డ్రాగన్‌ను దాటేస్తున్నాం!


Mon,August 12, 2019 01:31 AM

-ప్రస్తుతం చైనా దేశ జనాభా 138.6 కోట్లు
-భారతదేశ జనాభా 125 .6 కోట్లు

మన అఖండ భారతావని మానవవనరుల సిరుల గని. ఏ దేశ అభివృద్ధికైనా మానవ వనరులు అత్యంత కీలకం. కానీ అదే మానవ వనరులు అభిలషణీయ స్థాయిని దాటిపోతే? దేశ నిర్మాణానికి తోడ్పడే ఆ మానవ వనరులే వెనుకబాటుతనానికి కారణమయ్యే ప్రమాదం ఉంది. గత నెలలో ప్రపంచ జనాభా దినోత్సవం నాడు ఐక్యరాజ్యసమితి ప్రచురించిన 26 వ వరల్డ్‌ పాపులేషన్‌ ప్రాస్పెక్టస్‌ 2019 ప్రమాద ఘంటికలు మోగించింది. మనం దేశం జనాభా విస్పోటనం దిశగా అడుగులు వేస్తుందని నివేదించింది. ఈ నివేదిక ఆధారంగా 2027 నాటికి భారతదేశ జనాభా చైనా దేశ జనాభాని అధిగమిస్తుందని వెల్లడయ్యింది.
Dragon

నివేదిక లోని ముఖ్యాంశాలు


-వరల్డ్‌ పాపులేషన్‌ ప్రాస్పెక్టస్‌ నివేదిక 2019 ఆధారంగా భారతదేశంలో 2050 నాటికి 273 మిలియన్ల జనాభా పెరుగుతుంది. అది ప్రపంచంలో అత్యంత జాతీయ జనాభా పెరుగుదల అవుతుంది.
-మరోవైపు చైనా జనాభా 1.43 బిలియన్ల నుంచి 1.4 బిలియన్లకు పడిపోతుంది.
-మధ్య ఆసియా, దక్షిణాసియాలో భారతదేశ జనాభా 2050 నాటికి సంపూర్ణ పెరుగుదల 25 శాతం ఉండొచ్చు కాని వృద్ధి రేటు మందగిస్తుంది. ఇది ప్రమాదకరమైన అంశం.

మనమేకాదు...ఆఫ్రికాలోనూ అంతే !


-ఇక ఆఫ్రికా విషయానికొస్తే ఉప సహారా ప్రాంతాల్లో జనాభా పెరుగుదల రేటు అత్యధికంగా ఉంటుందని, ఇక్కడ శిశు జనన మరణాల రేటు 4.6 అని పేర్కొంది. అంతేకాకుండా రాబోయే మూడు దశాబ్దాల్లో నైజీరియా కొత్తగా 200 మిలియన్ల జనాభాకు నివాసయోగ్య ప్రాంతంగా మారుతుందని పేర్కొంది. ఇదే జరిగితే నైజీరియా దేశం అమెరికాను దాటి మూడో అధిక జనాభాగల దేశంగా అవతరించబోతున్నదని పేర్కొంది.
ఏం జరుగబోతుంది.
-మెరుగైన ముందస్తు చర్యలు చేపట్టకపోతే జనాభా పెరుగుదల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆర్థిక పనితీరు గల జనాభా వృద్ధాప్యంలో కి వెళ్లడం, తక్కువ విలువగల వ్యాపారం వలన అనేక దేశాలు ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొవలసి వస్తుందని తెలుస్తుంది. ప్రభుత్వాలు వాటిని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య పరిరక్షణ, బీమా సౌకర్యం, సామాజిక రక్షణ వ్యవస్థలని నిర్మించవలసి ఉంటుంది. అంతర్జాతీయ జనాభా నివేదిక ప్రకారం వచ్చే దశాబ్దపు కాలంలో భారతదేశంలో 164 కోట్లు, చైనాలో 140 కోట్లు నివాసం ఏర్పరచుకుంటారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అంతేకాకుండా 2047 నాటికి జనాబా డివిడెండ్‌ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని తెలిపింది.

ఇప్పుడేం చేయాలి..


-జన విస్పొటనాన్ని ముందే గుర్తించారు కాబట్టి నియంత్రణ వైపు బలమైన అడుగులు పడాలి. జనన రేటును, వలసల రేటును సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఒకప్పుడు చైనా కూడా ఈ సమస్య ఎదుర్కొంది. ఒక కుటుంబం ఒక బిడ్డ నినాదంతో ముందుకు వెళ్లింది.

ఎలాంటి విధానాలు కావాలి?


-మెదటగా జనాభా నియత్రణ విధానాలను కఠినంగా అవలంభించాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు మన దేశం చైనా ప్రభుత్వం తరహాలో కఠిన విధానాలు అవలంభించలేదు. సులభతర జనాభా నియంత్రణ విధానాలను అవలంభించిది. ఉదాహరణకు ‘ఒక కుటుంబం ఒక బిడ్డ’ బదులు, ‘ఒక కుటుంబం ఒకరు లేదా ఇద్దరు పిల్లలు’ నినాదాన్ని ఇచ్చింది. ఇక నుంచి ఈ తీరు మారాలి.
-మొదటి రెండు జననాలకు మాత్రమే ప్రసూతి సెలవు, ఇతర ప్రసూతి ప్రయోజనాలకు పరిమితం చేయాలి.
-కొన్ని రాష్ర్టాల్లో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారి కుటుంబాలను పంచాయతీ ఎన్నికలలో అనర్హులుగా ప్రకటిస్తున్నారు. ఇలాంటి విధానాలు మరిన్ని తీసుకురావాలి.
-మరోవైపు పిల్లల విద్య, వారికి భవిష్యత్‌ అవకాశాల కోసం పెట్టే పెట్టుబడులు కూడా జన నియంత్రణ వైపు అడుగులేస్తాయన్నది నిపుణుల అభిప్రాయం.
-ముఖ్యంగా ప్రజల ఆలోచనా ధృక్పథ్ఫంలో మార్పు రావాలి. ప్రభుత్వ నిర్ణయాల్లో తమవంతు చేయూతనివ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలలో చైతన్యం కల్పించాలి. (2011 లెక్కల ప్రకారం గ్రామీణ ప్రాంత జనాభా ఇంచుమించు 70 శాతం)
-జనాభా నియంత్రణ విధానాలను పాటిస్తూనే ప్రస్తుత జనాభాకు అనుగుణంగా అవస్థాపన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఉపాధి అవకాశాలు సృష్టించాలి. అప్పుడే దేశం వృద్ధివైపు సాగుతుంది. లేకపోతే మందగమనమనే ప్రమాదం ముంచెత్తుతుంది.
BalaLatha

525
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles