ssc-JE ఇలా కండి ఇంజినీర్‌


Mon,August 26, 2019 01:54 AM

దేశంలో UPSC తర్వాత ఒక క్రమపద్ధతిలో ప్రతీ సంవత్సరం ఉద్యోగ నియామకాలు చేపట్టే పరీక్షల్లో SSC-JE ఒకటి. అతి చిన్నవయస్సులో కేంద్రప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకునే టెక్నికల్‌ విద్యార్థులకు ఇది ఒక సువర్ణావకాశం.
Engineer
SSC-JE పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది.

మొదటి పేపర్‌


Computer Based Objective Type ఈ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది.
-ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. అవి
1) జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్‌ 50 ప్రశ్నలు- 50 మార్కులు
2) జనరల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు-50 మార్కులు
3) జనరల్‌ ఇంజినీరింగ్‌ 100 ప్రశ్నలు-100 మార్కులు
-పరీక్ష ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీలో ఉంటుంది.
-పేపర్‌-Iలో ఒక్కో తప్పు సమాధానానికి 1/4 మార్కులు కోత విధిస్తారు.
-పేపర్‌-Iలో ఉన్న 200 ప్రశ్నలకు ఇచ్చే సమయం 120 నిమిషాలు మాత్రమే. ఈ విషయాన్ని అభ్యర్థులు దృష్టిలో ఉంచుకుని ప్రిపరేషన్‌ విధానాన్ని ప్రణాళికాబద్ధంగా, కాన్సెప్టువల్‌ లెర్నింగ్‌, సరైన మార్గదర్శకత్వంలో Computer Based Exams బాగా సాధన చేయాలి.
-పేపర్‌-Iలో వచ్చిన Normalised Marks ఆధారంగా పేపర్‌-2 పరీక్షకు అర్హత కల్పిస్తారు.
-పేపర్‌-Iలో మొదటి 50 ప్రశ్నలు జనరల్‌ ఇంటెలిజెన్స్‌ రీజనింగ్‌కు సంబంధించినవి ఉంటాయి. ఈ ప్రశ్నలు అభ్యర్థి Logical thinking, Problem soluing skills, Mental ability, Visual skillsను పరీక్షించేలా ఉంటాయి.
-ఈ విభాగంలో నంబర్‌ సిరీస్‌, Add one out, Directio, & Distance, Statement& Conclusions, Blood relations, Paper folding మొదలైన వాటినుంచి ప్రశ్నలు అడుగుతారు.
-తరువాత 50 ప్రశ్నలు జనరల్‌ అవేర్‌నెస్‌కు సంబంధించినవి ఉంటాయి. ఇవి అభ్యర్థి అవగాహన శక్తిని, ప్రస్తుత ప్రపంచం, దేశంలో జరుగుతున్న సంఘటనలపై గ్రహణశక్తిని పరీక్షించే విధంగా ఉంటుంది. ఈ విభాగంలో హిస్టరీ, జాగ్రఫి, పాలిటీ, ఎకనామిక్స్‌, ఫిజికల్‌సైన్స్‌, కంప్యూటర్స్‌, జనరల్‌ నాలెడ్జి, కరెంట్‌ అఫైర్స్‌ మొదలైన వాటిపై ప్రశ్నలు ఉంటాయి.
-ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులకు ఈ వంద మార్కులు కీలకం.
-టెక్నికల్‌ విద్యార్థులు వీటిని రెగ్యులర్‌గా Academicsలో చదవక పోవడం వలన కష్టంగా భావిస్తారు. కాని ఒక ప్రణాళికాబద్దంగా, సరైన మార్గదర్శకత్వంలో నిరంతరాయంగా పరీక్ష వరకు ప్రాక్టీస్‌ చేస్తే సులువుగా మార్కులు సాధించవచ్చు.
-ఆఖరి వంద మార్కులు విద్యార్థి ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
-ఎలక్ట్రికల్‌ విభాగం విద్యార్థులకు వంద మార్కుల జనరల్‌ ఇంజినీరింగ్‌ ప్రశ్నలు.
-Bacis Electricity
-Magnetic circuit
-AC fundamentals
-Measuring Instrument
-Machines
-Power Systems
-Estimation & costing
-Utiligation
-Basic electronics సబ్జెక్టుల నుంచి అడుగుతారు. వీటిలో Machines& Power Systems నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
-చాలా మంది ఎలక్ట్రికల్‌ విద్యార్థులు ఎలాక్ట్రానిక్స్‌ను తమ సబ్జెక్టుగా భావించకుండా విడిచిపెడతారు. సరైన పద్ధతిలో ప్రిపేర్‌ అయితే సులభంగా మార్కులు సాధింవచ్చు.
-Basic Engineeringలో అడిగే ప్రశ్నలు సరాసరి E CET- levelలో ఉంటాయి.
ఉదాహరణ:
Q. Form Factor of an alternating wave is
a) Average value Rms value
b) Rms value Average value
c) Rms value Average value
d) Rms value average value
Ans: C

సివిల్‌ ఇంజినీరింగ్‌


-వంద మార్కుల జనరల్‌ ఇంజినీరింగ్‌ ప్రశ్నలు.
-Building materials
-Surveying
-Soil mechanics
-Hydraulics
-Irrigation
-Transportation
-Environmental Engineering
-Structural Engg( Tos, Rcc, Steel)
-Estimating, Costing& Valuation సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
-వీటిలో Building materials, Structural engg, soil mechanics నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి.

ముఖ్యమైన తేదీలు


ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రారంభం: 13.08.2019
చివరితేదీ: 12.09.2019
మరిన్ని వివరాలకు
http://ssc.nic.in website చూడవచ్చు.
SSC-JE పరీక్షకు Diploma (civil, mechanical, electrical), Engineering (civil, mechanical, electrical) పట్టభద్రులు అర్హులు.
SSC-JE ద్వారా నియమించే కొన్ని ఉద్యోగాలకు Diploma విద్యార్థులు ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి.

పేపర్‌-2 డిస్క్రిప్టివ్‌ రాతపరీక్ష


ssc
-ఈ పేపర్‌కు 300 మార్కులు ఉంటాయి. అభ్యర్థులు పరీక్షను మొత్తం హిందీలో రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు అవసరమైన కాలిక్యులేటర్‌, లాగరిథమ్‌ టేబుల్‌, స్టీమ్‌ టేబుల్స్‌ తీసుకుని వెళ్లవచ్చు.
-పేపర్‌-2కి సిలబస్‌ పేపర్‌-1లో జనరల్‌ ఇంగ్లిష్‌కు సంబంధించిన సబ్జెక్టులు ఉంటాయి.
-ఈ పేపర్‌లో అడిగే ప్రశ్నలు అకడమిక్‌ ప్రశ్నల్లా ఉంటాయి.
-డెఫినేషన్లు, బ్లాక్‌ డయాగ్రమ్‌, ఎక్స్‌ప్లెయిన్డ్‌ ప్రాబ్లమ్స్‌, కంపారిజన్‌, డిఫరెన్సెస్‌ మొదలైన వాటిపై ప్రశ్నలు అడుగుతారు.
-ఇంజినీరింగ్‌ పేపర్‌ చదివేటప్పుడు డెఫినేషన్లు, బ్లాక్‌ డయాగ్రమ్స్‌, స్టాండర్ట్‌ ఈక్వేషన్లను రాసిపెట్టుకుంటే పేపర్‌-2 రాతపరీక్షకు ఉపయోగపడుతుంది.

చదవాల్సిన పుస్తకాలు


CIVIL
-ఏ మోడ్రన్‌ అప్రోచ్‌ టు వెర్బల్‌ అండ్‌ నాన్‌ వెర్బల్‌ రీజనింగ్‌- ఆర్‌ఎస్‌ అగర్వాల్‌
-లూసెంట్‌ జనరల్‌ నాలెడ్జ్‌
-మనోరమా ఇయర్‌బుక్‌

సివిల్‌ ఇంజినీరింగ్‌


1. సివిల్‌ ఇంజినీరింగ్‌ ఆబ్జెక్టివ్‌- గుప్తా అండ్‌ గుప్తా
2. సివిల్‌ ఇంజినీరింగ్‌ ఆబ్జెక్టివ్‌- ఎస్‌ చాంద్‌
3. ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌ అండ్‌ హైడ్రాలిక్‌ మెకానిక్స్‌- ఆర్‌కే బన్సాల్‌
4. స్ట్రెంగ్త్‌ ఆఫ్‌ మెటీరియల్స్‌- రామామృతం
5. సాయిల్‌ మెకానిక్స్‌ అండ్‌ జియో టెక్నికల్‌ ఇంజినీరింగ్‌- డీపీ పున్యా
6. స్టీల్‌ స్ట్రక్చర్స్‌- ఎస్‌కే దుగ్గల్‌

మెకానికల్‌ ఇంజినీరింగ్‌


-మెకానికల్‌ ఆబ్జెక్టివ్‌- ఆర్‌ఎస్‌ కుమ్రిత్‌, జేకే గుప్తా
-మెకానికల్‌ ఆబ్జెక్టివ్‌- డీఎస్‌ కుమార్‌
-మెకానికల్‌ ఆబ్జెక్టివ్‌- ఆర్‌కే జైన్‌

ఎలక్ట్రికల్‌


-ఎలక్ట్రికల్‌ టెక్నాలజీ- BL Thereja
-ఆబ్జెక్టివ్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ టెక్నాలజీ- వీకే మెహతా
-ఏబీసీ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌- బీఎల్‌ థెరేజా (పేపర్‌-2)

మెకానికల్‌ ఇంజినీరింగ్‌


-ఇందులో జనరల్‌ ఇంజినీరింగ్‌ నుంచి 100 మార్కులకు ప్రశ్నలు వస్తాయి.
-థియరీ ఆఫ్‌ మెషిన్స్‌, మెషిన్‌ డిజైన్‌, ఇంజినీరింగ్‌ మెకానిక్స్‌, స్ట్రెంగ్త్‌ ఆఫ్‌ మెటీరియల్స్‌, థర్మో డైనమిక్స్‌, పవర్‌ ప్లాంట్స్‌, రిఫ్రిజిరేషన్‌, ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌, ప్రొడక్షన్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ఉదా: -The crushing strength of a first class Brick is? (3)
1) 3 N/mm2
2) 5.5 N/mm2
3) 10.5 N/mm2
4) 7.5 N/mm2

రెండో పేపర్‌ ఎలక్ట్రికల్‌


1. Explain different types of distribution systems with neat sketch
2. A Dc machine induces an emf of 240V at 1500 rpm. Find the developed torque. For an armature current of 25A.

Mechanical


1.Define the following.
i. Reversible and Irreversible process.
ii. External and internal irreveribility.
iii. Intensive and Extensive properties.

2.Give the comparision between ottocycle, Diesel cycle and dual cycle.


Civil
1. What are the requirements of a good ballast in railway engineering, explain how the minimum depth of ballast cushion is estimated.
2. Describe plate load test as per Is 1888, Discuss the limitations, what are the effects of size of plate on bearing capacity and settlement?
-Descriptive paperలో మంచి మార్కులు సాధించాలంటే ఇంగ్లిష్‌పై పట్టు ఉండాలి. క్యాలిక్యులేటర్‌, స్టీమ్‌ టేబుల్స్‌ ఉపయోగించడం రావాలి.
SHASHIKANTH

744
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles