టీఎస్‌క్యాబ్‌లో అసిస్టెంట్లు


Tue,September 10, 2019 12:42 AM

హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (టీఎస్‌క్యాబ్) వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
pgdca
-మొత్తం పోస్టులు: 62 (జనరల్-25, బీసీఏ-5, బీసీబీ-6, బీసీసీ-1, బీసీడీ-5, బీసీఈ-3, ఎస్సీ-8, ఎస్టీ-3, పీహెచ్-4, ఎక్స్‌సర్వీస్‌మెన్-2)
-పోస్టు పేరు: స్టాఫ్ అసిస్టెంట్
-అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. తెలుగు భాషలో ప్రావీణ్యం, ఇంగ్లిష్ భాషపై అవగాహన ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. తెలంగాణలోని పాత 10 జిల్లాలో నివాసుడై (లోకల్ అభ్యర్థి) ఉండాలి.
-వయస్సు: 2019 సెప్టెంబర్ 1 నాటికి గరిష్ఠంగా 28 ఏండ్లకు మించరాదు. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితి లో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 11765-31540 /-
-అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీలు రూ.600/- , ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ. 100/-
-ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా
-రాతపరీక్ష 200 మార్కులకు ఉంటుంది. దీనిలో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లిష్, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంశాలపై ప్రశ్నలు ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులను తగ్గిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 30
-ఆన్‌లైన్ టెస్ట్: నవంబర్ 2
-వెబ్‌సైట్: www.tscab.org

682
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles