‘బీమా’లో కొలువులు


Mon,September 23, 2019 12:09 AM

జీవిత బీమా సంస్థలో అసిస్టెంట్ల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. తెలంగాణలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ డివిజన్‌కు సంబంధించి సుమారు 40 వరకు ఖాళీలు ఉన్నాయి. ఎంపిక కోసం జరిగే రాత పరీక్షలు ప్రిలిమ్స్‌, మెయిన్స్‌గా ఉంటాయి. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైనవారికి మెయిన్స్‌ పరీక్ష ఉంటుంది. ఇటీవలే పలు జాతీయ బ్యాంకుల్లో క్లర్క్‌ ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ వెలువరించింది. రెండు పరీక్షలకు ఒకే తరహా సిలబస్‌ ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు ఇంటిగ్రేటెడ్‌గా సిద్ధమైతే మంచిది. ఎల్‌ఐసీ ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్‌ 21, 22 తేదీల్లో నిర్వహించనున్నారు. అంటే పట్టుమని నెల రోజుల వ్యవధి కూడా లేదు. కచ్చితమైన ప్రణాళికతో సిద్ధమైతే విజయం సాధించేందుకు ఆస్కారం ఉంది. ముందుగా ప్రిపరేషన్‌పై దృష్టి సారించాలి.
iit-jee
-ఇందులో ఇంగ్లిష్‌ పరీక్షలో అర్హత సాధిస్తే సరిపోతుంది. ఇందులో వచ్చిన మార్కులను ర్యాంక్‌లో పరిగణించరు. అయితే న్యూమరికల్‌, రీజనింగ్‌లో గరిష్ఠ స్థాయిలో మార్కులను సాధించి ఇంగ్లిష్‌లో కనీస అర్హత మార్కులు దక్కించుకోకపోతే, శ్రమ వృథా అవుతుంది. అభ్యర్థులు ప్రాథమిక అంశాలను నేర్చుకోవడంతో పాటు, మాక్‌ పరీక్షలు రాసేందుకు దృష్టిసారించాలి. కొద్దిరోజుల కిందట ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ వెలువడిన విషయం తెలిసిందే. రెండింటికి ఒకే సిలబస్‌ ఉంది కాబట్టి ఆ పరీక్షకు సంబంధించి ప్రాథమిక అంశాలు పూర్తి చేసిన అభ్యర్థులు ఇక నేరుగా పరీక్షలను రాయాలి. ఇప్పటికీ ప్రాథమిక అంశాలు తెలియని విద్యార్థులు వాటిని అధ్యయనం చేయడానికి రెండు నుంచి మూడు రోజుల వ్యవధి కంటే ఎక్కువ తీసుకోరాదు.
-ఇంగ్లిష్‌: కాంప్రహెన్షన్‌లపై బాగా దృష్టి సారించాలి. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సంపాదకీయాలను బాగా చదవాలి. వేగంగా చదువుతూ వాటిని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. కాంప్రహెన్షన్‌లో ఇచ్చే వాక్యాలు పెద్దవిగా ఉంటాయి. ప్రముఖ ఆంగ్ల దినపత్రికల్లో కూడా సంపాదకీయాలు ఇలానే ఉంటాయి. వీటిని చదవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో బృందాలుగా సిద్ధమైతే మేలు. అయితే బృందంలో ప్రతిఒక్కరు సీరియస్‌గా ప్రిపేరవుతున్న వాళ్లే ఉండాలి. కాంప్రహెన్షన్‌కు సంబంధించి రచయిత ఉద్దేశం, వ్యక్తం చేసిన తీరు తదితర కోణాల్లో ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి ప్రతి కాంప్రహెన్షన్‌కు ఉద్దేశించి వీటిని చదవాలి. అలాగే ఒక్కో ప్యాసేజీపై బృందంలోని ఒక్కో సభ్యుడు ప్రశ్నలు వేయాలి. కనీసంగా అయిదు మంది ఉంటే, అయిదు వేర్వేరు ప్యాసేజీలపై ప్రశ్నలు సంధించాలి. ఆ తర్వాత వారంతా ఆ అయిదింటిని చర్చించాలి. ఇలా తక్కువ సమయంలో గరిష్ఠంగా లబ్ధి చేకూరుతుంది. ఇంగ్లిష్‌లో స్పాటింగ్‌ ఎర్రర్స్‌ ఉంటాయి. గ్రామర్‌లోని ప్రాథమిక అంశాలు ఇక్కడ బాగా ఉపయోగపడుతాయి. సబ్జెక్ట్‌+ఆబ్జెక్ట్‌, వర్బ్‌, టెన్సెస్‌, ప్రిపొజిషన్స్‌, ఆర్టికల్స్‌.. వీటిపై ఎక్కువ దృష్టి సారించాలి. సబ్జెక్ట్‌కు ఉపయోగించిన వెర్బ్‌కు సంబంధమే సబ్జెక్ట్‌-ఆబ్జెక్ట్‌ అగ్రిమెంట్‌, పోటీ పరీక్షలో ఎక్కువ అంశాలు వీటి చుట్టే తిరుగుతూ ఉంటాయి.


వీటిని సమగ్రంగా అధ్యయనం చేయాలి. అయితే గ్రామర్‌ రూల్స్‌పై దృష్టి సారించకుండా గత పరీక్ష పత్రాలను చూసి, అందుకు అనుగుణంగా కొత్త పరీక్షలను రాయాలి. ఇంగ్లిష్‌ విభాగంలోనే వొకాబులరీ, క్లోజ్‌ టెస్ట్‌ తదితర అంశాలు ఉంటాయి. అయితే ఈ పరీక్ష కేవలం అర్హతకు ఉద్దేశించినందున కొన్ని అంశాలపై పూర్తి స్థాయి పట్టు సాధిస్తే మేలు. -న్యూమరికల్‌ ఎబిలిటీ: బోడ్మాస్‌ ఆధారిత ప్రశ్నలతో పాటు, అర్థమెటిక్‌ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు అర్థమెటిక్‌ అంశాలకు సంబంధించి రెండు నుంచి మూడు రోజుల్లో ప్రాథమిక అంశాలను తెలుసుకోవాలి. ఒక అధ్యాయంలో అడగదగ్గ అంశాలను అంచనా వేసుకోవాలి. ఉదాహరణకు లాభ-నష్టాలు అనే అంశం తీసుకుంటే, కొన్న ధర, అమ్మిన ధర, లాభం, నష్టం, లాభశాతం, నష్టశాతం, ఒకే ధరకు ఒక వస్తువును కొని ఒకటి లాభానికి, మరొకటి నష్టానికి అమ్మితే తుది ఫలితం.. ఇలా వీటి చుట్టే ప్రశ్నలు తిరుగుతుంటాయి. అన్ని తరహా మోడల్స్‌ను పరిశీలించి నేరుగా ప్రాక్టీస్‌ చేయాలి. పోటీ పరీక్షల్లో అంశాలు తెలుసుకుంటే సరిపోదు. ప్రాక్టీస్‌ కీలకం. సాధ్యమైనన్ని మాక్‌ పరీక్షలు రాయాలి. ముఖ్యంగా సూక్ష్మీకరణలు వేగంగా చేయడం అలవరుచుకుంటే మంచిది. అర్థమెటిక్‌లో భాగంగా లాభ-నష్టాలు, నిష్పత్తులు, శాతాలు, కాలం-దూరం, కాలం-పని... ఇలా పలు అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. -రీజనింగ్‌: ఇది అభ్యర్థుల తార్కిక పరిజ్ఞానానికి సంబంధించింది. ఇంగ్లిష్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ అందరికీ పదో తరగతి వరకు ఉండే అంశాలే. కాని రీజనింగ్‌ అనేది అకడమిక్‌ చదువులో భాగంగా ఉండదు. ఇందులో పాత పరీక్షలకు సంబంధించి మోడల్స్‌ను పరిశీలించి, నేరుగా అధ్యాయాలవారీగా కొన్ని ప్రశ్నలను ప్రాక్టీస్‌ చేసిన తర్వాత మాక్‌పరీక్షలు రాయాలి. ఇందులో బ్లడ్‌ రిలేషన్స్‌, డైరెక్షన్స్‌, ర్యాంకింగ్‌, పజిల్స్‌, సీటింగ్‌ అరెంజ్‌మెంట్‌, సిలాజిసం తదితర అంశాలనుంచి ప్రశ్నలు వస్తాయి. సమాధానం రాబట్టే తీరును గమనించి ఆ తర్వాత పరీక్షలు రాయాలి. బ్లడ్‌ రిలేషన్స్‌లో సమాధానం రాబట్టాల్సిన తీరును పరిశీలించండి....
-Pointing toward a boy, Naresh said, He is Raghu. He is the son of only son of my Paternal grandfather, how is the Raghu related to to Naresh?
-బ్లడ్‌ రిలేషన్స్‌ ప్రశ్నల్లో సమాధానం సాధారణంగా వెనకనుంచి వచ్చినప్పుడు తేలికగా వస్తుంది.
పై ప్రశ్నకు సమాధానం ఎలా రాబట్టాలో పరిశీలించండి.
Only son of my Paternal grandfather
-My father
Son of my Father -My Brother
-పై ప్రశ్నలో మొదటి స్టేట్‌మెంట్‌లో only అన్న పదం వాడారు. ఇది ఒక్కరే కొడుకు అని సూచిస్తుంది. Paternal అన్న పదం కూడా ఉంది. ఇది తండ్రివైపును సూచిస్తుంది. అంటే only son of my Paternal grandfather స్థానంలో My Father అన్న పదాన్ని పెట్టి చూస్తే సమాధానం తేలికగా వస్తుంది.
-Pointing toward a boy Naresh said, He is Raghu. He is the son of My father how is the Raghu related to Naresh?
-సన్‌ ఆఫ్‌ మై ఫాదర్‌ అంటే కచ్చితంగా బ్రదర్‌ అయి ఉండాలి. ఇలాంటి ట్రిక్స్‌ను అన్ని అధ్యాయాలకు సంబంధించి ప్రాక్టీస్‌ చేసి సాధ్యం అయినన్ని పరీక్షలు రాయాలి

-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరి తేదీ: అక్టోబర్‌ 1
-సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ పరిధిలో ఖాళీలు: 631
-ప్రిలిమినరీ పరీక్ష హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌- అక్టోబర్‌ 15వ తేదీ నుంచి
-ప్రిలిమినరీ పరీక్ష తేదీ- అక్టోబర్‌ 21, 22
-10+2+3 విధానంలో డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు అర్హులు
-01.09.2019 నాటికి కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 30 సంవత్సరాలు దాటి ఉండకూడదు
-ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు అయిదు సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
-ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు రూ 85 + జీఎస్‌టీ, ఇతర అభ్యర్థులకు ఫీజు రూ 510+ జీఎస్టీ
-పూర్తి వివరాలకు licindia.in చూడవొచ్చు

iit-jee2

v-r-sharma

1151
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles