బ్రిటన్ మాస్టర్స్ స్కాలర్‌షిప్స్


Wed,September 4, 2019 01:28 AM

విదేశాల్లో చదువుకోవాలనుకునేవారికి నేడు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆర్థిక స్తోమత లేనివారు సైతం బ్రిటన్‌లో చదువుకోవడానికి ఆ దేశం ప్రోత్సాహాన్ని ఇస్తుంది. దీనికోసం మాస్టర్స్ స్కాలర్‌షిప్స్ ఇస్తుంది. దీనికి సంబంధించిన ప్రకటన విడుదలైన నేపథ్యంలో సంక్షిప్తంగా ఆ వివరాలు తెలుసుకుందాం...
new-students
-అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణులై రెండేండ్ల ఉద్యోగ అనుభవం ఉన్నవారు స్కాలర్‌షిప్స్‌పై మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు అర్హులు. అదేవిధంగా
-వృత్తి నిపుణులు ఆయా రంగాల్లో మరింతగా రాణించేందుకు స్వల్పకాలిక కోర్సుల కోసం ఫెలోషిప్స్ ఇస్తారు.
-స్కాలర్‌షిప్స్ సంఖ్య: ప్రతి ఏడాది సుమారు 1,800 స్కాలర్‌షిప్స్ ఇస్తారు. దీనిలో భారతీయ విద్యార్థులకు 110 కేటాయించారు.
నోట్: బ్రిటన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకునే వారు స్కాలర్‌షిప్స్ పొందేందుకు అర్హులు. వివిధ దశల ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
స్కాలర్‌షిప్ మొత్తం: మాస్టర్స్ పూర్తి చేసే ఏడాది కాలానికి అన్ని ఖర్చులను బ్రిటిష్ ప్రభుత్వమే భరిస్తుంది. ఫీజు, నివాస ఖర్చులు ఇందులో ఉంటాయి. ఒక్కో విద్యార్థిపై ఏడాది కాలానికి 30 వేల పౌండ్లను వెచ్చిస్తారు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ.26 లక్షలకు పైగా ఉంటుంది. 12 రకాల మాస్టర్స్ కోర్సుల్లో ఎందులోనైనా వారు చేరవచ్చు. ఇన్నోవేషన్స్, సైబర్ సెక్యూరిటీ నుంచి ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, లైఫ్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి పలురకాల కోర్సులున్నాయి.
ఏయే యూనివర్సిటీల్లో కోర్సు చేయవచ్చు?
-కోర్సు ఎంపిక స్వేచ్ఛ విద్యార్థులదే. బ్రిటన్‌లోని 150 విశ్వవిద్యాలయాల్లో ఎక్కడైనా చేరవచ్చు.
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-చివరితేదీ: నంవంబర్ 5
-ఎంపిక ప్రక్రియ ఫలితాలు: ఫిబ్రవరిలో ప్రకటిస్తారు
-పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్లు:
https://www.chevening.org/scholarships
https://www.chevening.org/scholarship/india

812
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles