సీటెట్ డిసెంబర్ 2019


Wed,August 21, 2019 04:19 AM

టీచర్ ఉద్యోగం నోబుల్ ప్రొఫెషన్. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఉపాధ్యయ కొలువులో చేరాలంటే తప్పనిసరిగా బీఈడీ/డీఈడీతోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్షలో తప్పనిసరిగా అర్హత సాధించాలి. దేశవ్యాప్తంగా ఉన్న ఛాత్రోపాధ్యాయులకు ఏటా రెండుసార్లు ఈ అర్హత పరీక్షను నిర్వహించే బాధ్యతను కేంద్ర మానవ వనరుల శాఖ సీబీఎస్‌ఈకి అప్పగించింది. ప్రతి ఏటా జూన్/డిసెంబర్‌లలో ఈ సంస్థ సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను నిర్వహిస్తుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో నిర్వహించనున్న సీటెట్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు నిపుణ పాఠకుల కోసం...

-న్యూఢిల్లీలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎసీఈ) సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (డిసెంబర్, 2019) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
-అర్హత సాధిస్తే ఉపయోగాలు: కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, ఆర్మీ స్కూళ్లతోపాటు రాష్ట్రస్థాయి పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాలకు అర్హత లభిస్తుంది.
-వ్యాలిడిటీ ఎన్నేండ్లు: ఒక్కసారి ఈ పరీక్షలో అర్హత సాధిస్తే ఏడేండ్ల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ పరీక్షను ఎన్నిసార్లయినా రాసుకోవచ్చు. ఎక్కువ స్కోర్ వచ్చిన సీటెట్‌ను ఉపయోగించుకోవచ్చు.
BED

పేపర్ 1-ప్రైమరీ స్టేజ్ (1-5 తరగతులకు బోధించడానికి)
-అర్హత: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఈడీ లేదా ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్)లో డిప్లొమా లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా డిగ్రీతో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత.

పేపర్ 2-ఎలిమెంటరీ స్టేజ్ (6-8 తరగతులకు బోధించడానికి)
-అర్హత: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీతో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా/బీఈడీ లేదా 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ లేదా నాలుగేండ్ల బీఏ/బీఎస్సీ ఎడ్యుకేషన్, బీఏఈడీ, బీఎస్‌ఈడీ, డిగ్రీతోపాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.

ఎంపిక: రాత పరీక్ష ద్వారా
పేపర్ 1-ప్రైమరీ స్టేజ్ (పీఆర్‌టీ) (6-11 వయస్సు గల పిల్లలకు బోధించడానికి)
-రాత పరీక్ష సిలబస్: చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగాగీ, లాంగ్వేజ్ 1 (తప్పనిసరి), లాంగ్వేజ్ 2 (తప్పనిసరి), మ్యాథమెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు ఇస్తారు.

పేపర్ 2-ఎలిమెంటరీ స్టేజ్ (టీజీటీ) (11-14 వయస్సు గల పిల్లలకు బోధించడానికి)
-రాత పరీక్ష సిలబస్ : చైల్డ్ డెవలప్‌మెంట్ & పెడగాగీ, లాంగ్వేజ్ 1 (తప్పనిసరి), లాంగ్వేజ్ 2 (తప్పనిసరి) అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్/సోషల్ సైన్స్‌లో 60 ప్రశ్నలు ఇస్తారు.
గమనిక: పేపర్-I 150 మార్కులు, పేపర్-II 150 మార్కులు. రాతపరీక్ష (సీటెట్)కు కేటాయించిన సమయం 2 గంటల 30 ని.లు. లాంగ్వేజ్-1/లాంగ్వేజ్-2 పరీక్షలు మొత్తం 20 భాషల్లో నిర్వహిస్తారు.
దేశవ్యాప్తంగా 110 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు పేపర్-I లేదా పేపర్-II రూ.700/- (రెండు పేపర్లు-రూ.1200/-). ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు పేపర్-I లేదా పేపర్-II రూ.350/- (రెండు పేపర్లు-రూ.600/-)
నోట్: ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: సెప్టెంబర్ 18
-ఫీజు చెల్లించడానికి చివరితేదీ: సెప్టెంబర్ 23 (మధ్యాహ్నం 3.30 వరకు)
-పరీక్షతేదీ: డిసెంబర్ 8 (పేపర్-I 9.30 AM-12 PM, పేపర్-II 2 PM-4.30 PM)
-వెబ్‌సైట్: www.ctet.nic.in

-తన్నీరు వెంకటేశ్వర్లు

769
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles