స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజినీర్లు


Wed,August 14, 2019 01:00 AM

Engineers
ప్రభుత్వ కొలువుల కోసం లక్షలాదిమంది ఇంజినీరింగ్, డిప్లొమా అభ్యర్థులు ఎదురుచూస్తుంటారు. ఏటా క్రమం తప్పకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో ఉన్న జూనియర్ ఇంజినీర్ల భర్తీ ప్రక్రియను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) చేపడుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాగా, తిరిగి ఆగస్టు 12న మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆ పోస్టులకు సంబంధించిన వివరాలు సంక్షిప్తంగా...

- జూనియర్ ఇంజినీర్లు: కేంద్రంలోని వివిధ శాఖల్లో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులు గ్రూప్ బీ (నాన్ గెజిటెడ్), లెవల్-6 పోస్టులు. పే స్కేల్ రూ.35,400-1,12,400/-

ఏయే శాఖల్లో ఖాళీలు?

- కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సీపీడబ్ల్యూడీ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్, మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్), ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్టు, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్, డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్, నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్‌టీఆర్‌వో).
- అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణులు.
- వయస్సు: సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లలో పోస్టులకు 32 ఏండ్లు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్‌కు 27 ఏండ్లు, మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్‌లోని సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ పోస్టులకు 30 ఏండ్లు, క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్ పోస్టులకు 27 ఏండ్లు, ఫరక్కా బ్యారేజీ ప్రాజెక్టు, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్లలోని పోస్టులకు 30 ఏండ్లు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

నోట్: బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌లో పోస్టులకు పీహెచ్‌సీ అభ్యర్థులు అర్హులు కారు. అదేవిధంగా ఈ శాఖలో పోస్టులకు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థులు కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. 50 కేజీల బరువుతోపాటు ఛాతీ కనీసం 75 సెం.మీ. ఉండాలి. గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి.
- ఎంపిక: రాతపరీక్ష (పేపర్-1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, పేపర్-2 డిస్క్రిప్టివ్) ద్వారా.
- పేపర్-1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంజినీరింగ్ (సంబంధిత బ్రాంచీ)పై ప్రశ్నలు ఇస్తారు.
- పేపర్-1లో మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు. కాలవ్యవధి రెండు గంటలు.
- పేపర్-2లో సంబంధిత ఇంజినీరింగ్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఇస్తారు.
- పేపర్-1లో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. ప్రతి తప్పు జవాబుకు 0.50 మార్కుల కోతవిధిస్తారు.
- పేపర్-2 పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు. 300 మార్కులకు ఉంటుంది.
- రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
- పేపర్-1లో వచ్చిన మార్కులను నార్మలైజ్డ్ పద్ధతిలో లెక్కిస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- వెబ్‌సైట్: https://ssc.nic.in
నోట్: అర్హతలు, వయస్సు, పరీక్ష విధానం తుది నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా ఉంటాయి. ఇది అభ్యర్థుల అవగాహనకు మాత్రమే ఇస్తున్నాం. దరఖాస్తుదారులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వివరాలను చూడవచ్చు.

- కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

1323
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles