వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు-రిజర్వులు


Wed,August 28, 2019 01:18 AM

అభయారణ్యాలు

-వీటికి సరిహద్దులు ఉండవు. ఇక్కడ అంతరించి పోయే ప్రమాదంలో ఉన్నవాటిని సంరక్షిస్తారు.
-వ్యక్తులకు సంబంధించి అన్నిరకాల అనుమతులు ఉంటాయి.
-ఇందులో పరిశోధనలకు ప్రోత్సాహముంటుంది.
-2017 నాటికి దేశంలో మొత్తం 543 అభయారణ్యాలు ఉన్నాయి.

రాష్ట్రంలో అభయారణ్యాలు

-తెలంగాణలో మొత్తం 9 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. అవి..
-కవ్వాల్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం: ఇది ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో విస్తరించి ఉంది. దీని వైశాల్యం 892.31 చ.కి.మీ.
-ఇది మహారాష్ట్రలోని తడోబా అంథేరి టైగర్ రిజర్వ్, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వులను ఆనుకుని ఉంటుంది.
-ప్రాణహిత వన్యప్రాణి సంరక్షణ కేంద్రం: ఇది మంచిర్యాల జిల్లాలో ఉంది. (ప్రాణహిత నది పరీవాక ప్రాంతం)
-శివారం అభయారణ్యం: మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలు
-ఏటూరు నాగారం అభయారణ్యం: ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. రాష్ట్రంలో పురాతన అభయారణ్యం. దీనిగుండా గోదావరి నది ప్రవహిస్తుంది. ఇందులో రాక్షస గుహలు, చారిత్రక యుగానికి చెందిన శిలాధారాలు లభించాయి.
-పాకాల అభయారణ్యం: మహబూబాబాద్, వరంగల్ రూరల్ జిల్లాల్లో విస్తరించి ఉంది.
-కిన్నెరసాని అభయారణ్యం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది.

-దేశంలో అత్యధిక పులులు ఉన్న రాష్ట్రం- కర్ణాటక (406)


-అమ్రాబాద్ అభయారణ్యం: దీన్ని రాజీవ్‌గాంధీ వైల్డ్‌లైఫ్ సాంక్చువరీ అంటారు. ఇది నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ అభయారణ్యాన్ని 1978లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాగా, 1983లో పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తించారు.
-రాష్ట్ర విభజన సందర్భంగా దీన్ని కూడా విభజించారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తిస్తూ 2015, ఫిబ్రవరి 6న ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కృష్ణానది పరీవాహక ప్రాంతం వెంబడి విస్తరించి ఉంది. ఇందులో మొత్తం 15 పులులు ఉన్నాయి.
-వన్యప్రాణుల సంరక్షణ కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 48, ఆర్టికల్ 51(ఏ)లను అనుసరించి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపొందించింది.
-ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణ కోసం 1952లో ఇండియన్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు.
-1972లో వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని అన్ని రాష్ర్టాల్లో అమలయ్యేట్లు చేశారు (జమ్ముకశ్మీర్ మినహా). ఇందులో భాగంగా 1973, ఏప్రిల్ 1 నుంచి జాతీయ జంతువుగా పులిని ప్రకటించారు.
-ఈ చట్టం ప్రకారం దేశంలో అంతరించిపోతున్న జంతువులకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. వాటినే జాతీయ వన్యప్రాణి సంరక్షణ ప్రాజెక్టులు అంటారు. అవి..
-టైగర్ రిజర్వులు (Project Tiger)
-ఆపరేషన్ ఎలిఫెంటా (ఎలిఫెంటా రిజర్వులు)
-ఆపరేషన్ క్రొకొడైల్ (Operation Crocodile)
-ఆపరేషన్ సీటర్జిల్ (Operation Seaturtle)

టైగర్ రిజర్వులు

-1973, ఏప్రిల్ 1న దేశంలో ఆపరేషన్ టైగర్ అనే ప్రాజెక్టును ప్రారంభించి 9 టైగర్ రిజర్వ్‌లను ప్రకటించారు.
-దేశంలో ప్రస్తుతం టైగర్ రిజర్వుల సంఖ్య- 50
-దేశంలో మొదటి పులుల సంరక్షణ కేంద్రం- బందీపూర్ టైగర్ రిజర్వు (కర్ణాటక)

-ఆపరేషన్ టైగర్ ప్రాజెక్టును ప్రాజెక్టును ప్రకటించకముందు మన జాతీయ జంతువు- సింహం


-50వ టైగర్ రిజర్వు అరుణాచల్‌ప్రదేశ్ కమ్‌లాంగ్.
-దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వు- నాగార్జునసాగర్-శ్రీశైలం (ఇది మొత్తం 3,728 చ.కి.మీ. విస్తరించి ఉంది)
-దేశంలో అతిచిన్న టైగర్ రిజర్వు- పెంచ్ (మహారాష్ట్ర)

ముఖ్యమైన టైగర్ రిజర్వులు

-మధ్యప్రదేశ్: కన్హా (1973)- 80 పులులు, పెంచ్ (1992-93)- 43, బాంధవ్‌ఘర్ (1993-94)- 63, పన్నా (1994-95)- 17, సాత్పురా (1999-2000)- 26, సంజయ్-దుబ్రి (2008-09 )- 8
-ఉత్తరాఖండ్: జిమ్‌కార్బెట్ (1973-74 )- 215, రాజాజీ (2015)
-ఉత్తరప్రదేశ్: దుద్వా (1987-88)- 58, ఫిలిబిత్ (2014)- 25
-బీహార్: వాల్మీకి (1989-90)-22
-జార్ఖండ్: ఫలమావు (1973-74)- 3
-పశ్చిమబెంగాల్: సుందర్‌బన్స్-24 పరణాలు (1973-74)- 68, బుక్సా (1982-83)- 2
-ఒడిశా: సిమ్లిపాల్ (1973-74)- 3 తెల్లపులులు, సంత్కోషియా (2008-09)- 3
-తెలంగాణ: కవ్వాల్ (2012-13), అమ్రాబాద్
-ఛత్తీస్‌గఢ్: ఇంద్రావతి- 13, అచానక్మర్- 11, ఉదంతి సీతానది- 4
-కేరళ: పెరియార్- 20, పరాంబికుళం- 19
-కర్ణాటక: బందీపూర్ (1973-74)- 382, బద్రా- 22, అన్షి దండేలి- 5, నాగర్ హోల్- 101, బిలిగిరి రంగనాథ- 68
-మహారాష్ట్ర: తడోబా-అంధేరి- 51, ఫెంచ్-35, మేల్ఘాట్-25, సహ్యాద్రి-7, నవగావ్ నజీరా-7, బోర్-5
-తమిళనాడు: కలక్కాడ్ ముండతులై-10, అన్నామలై-13, మదుమలై- 89, సత్యమంగళం- 2
-రాజస్థాన్: రణతంబోర్- 37, సరిస్కా-9, ముకంద్రహిల్స్
-మిజోరమ్: దంఫా-3
-అరుణాచల్‌ప్రదేశ్: నామ్‌దఫా (1982-83)-11, పాకుయ్ (1999-2000)- 7, కామ్‌లాంగ్ (2016)
-అసోం: నామేరి (1999-2000)-5, కజిరంగా (2008-09)-103, మానస (1973-74)-11, జలాంగ్ (2016)

ఆపరేషన్ ఎలిఫెంట్

-ఎలిఫెంటా రిజర్వులను 1992 ఫిబ్రవరిలో ప్రారంభించారు.
-ఈ ప్రాజెక్టును కౌండిన్య ప్రాజెక్టు అంటారు.
-దేశంలో ఎక్కువ ఏనుగులు కర్ణాటకలో (4,452) ఉన్నాయి.
-ప్రస్తుతం 14 రాష్ర్టాల్లో 31 ఏనుగు సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి.
-దేశంలో ఏనుగులు సంచరించే ప్రాంతాలను మూడు విధాలుగా విభజించారు. అవి..
-1. గ్రీన్ ఏరియా (మానవుని ఆధిపత్యం ఎక్కువగా ఉంటే)
-2. ఎల్లో ఏరియా (మనుషులు, ఏనుగులకు సమాన సంఘర్షణ కలిగిన ప్రాంతం)
-3. రెడ్ ఏరియా (ఏనుగుల ఆధిపత్యం ఎక్కువ)

-ఔషధ అభయారణ్యం: అనంతగిరి (వికారాబాద్)
-మంజీరా అభయారణ్యం: సంగారెడ్డి జిల్లా
-పోచారం అభయారణ్యం: మెదక్ జిల్లా


ఆపరేషన్ క్రొకొడైల్

-ఈ ప్రాజెక్టు 1974లో యూఎన్‌డీపీ సహకారంతో ప్రపంచంలో ప్రారంభమైంది. దేశంలో 1975లో మొదలైంది.
-దేశంలో మొసళ్ల సంరక్షణ కోసం క్రొకొడైల్ బ్యాంకును చెన్నైలో ఏర్పాటు చేశారు.
-అత్యంత వేగంగా అంతరించిపోతున్న మొసళ్ల జాతి- ఘరియల్

ethical-elephants

ఏనుగుల సంరక్షణ కేంద్రాలు

-కర్ణాటక: మైసూర్ ఎలిఫెంట్ రిజర్వు- 4452 ఏనుగులు
-కేరళ: నీలాంబర్ (281), వయనాడ్ (636), అనైముడి (1547), పెరియార్ (1100)
-తమిళనాడు: శ్రీవిల్లి పుత్తూర్... (638), అన్నామలై (179), కోయంబత్తూరు (329), నీలగిరి (2862)
-ఆంధ్రప్రదేశ్: రాయల (12)
-ఒడిశా: మయూర్‌భంజ్ (465), సంబాల్‌పూర్ (336), బైతర్‌ని (108), దక్షిణ ఒడిశా (138)
-పశ్చిమబెంగాల్: Eastern Dooars (350), మయూర్ జర్నా (90)
-అసోం: చిరాంగ్-రిప్ప్ (658), కజిరంగా-కార్బిఅన్‌గ్లాంగ్ (1940), సొనిత్‌పూర్ (612), దిహంగ్ పాట్కాయ్ (295), ధన్‌సిరి-లంగ్‌డింగ్ (275)
-అరుణాచల్‌ప్రదేశ్: దక్షిణ అరుణాచల్‌ప్రదేశ్ (129), కామెంగ్
-నాగాలాండ్: ఇంటాకి (30)
-మేఘాలయా: గారోహిల్స్ (1047), ఖాసి హిల్స్ (383)
-జార్ఖండ్: సింగ్‌భమ్ (371)
-ఛత్తీస్‌గఢ్: బాదల్‌కోల్-తమోర్‌పింగ్లా (138), లెమ్రూ
-ఉత్తరాఖండ్: శివాలిక్ (1610)
-మొత్తం ఏనుగుల సంఖ్య 21370

ఆపరేషన్ సీటర్జిల్

-దీన్ని 1975లో ప్రారంభించారు.
-ఒడిశా: గహిర్మాతబీచ్-ఆలివ్ రిడ్లే తాబేళ్లు
-తమిళనాడు: ట్యుటికోరిన్- హక్స్ బిల్ తాబేళ్లు

బయోస్పియర్ రిజర్వులు

-వీటి సరిహద్దులను పార్లమెంట్ నిర్ణయిస్తుంది.
-ఇక్కడ జంతువులతోపాటు అన్నిరకాల జీవజాతులను పరిరక్షిస్తారు. టూరిజానికి అనుమతిలేదు.
-దేశంలో ప్రస్తుతం 18 బయోస్పియర్ రిజర్వులు ఉన్నాయి.
-మొదటి బయోస్పియర్ రిజర్వు తమిళనాడులోని నీలగిరి (1986), చివరగా ప్రకటించిన బయోస్పియర్ మధ్యప్రదేశ్‌లోని పన్నా (2011).
-యునెస్కో జాబితాలోని బయోస్పియర్‌లు.. నీలగిరి, మన్నార్‌సింధుశాఖ (తమిళనాడు), సుందర్‌బన్స్ (పశ్చిమబెంగాల్), నందాదేవి (ఉత్తరాఖండ్), నోక్రెక్ (మేఘాలయా), పంచ్‌మర్హి (మధ్యప్రదేశ్), సిమ్లిపాల్ (ఒడిశా), అచానక్‌మర్-అమర్‌కంటక్ (మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్), గ్రీన్ నికోబర్ (అండమాన్), అగస్థమలై (కేరళ).
-నీలగిరి, సుందర్‌బన్స్, మన్నార్ సింధుశాఖ, నందాదేవి బయోస్పిర్ రిజర్వుల కోసం మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ (ఎంఏబీ) అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
-దేశంలో బయోస్పియర్ రిజర్వులు అమలులో ఉన్న రాష్ర్టాలు 15. అవి..
-తమిళనాడు: నీలగిరి, మన్నార్ సింధుశాఖ
-కేరళ: అగస్థమలై
-ఆంధ్రప్రదేశ్: శేషాచలం
-ఒడిశా: సిమ్లిపాల్
-పశ్చిమబెంగాల్: సుందర్‌బన్స్
-మేఘాలయా: నోక్రెక్
-అసోం: మానస, దిబ్రూ-సైకోవా
-అరుణాచల్‌ప్రదేశ్: దిహంగ్-దిబాంగ్
-సిక్కిం: కాంచనగంగ
-మధ్యప్రదేశ్: పంచుమర్హి, పన్నా
-హిమాచల్‌ప్రదేశ్: కోల్డ్‌డెజర్ట్
-ఉత్తరాఖండ్: నందాదేవి
-గుజరాత్: కచ్
-మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్: అచానక్‌మర్-అమర్‌కంటక్
-అండమాన్ నికోబార్ దీవులు: గ్రేట్ నికోబార్

-ప్రపంచ వన్యప్రాణి, జంతుసంక్షేమ దినోత్సవం- అక్టోబర్ 4


ఆవాసేతర రక్షణ

-ఏదైనా భౌగోళిక ప్రాంతంలో అంతరించిపోయే స్థితిలో ఉన్న జీవజాతులను వాటి సహజసిద్ధ పరిసరాలకు వెలుపల మానవ ప్రమేయంతో సంరక్షించే విధానాన్ని ఆవాసేతర రక్షణ (Ex-Situ protection) అంటారు.
-దీనికోసం జన్యు బ్యాంకులను ఏర్పాటు చేయడం, బీజ ద్రవ్య బ్యాంకులు, విత్తన-పిండి నిల్వల బ్యాంకు, బొటానికల్ గార్డెన్లు, జంతుప్రదర్శన శాలలను ఏర్పాటు చేస్తారు.
kasam-ramesh

872
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles