దక్షిణార్ధగోళంలో జలభాగం ఎక్కువ.
- రేఖాంశాలపరంగా పూర్వార్ధగోళంలో భూభాగం ఎక్కువ. పశ్చిమార్ధగోళంలో జలభాగం ఎక్కువ.
- భూమిపై ఏర్పడిన ఖండాలను పరిశీలిస్తే ఇవి ఇంచుమించు త్రిభుజాకారంగా ఉన్నాయి.
ఉదా: పూర్వార్ధగోళంలో ఉన్న ఖండాలు ఆసియా, ఐరోపా (యూరప్‌), ఆఫ్రికా, ఆస్ట్రేలియా
- పశ్చిమార్ధగోళంలో ఉన్న ఖండాలు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలు కూడా త్రిభుజాకారంలో ఉన్నాయి.
- భూగోళంపై ఏర్పడిన ఐదు ఖండాల పేర్లు పరిశీలిస్తే అవి.. ఏ ఇంగ్లిష్‌ అక్షరంతో ప్రారంభమవుతుందో అదే అక్షరంతో ముగియడం మన ఖండాల ప్రత్యేకత.
ఉదా: ఆసియా, యూరప్‌, అంటార్కిటిక, ఆస్ట్రేలియా
- ఖండాలను వాటి స్థితిగతులను అనుసరించి మూడు భాగాలుగా చేశారు. అవి.. త్రిఖండ నేల (ఆసియా, ఆఫ్రికా, యూరప్‌), ద్విఖండ నేల (ఉత్తర, దక్షిణ అమెరికాలు), ఏకఖండ నేల (ఆస్ట్రేలియా)
- వీటిలో పెద్దది ఆసియా. చిన్నది ఆస్ట్రేలియా

ఖండాలు

- మహాసముద్రాలను వేరుచేస్తూ ఏర్పడిన భూభాగాలు ఖండాలు.
- విస్తీర్ణంపరంగా ఖండాలు.. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరప్‌, ఆస్ట్రేలియా

ఆసియా

- ప్రపంచంలో ఇది అత్యధిక జనాభాగల ఖండం
- ఇది అత్యధిక వైశాల్యంగల ఖండం
- ఎత్తయిన పర్వతాలు, లోతైన ప్రాంతాలుగల ఖండం
- ఈ ఖండంలో 50 దేశాలు ఉన్నాయి. దీనిలో మూడు దేశాలు రష్యా, కజకిస్థాన్‌, టర్కీ యూరప్‌ ఖండ భూభాగంలో సాంకేతికంగా ఉన్నాయి.

సరిహద్దులు

- ఉత్తరాన ఆర్కిటిక్‌ మహాసముద్రం
- తూర్పున పసిఫిక్‌ మహాసముద్రం (బేరింగ్‌ జలసంధి వరకు)
- దక్షిణాన హిందూ మహాసమద్రం
- పశ్చిమాన యూరల్‌ పర్వతాలు, కాకసస్‌ పర్వతాలు, కాస్పియన్‌ సముద్రం, నల్లసముద్రం, మధ్యదరా సముద్రం
- నైరుతిన ఎర్ర సముద్రం ఉన్నాయి.
- మధ్యదరా సముద్రం, నల్ల సముద్రాలు ఆసియా-యూరప్‌ ఖండాలను వేరుచేస్తున్నాయి.
- ఎర్ర సముద్రం (సూయజ్‌ కాలువ) ఆసియా-ఆఫ్రికా ఖండాలను వేరుచేస్తున్నది.
- కాకసస్‌ పర్వతాలు, యూరల్‌ పర్వతాలు, కాస్పియన్‌ సముద్రం, యూరల్‌ నది రెండు ఖండాల్లో కూడా విస్తరించి ఉంది.
- వీటి సరిహద్దులు రష్యా, కజకిస్థాన్‌, అజర్‌ బైజాన్‌, జార్జియా, టర్కీ దేశాలతో ఉన్నాయి. అందువల్ల ఇవి రెండు ఖండాల్లో విస్తరించాయి.
- అర్మేనియా, సైప్రస్‌ దేశాలు భౌగోళికంగా ఆసియాలో ఉన్నాయి. కానీ రాజకీయంగా, సాంస్కృతికంగా మాత్రమే యూరప్‌లో భాగంగా ఉన్నాయి.

ఉనికి

- అక్షాంశాల దృష్ట్యా- ఉత్తరార్ధగోళంలో 100 దక్షిణ అక్షాంశాల నుంచి 800 ఉత్తర అక్షాంశాలు
- రేఖాంశాల దృష్ట్యా- పూర్వార్ధగోళంలో 250 తూర్పు రేఖాంశాల నుంచి 1700 పశ్చిమ రేఖాంశం వరకు విస్తరించింది.

జనాభా

- ప్రపంచంలో ఆసియా ఖండం అత్యధిక జనాభాగలది.
- ఆసియా ఖండ జనాభా 4.54 బిలియన్లు
- ప్రపంచ జనాభాలో ఆసియా ఖండ జనాభా 60 శాతం ఉంది.
- ఆసియాలో అత్యధిక జనాభాగల దేశాలు: 1) చైనా (1.43 బిలియన్లు) భారతదేశం (1.36 బిలియన్లు). (2019, సెప్టెంబర్‌ 12 యూఎన్‌ అంచనాల ప్రకారం)
- ప్రపంచ జనాభాలో చైనా జనాభా 18.29 శాతంగా ఉంది. భారతదేశ జనాభా 17.71 శాతంగా ఉంది.
- ప్రపంచ జనాభాలో చైనా, భారతదేశాల జనాభానే 36 శాతం వరకు ఉంది.
- ఇవి ప్రపంచంలో అత్యధిక జనాభాగల మొదటి, రెండు దేశాలు. మూడోది ఇండోనేషియా (0.27 బిలియన్లు)

అత్యల్ప జనాభాగల దేశాలు

1) బ్రూనై- 4 లక్షల 34 వేలు
2) మాల్దీవులు- 4 లక్షల 44 వేలు
3) భూటాన్‌- 7 లక్షల 63 వేలు
- జనసాంద్రత (148 Per km2)
నోట్‌: ఆసియా ఖండంలోని తూర్పు చివరి ప్రాంతం డెజన్యావో అగ్రం (సైబీరియా), పశ్చిమ చివరి ప్రాంతం బాబా అగ్రం (టర్కీ)
- ఆసియా ఖండంలోని ఉత్తర చివరి ప్రాంతం- తిమోర్‌
- ఆసియా ఖండంలో ఇంతవరకు ఏ దేశ ఆధీనంలో లేని దేశం (వలస రాజ్య స్థాపన జరగని దేశం) థాయిల్యాండ్‌
- ఆసియా ఖండంలో ఎత్తయిన ప్రాంతం- ఎవరెస్ట్‌ శిఖరం (8848 మీ.) ఇది నేపాల్‌లో ఉంది. ఇది ప్రపంచంలో భూఉపరితలంపై ఎత్తయిన శిఖరం.
- ఆసియా ఖండం పర్వతాలకు పుట్టినిల్లు.
- ఆసియా ఖండంలో లోతైన సముద్రం మృత సముద్రం (డెడ్‌ సీ). ఇది జోర్డాన్‌లో ఉంది. ఇది ప్రపంచంలో అత్యంత లోతైన సముద్రం.
- ప్రపంచంలో అతిపెద్ద భూపరివేష్టిత దేశం మంగోలియా
- ప్రపంచంలో ఎత్తయిన పీఠభూమి పామీర్‌/టిబెట్‌ పీఠభూమి. ఇది ఆసియాలోని టిబెట్‌ ప్రావిన్స్‌లో ఉంది.

ప్రత్యేకతలు

- ప్రపంచంలో జనాభా పరంగా పెద్దదేశం- చైనా
- విస్తీర్ణపరంగా 4వ పెద్ద దేశం- చైనా
- ప్రపంచంలో అధికజనాభాగల రెండో దేశం- భారత్‌
- సూర్యుడు మొదట ఉదయించే దేశం- జపాన్‌ (నిప్పన్‌)
- ప్రపంచంలో అతితక్కువ తీరరేఖ గల దేశం- జోర్డాన్‌
- ప్రపంచంలో అధికంగా ఆటవస్తువులను ఉత్పత్తి చేసే దేశం- హాంకాంగ్‌
- హిందూమహాసముద్రపు ‘అశ్రునీటి బిందువు’- శ్రీలంక
- పవిత్రభూమి- జెరూసలేం
- ల్యాండ్‌ ఆఫ్‌ వైట్‌ ఎలిఫెంట్స్‌- థాయ్‌లాండ్‌
- ల్యాండ్‌ ఆఫ్‌ థౌజెండ్స్‌ ఎలిఫెంట్స్‌- లావోస్‌
- ల్యాండ్‌ ఆఫ్‌ మార్నింగ్‌ కామ్‌- కొరియా
- ల్యాండ్‌ ఆఫ్‌ థండర్‌ డ్రాగెన్‌- భూటాన్‌
- ల్యాండ్‌ ఆఫ్‌ గోల్డెన్‌ పగోడా- మయన్మార్‌
- ఫర్‌బిడెన్‌ సిటీ- లాసా (టిబెట్‌)
- సిటీ ఆఫ్‌ అరేబియన్‌ నైట్స్‌- బాగ్దాద్‌ (ఇరాక్‌)
- హిమాలయాల రాజ్యం
- నేపాల్‌ ముఖ్యమైన భూస్వరూపాలు

మైదానాలు

- సైబీరియా మైదానం: ఇది రష్యాలో ఉంది. యూరాల్‌ పర్వతాల నుంచి పసిఫిక్‌ మహాసముద్రం వరకు విస్తరించి ఉంది.
- చైనా మైదానం: ఇది హొయాంగ్‌హో, యాంగ్‌ట్సికియాంగ్‌, సికియాంగ్‌ నదుల మధ్య ఉంది.
- మెసపటోమియా మైదానం: ఇది ఇరాక్‌లో ఉన్నది. టైగ్రిస్‌, యూప్రటిస్‌ నదుల మధ్య ఉన్నది.
- ఐరావతి మైదానం: ఇది మయన్మార్‌లో ఉన్నది.
- గంగా-సింధు మైదానం: ఇది భారతదేశంలో ఉన్నది. ప్రపంచంలో అతి విశాలమైన ఒండ్రుమట్టితో కూడినది.
- మెకాంగ్‌ నది మైదానం: ఇది ఆగ్నేయాసిలో ఉన్నది.
- తురానియన్‌ మైదానం: ఇది కజకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ దేశాల్లో ఆముదార్య, సిరిదార్య నదుల మధ్య ఉన్న మైదానం. ఇవి ప్రపంచంలో మొదట అనుసంధానం చేసిన నదులు.

ఆసియాఖండంలోని దేశాలు-రాజధానులు తూర్పు ఆసియా దేశాలు-8

- జపాన్‌- టోక్యో
- ఉత్తరకొరియా- ప్యాంగ్‌యాంగ్‌
- దక్షిణ కొరియా- సియోల్‌
- చైనా- బీజింగ్‌
- తైవాన్‌- తైపీ
- హాంకాంగ్‌- విక్టోరియా
- మాకు- చైనా స్వతంత్రప్రాంతం
- మంగోలియా- ఉలాన్‌బాటర్‌

ఆగ్నేయాసియా దేశాలు- 11

- ఇండోనేషియా- జకార్తా
- వియత్నాం- హనోయి
- థాయ్‌లాండ్‌- బ్యాంకాక్‌
- సింగపూర్‌- సింగపూర్‌
- మలేషియా- కౌలాలంపూర్‌
- ఫిలిప్పీన్స్‌- మనీలా
- కాంబోడియా- నామ్‌పెన్హ్‌
- మయన్మార్‌- నేపిడా
- లావోస్‌- వియన్‌టియన్‌
- బ్రూనై- బండర్‌ సెరీ బెగవాన్‌
- తిమోర్‌ లెస్టి (తూర్పు తిమోర్‌)- దిలీ

భారత ఉపఖండ దేశాలు- 7

- బంగ్లాదేశ్‌- ఢాకా
- భూటాన్‌- థింపూ
- భారత్‌- న్యూఢిల్లీ
- మాల్దీవులు- మాలె
- నేపాల్‌- కఠ్మాండూ
- పాకిస్థాన్‌- ఇస్లామాబాద్‌
- శ్రీలంక- కొలంబో

పశ్చిమాసియా దేశాలు-23

- యెమెన్‌- సనా
- ఒమన్‌- మస్కట్‌
- యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌- అబుధాబీ
- ఆఫ్ఘనిస్థాన్‌- కాబూల్‌
- సౌదీఅరేబియా- రియాద్‌
- కువైట్‌- కువైట్‌
- ఇరాక్‌- బాగ్దాద్‌
- ఇరాన్‌- టెహ్రాన్‌
- జోర్డాన్‌- అమ్మాన్‌
- సిరియా- డెమాస్కస్‌
- టర్కీ- అంకారా
- బహ్రెయిన్‌- మనామా
- అర్మేనియా- యెరివాన్‌
- జార్జియా- టిబిలిసి
- అజర్‌ బైజాన్‌- బాకు
- కిర్గిజ్‌స్థాన్‌- బిష్కెక్‌
- కజకిస్థాన్‌- ఆస్థానా
- తుర్కుమెనిస్థాన్‌- అష్‌గబట్‌
- ఇజ్రాయెల్‌- టెల్‌అవిన్‌
- లెబనాన్‌- బీరుట్‌
- ఉజ్బెకిస్థాన్‌- తాష్కెంట్‌
- తజకిస్థాన్‌- దుషాన్చి
- సైప్రస్‌- నికోసియా
- రష్యా- మాస్కో

విస్తీర్ణం

- ఈ ఖండం విస్తీర్ణం 44.25 మిలియన్‌ చదరపు కిలోమీటర్లు. ఇది ప్రపంచ విస్తీర్ణంలో సుమారు 30 శాతం ఆక్రమిస్తున్నది.
అత్యధిక వైశాల్యంగల ఆసియా దేశాలు
- రష్యా (17.07 మి. చ.కి.మీ.)- ఇది ప్రపంచంలో అత్యధిక వైశాల్యంగల దేశం.
- చైనా (9.5 మి. చ.కి.మీ.)- ఇది ప్రపంచంలో అత్యధిక వైశాల్యంగల నాలుగో దేశం.
- భారతదేశం (3.28 మి. చ.కి.మీ)- ఇది ప్రపంచంలో అత్యధిక వైశాల్యంగల ఏడో దేశం.
- అత్యల్ప వైశాల్యంగల దేశం: మాల్దీవులు 300 చ.కి.మీ.
నోట్‌: ఆసియా ఖండం మధ్యగుండా 900 రేఖాంశం వెళ్తున్నది.
- ఈ ఖండంగుండా భూమధ్యరేఖ (00 అక్షాంశం) దక్షిణ, ఆగ్నేయంగా వెళ్తున్నది.
- 23 1/20 ఉత్తర అక్షాంశమైన కర్కటరేఖ ఈ ఖండంగుండా వెళ్తున్నది.
- 66 1/20 ఉత్తర అక్షాంశమైన ఆర్కిటిక్‌ వలయం ఈ ఖండంగుండా వెళ్తున్నది.
- భూమధ్యరేఖ వెళ్లే ఆసియా ప్రాంతాలు: ఇండోనేషియాలోని బోర్నియా, సుమత్రా, సులవేసి (సెలిబస్‌ దీవులు)
నోట్‌: ఇండోనేషియా కొన్ని దీవులు తప్ప మిగతా ఆసియా ఖండమంతా ఉత్తరార్ధగోళంలోనే ఉంది.
- భూమధ్యరేఖకు దగ్గరగాగల నగరం సింగపూర్‌
- కర్కటరేఖ వెళ్తున్న ఆసియా దేశాలు: తైవాన్‌, చైనా, మయన్మార్‌, బంగ్లాదేశ్‌, భారతదేశం, ఒమన్‌, యూఏఈ, సౌదీఅరేబియా
ఆర్కిటిక్‌ వలయంలోని ఆసియా దేశం: రష్యా
ramesh

616
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles