విద్యార్థి విజ్ఞాన్ మంథన్


Mon,September 9, 2019 12:46 AM

పాఠశాల స్థాయి విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తి పెంచేందుకు జాతీయస్థాయిలో ప్రారంభించిన కార్యక్రమం విద్యార్థి విజ్ఞాన్ మంథన్(వీవీఎం). దీనిద్వారా విద్యార్థుల్లో సైన్స్ పట్ల జిజ్ఞాసను పెంపొందిస్తున్నారు. ఈ ప్రతిభా పరీక్షను విజ్ఞాన భారతి, ఎన్‌సీఈఆర్‌టీఈ, కేంద్ర ప్రభుత్వ సంస్థ విజ్ఞాన్ ప్రసార్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఔత్సాహికులకు ఉపయోగపడేలా విద్యార్థి విజ్ఞాన్ మంథన్ కార్యక్రమంపై ప్రత్యేక కథనం.
vignan-manthan

కార్యక్రమం-లక్ష్యాలు

-విద్యార్థుల్లో ప్యూర్ సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడం.
-ప్రపంచ సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధిలో భారత కృషిపై విద్యార్థులకు అవగాహన కల్పించడం.
-వర్క్‌షాప్‌లు, ఇతర కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు వెలికితీయడం.
-సైన్స్‌లో ఉన్నతవిద్య చదివేలా విద్యార్థులను ప్రోత్సహించడం. ఇందులో భాగంగా మెంటార్లను అందుబాటులోకి తేవడం.
-విద్యార్థుల్లో సైన్స్ దృక్పథాన్ని పెంపొందించేందుకు పోటీ పరీక్షల నిర్వహణ.
-రాష్ట్ర, జాతీయస్థాయిలో విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్ల ప్రదానం.
-ఎంపికైన విద్యార్థులను దేశంలోని వివిధ రిసెర్చ్ డెవలప్‌మెంట్ సంస్థల సందర్శనలకు తీసుకెళ్లడం.

వివరాలు

-విద్యార్థి విజ్ఞాన్ మంథన్ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులు బహుముఖ పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్కూలు, స్టేట్, నేషనల్ స్థాయిల్లో తోటి విద్యార్థుల (అదే తరగతి)తో పోటీ పడాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో జాతీయ సైన్స్ పరిశోధనా కేంద్రాలు, కేంద్రాల సందర్శన కీలకంగా నిలుస్తుంది. ఇందులో భాగంగా ప్రముఖ శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం విద్యార్థులకు దక్కుతుంది.

పరీక్ష విధానం

-పరీక్షను రెండు కేటగిరీల్లో నిర్వహిస్తారు.
-జూనియర్ గ్రూప్: 6-8 తరగతులకు ఉంటుంది.
-సీనియర్ గ్రూప్: 9-11 (ఇంటర్ ఫస్టియర్) తరగతులకు
-ప్రతి దశలోనూ విద్యార్థి వ్యక్తిగత ప్రతిభను పరీక్షిస్తారు. పరీక్షను ఇంగ్లిష్, హిందీ మాధ్యమాలతోపాటు 9 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు (దరఖాస్తుల ఆధారంగా).
-ప్రశ్నపత్రం (6-11 తరగతులు) వంద ప్రశ్నలు, 100 మార్కులకు ఉంటుంది.
-పరీక్ష మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో జరుగుతుంది.
-పరీక్ష సమయం: రెండు గంటలు.

ఎవరు అర్హులు

-ఆరోతరగతి నుంచి ఇంటర్ మొదటి ఏడాది (11వ తరగతి) చదువుతున్నవారు అర్హులు. సైన్స్-అనుబంధ సబ్జెక్టుల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించడమే వీవీఎం ప్రధాన ఉద్దేశం.

స్కూల్ (లెవల్-1)

-ప్రతి తరగతి నుంచి టాప్‌లో నిలిచిన ముగ్గురిని స్కూలు విజేతలుగా ప్రకటిస్తారు. దీని ప్రకారం ప్రతి స్కూలు నుంచి 18 మంది విజేతలుగా నిలుస్తారు. ప్రతి తరగతి నుంచి 10 మంది దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి. విజేతలకు మెరిట్ సర్టిఫికెట్ అందిస్తారు.

జిల్లా (లెవల్-2)

-జిల్లాలోని అన్ని స్కూల్స్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఒక్కో తరగతి నుంచి ముగ్గురిని జిల్లా విజేతలుగా ఎంపికచేస్తారు. దీని ప్రకారం ప్రతి జిల్లా నుంచి మొత్తం 18 మంది ఎంపికైనట్లు ప్రకటిస్తారు. వీరికి మెరిట్ సర్టిఫికెట్ అందిస్తారు.

రాష్ట్రం (లెవల్-3)

-ప్రతి తరగతి నుంచి టాప్ 20 విద్యార్థులకు రాష్ట్ర స్థాయి క్యాంప్‌లో పాల్గొనే అర్హత లభిస్తుంది. వీరిలో నుంచి ఒక్కో తరగతికి ముగ్గురి చొప్పున మొత్తం 18 మందిని రాష్ట్ర విజేతలుగా ప్రకటిస్తారు. క్యాంప్‌లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్‌తోపాటు మెమొంటోను అందిస్తారు. ప్రతి తరగతి నుంచి తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా రూ.5,000, రూ.3,000, రూ.2,000 చొప్పున నగదు బహుమతి లభిస్తుంది.

జాతీయ స్థాయి (లెవల్-4)

-ప్రతి రాష్ట్రం నుంచి టాప్ 2లో నిలిచిన విద్యార్థులకు నేషనల్ క్యాంప్‌లో పాల్గొనే అర్హత దక్కుతుంది. ప్రతి తరగతి నుంచి ముగ్గురి చొప్పున మొత్తం 18 మందిని జాతీయ విజేతలుగా ప్రకటిస్తారు. దీనికి అదనంగా ప్రతి జోన్ స్థాయిలో తరగతి నుంచి ముగ్గురి చొప్పున మొత్తం 18 మందిని జోనల్ విజేతలుగా ప్రకటిస్తారు. క్యాంప్‌లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్, మెమొంటోలు అందిస్తారు. జాతీయస్థాయిలో ప్రతి తరగతి నుంచి విజేతలుగా నిలిచిన టాప్ 3 విద్యార్థులకు వరుసగా రూ.25,000, రూ.15,000, రూ.10,000 నగదు బహుమతి దక్కుతుంది, అలాగే జోనల్ స్థాయి టాప్ 3 విద్యార్థులకు వరుసగా రూ.5,000, రూ.3,000, రూ.2,000 బహుమతి అందుతుంది.

vignan-manthan2

సిలబస్

-సైన్స్, మ్యాథమెటిక్స్ పుస్తకాల నుంచి 50 ప్రశ్నలు వస్తాయి.
-ఎన్‌సీఈఆర్‌టీ కరికులం అనుసరించాలి.
-సైన్స్‌లో భారత్ కృషి అంశం నుంచి 20 ప్రశ్నలు వస్తాయి.
-విద్యార్థి విజ్ఞాన్ మంథన్ మెటీరియల్‌ను చదవాలి.
-జగదీశ్ చంద్రబోస్ తదితరుల జీవిత అనుభవాల నుంచి 20 ప్రశ్నలు వస్తాయి.
-లాజిక్ అండ్ రీజనింగ్ నుంచి పది ప్రశ్నలు ఇస్తారు. వీటి కోసం జనరల్ రీడింగ్‌పై ఆధారపడాలి.

దరఖాస్తు విధానం

-ముందుగా ప్రతి స్కూలు వీవీఎంలో పాల్గొనేందుకు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. దీనికోసం సదరు స్కూల్ ప్రిన్సిపల్/హెడ్‌మాస్టర్.. స్కూల్ ఎగ్జామ్ కోఆర్డినేటర్‌ను నియమించాలి. అనంతరం స్కూల్ పేరు, అడ్రస్, ప్రిన్సిపల్ పేరు, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ అడ్రస్ తదితరాలను ఎంటర్ చేయాలి. వీటిని పూర్తిచేసిన ప్రతి స్కూలుకి యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్, యూజర్ నేమ్, పాస్‌వర్డ్ అందిస్తారు. ఎగ్జామ్ కోఆర్డినేటర్ వీటి ఆధారంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో విద్యార్థుల పేర్లను నమోదు చేయవచ్చు.
-స్కూలు కేటగిరీలో దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్ విధానం అందుటాటులో ఉంది. కనీసం 30 మంది విద్యార్థులు ఉన్నప్పుడే స్కూలు కేటగిరీ కింద నమోదు చేసుకొనే వీలుంది. 30 మంది విద్యార్థులు నమోదు చేసుకుంటే ఆ స్కూలే ఎగ్జామ్ సెంటర్‌గా ఉంటుంది.
-ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
-స్కూలు ద్వారా దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులు నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఏదైనా పరీక్ష కేంద్రాన్ని ఎంచుకోవచ్చు.

ముఖ్య తేదీలు

-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 15
-పరీక్ష ఫీజు: రూ. 100/-
-ఫీజును ఆన్‌లైన్‌లో లేదా చలానా రూపంలో మాత్రమే చెల్లించాలి.
-అపరాధ రుసుంతో రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: సెప్టెంబర్ 30
-పరీక్షతేదీ (ఎంపిక చేసుకోవాలి): నవంబర్ 24, 30
-పరీక్ష సమయం: ఉదయం 11 నుంచి 1 గంట వరకు
-పరీక్ష ఫలితాల వెల్లడి: 2019, డిసెంబర్ 15
-రాష్ట్రస్థాయి క్యాంప్: 2020, జనవరి 5, 12, 19 (ఏదైనా ఒకరోజు)
-రెండు రోజుల జాతీయ క్యాంప్: 2020, మే 16, 17
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://vvm.org.in/index.php

వీవీఎం రాష్ట్ర కోఆర్డినేటర్లు

పి. ఆనందం- 9948099462, కందాల రామయ్య - 9948867665, పత్తి సదానందం -9866275101, గుర్రం శ్రీరామ్‌రెడ్డి- 7207276553, అనంత జనార్దన్ - 9440466055

511
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles