మమ్మాలజీ వేటి అధ్యయనం?


Wed,August 7, 2019 01:57 AM

Animals
గత వారం తరువాయి

బల్లి పక్షి


- దీని శాస్త్రీయ నామం ఆర్కియోపెర్టిక్స్ లిథోగ్రాఫికా.
- ఇది జురాసిక్ కాలంలో విలుప్తమైన పక్షి.
- దీనిలో సరీసృపాలు, పక్షుల లక్షణాలు ఉంటాయి. అందువల్ల దీన్ని సరీసృపాలకు, పక్షులకు మధ్య సంధాన సేతువు అంటారు.
- వర్షపు నీటిని మాత్రమే తాగే పక్షి- చేతక్
- సూర్యునికోసం ఎగిరే పక్షి- చకోర పక్షి (ఫీనిక్స్)

కోళ్ల పెంపకం

- గుడ్లు, మాంసం లేదా రెండింటి ఉత్పత్తి కోసం పెంపుడు రకపు కోళ్లు, నెమళ్లు, బాతులు, టర్కీ కోళ్లు, అడవి బాతులు (Geese), పావురాలు, ఈము పక్షుల పెంపకాన్ని పౌల్ట్రీ అంటారు.
- భారతదేశ నవీన పౌల్ట్రీ పితామహుడు- డా. బీవీ రావు
- ఈయన జాతీయ గుడ్ల సహకార సమాఖ్య (ఎన్‌ఈసీసీ) వ్యవస్థాపక అధ్యక్షుడు.
- ఇది దేశంలో గుడ్ల విక్రయాన్ని, వాటి ఎగుమతులను పర్యవేక్షిస్తుంది.
- గుడ్ల ఉత్పత్తి కోసం పెంచే పక్షులను లేయర్లు అని, మాంసం కోసం పెంచే పక్షులను బ్రాయిలర్లు అంటారు.
- ప్రపంచ గుడ్ల ఉత్పత్తిలో భారత్ మూడో స్థానంలో, కోడి మాంసం ఉత్పత్తిలో ఐదో స్థానంలో ఉంది.
- సంకరజాతి లేయర్లను ఉత్పత్తి చేయడానికి ముంబై, భువనేశ్వర్, హస్సర్‌గట్టలో కేంద్ర కోళ్ల ప్రజనన క్షేత్రాలు ఉన్నాయి.
- గుజరాత్‌లోని ఇజాత్‌నగర్‌లో ఉన్న భారత పశువైద్య పరిశోధన సంస్థ (ఐవీఆర్‌ఐ) మేలు రకపు బ్రాయిలర్ కోళ్లను, కోళ్ల వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేస్తున్నది.
- లేయర్‌లకు బ్రూడర్ లేదా చిక్‌మాష్, గ్రోయర్ మాష్, ప్రీలేయర్ మాష్, లేయర్ మాష్‌లను ఆహారంగా ఇవ్వాలి.
- బ్రాయిలర్‌లకు ప్రీస్టార్టర్ మాష్, స్టార్టర్ మాష్, ఫినిష్ మాష్‌లను ఆహారంగా ఇవ్వాలి.
- కోళ్లకు వచ్చే వైరస్ వ్యాధులు- రాణిఖేట్, మారెక్, గంబోర, బర్డ్ ఫ్లూ
- కోళ్లకు వచ్చే బ్యాక్టీరియా వ్యాధులు- కోళ్ల కలరా, ఇన్‌ఫెక్టియస్ కొరైజా, క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ (సీఆర్‌డీ)
- శిలీంధ్ర వ్యాధులు- బ్రూడర్స్ న్యుమోనియా, ఎప్లోటాక్సికోసిస్, త్రష్

గమనిక: కోళ్లకు బర్డ్‌ఫ్లూ లేదా ఏవియన్ ఫ్లూ వ్యాధి HsN అనే వైరస్ ద్వారా వస్తుంది.
- కోడి పిల్లలను చిక్స్ అంటారు.
- కోడి పిల్లలను ఉత్పత్తి చేసే యంత్రం- భ్రూయరీ
- కోళ్ల ముక్కును 1/3వ వంతు కత్తిరించడాన్ని డిబీకింగ్ అంటారు.
- కోళ్ల తలపై ఉన్న మాంసయుత నిర్మాణాన్ని కత్తిరించడాన్ని డబ్బింగ్ అంటారు.
- కోళ్లు గుడ్లను పొదగడాన్ని బ్రూడినెస్ అంటారు. ఈ సమయంలో కోళ్లు గుడ్లు పెట్టవు.
- అంతర్జాతీయ గుడ్ల దినోత్సవం- అక్టోబర్ 10
- బ్రాయిలర్ కోళ్లు ఏడాదికి దాదాపు 280 గుడ్లు, నాటుకోళ్లు సుమారు 50-60 గుడ్లు పెడతాయి.
- గుడ్డు ఒక సంపూర్ణ ఆహారం.
- గుడ్డు పెంకులో CaCo3 ఉంటుంది.
- గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్, తెల్ల సొనలో అల్బుమిన్ అనే ప్రొటీన్ ఉంటాయి, C-విటమిన్, పిండిపదార్ధాలు ఉండవు.
- గుడ్డులో Ca, P అనే మూలకాలు ఉంటాయి.
- గుడ్లు పొదగడానికి 21 రోజులు పడుతుంది. దీనికోసం 37-37.50C ఉష్ణోగ్రత అవసరం.
- గుడ్లకు సంబంధించిన విప్లవం- వెండి విప్లవం (సిల్వర్‌రెవల్యూషన్)

క్షీరదాలు

- క్షీరదాలకు సంబంధించిన అధ్యయనాన్ని మమ్మాలజి అంటారు.
- క్షీర గ్రంథులు కలిగి, పిల్ల జీవులకు పాలిచ్చి పెంచే జంతువులను క్షీరదాలు (Mammalia) అంటారు.
- ట్రయాసిక్ కాలంలో క్షీరదాలు ఉద్భవించాయి.
- ఆధునిక జీవమహాయుగాన్ని (సీనోజోయిక్ మహాయుగం) క్షీరదాల స్వర్ణయుగం అంటారు.
- అతి చిన్న క్షీరదం- కెట్టిస్ హాగ్‌నోస్డ్ బ్యాట్ లేదా బంబుల్ బీ బ్యాట్ (రెండు గ్రాముల బరువు ఉంటుంది)
- అతి పెద్ద క్షీరదం- బెలనాప్టెరా మస్కులస్ (నీలి తిమింగలం)
- వీటి దేహ ఉష్ణోగ్రత- 98.40F లేదా 370C (36.9 C)
- క్షీరదాలు ధృవప్రాంతాలు, ఎడారులు, పర్వతాలు, అడవులు, గడ్డి మైదానాలు, చీకటి గుహలు మొదలైన వివిధ ఆవాసాల్లో నివసిస్తాయి.
- కొన్ని క్షీరదాలు ఎగిరే అనుకూలనాలను, మరికొన్ని నీటిలో నివసించే విధంగా అనుకూలనం చెంది ఉంటాయి.
- ఇవి రెండు జతల అంగాలను (Limbs) కలిగి ఉండి నడవడానికి, పరుగెత్తడానికి, చెట్ల కొమ్మలను పట్టుకోవడానికి, బొరియలు చేయడానికి, ఈదడానికి, ఎగరడానికి తోడ్పడుతాయి.
- వీటి చర్మంపై వెంట్రుకలు ఉంటాయి.

గమనిక: రోమాలు/వెంట్రుకలను గురించిన అధ్యయనాన్ని ట్రైకాలజి అంటారు.
- వీటిలో బాహ్య చెవి ఉంటుంది, దవడలో వివిధ రకాల దంతాలు ఉంటాయి.
- నాలుగు గదుల హృదయం ఉంటుంది.
- ఇవి ఉష్ణరక్త లేదా స్థిరోష్ణ జంతువులు (Homoiothermous)
- శ్వాసక్రియ ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది.
- వీటిలో విసర్జక పదార్థం- యూరియా
- ఇవి ఏకలింగ జీవులు, శిశోత్పాదకాలు (Viviparous). (కొన్ని మాత్రం అండోత్పాదకాలు)
- వీటిలో అంతర ఫలదీకరణం, ప్రత్యక్ష పిండాభివృద్ధి జరుగుతుంది.
- వీటి చర్మం గ్రంథియుతంగా ఉంటుంది.
- సెబేషియస్ గ్రంథి: ఇది సెబం అనే తైలాన్ని విడుదల చేస్తుంది. ఇది రోమాలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
- లాక్రిమల్ గ్రంథులు: ఇది కన్నీటిని స్రవిస్తుంది. (కన్నీటిలో లైసోజైమ్ ఎంజైమ్, సోడియం క్లోరైడ్ ఉంటాయి)
- సెరుమినస్ గ్రంథులు: ఇవి చెవిలో మైనంను స్రవిస్తాయి.

గమనిక: క్షీరదాల్లో క్షీర గ్రంథులు అనేవి స్వేద గ్రంథుల రూపాంతరం.
- క్షీరదాలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి...
1. ్రప్రొటోథీరియా (మోన్‌ట్రిమ్‌లు)
2. మెటాథీరియా (మార్సుపియేల్‌లు)
3. యూథీరియా (నిజ జరాయుదారులు)

ప్రొటోథీరియా

- ఇవి గుడ్లు పెట్టే క్షీరదాలు. అయినప్పటికీ పిల్లలకు పాలిస్తాయి.
ఉదా: డక్‌బిల్ ప్లాటిపస్ (ఆర్నిథోరింకస్), ఎకిడ్నా (స్పైనీ యాంట్ ఈటర్), అనాటినస్
- డక్‌బిల్ ప్లాటిపస్ (ఆర్నిథోరింకస్): ఇది గుడ్లను పెడుతుంది. సరీసృపాలకు, క్షీరదాలకు మధ్య సంధాన సేతువు.
- అనాటినస్: ఇది విషపూరితమైన ప్రో థీరియా క్షీరదం.
- ఎకిడ్నా (స్పైనీ యాంట్ ఈటర్): ఇది చీమలను ఆహారంగా తీసుకుంటుంది. ఇవి స్త్రీ, పురుష జీవులు రెండూ పిల్ల జీవులకు పాలిచ్చి పెంచుతాయి. దీన్నే గైనకోమాస్టిజం అంటారు.

మెటాథీరియా

- ఇవి పూర్తిగా అభివృద్ధి చెందని పిల్లలకు జన్మనిస్తాయి. వీటిలో స్త్రీజీవి ఉదర భాగంలో శిశుకోశం (మార్సుపియం) ఉంటుంది. అపరిపక్వ పిండాలు లేదా పిల్ల జీవులకు పాలిస్తూ పెంచుతాయి. దీన్నే మమరీ ఫీటస్ అంటారు.
ఉదా: కంగారు (మాక్రోపస్), అపోజం, టాస్మానియన్ తోడేలు, టాస్మానియన్ పులి, బండికూట్ కంగారు
- ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనబడుతాయి. దీనివల్ల ఆ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ మార్సుపియేల్స్ (Marsupiales) లేదా కంగారూస్ అంటారు.
- ఇవి అధికంగా లాంగ్ జంప్ చేస్తాయి.
- అపరిపక్వ శిశువులను కని దాన్ని పొట్ట కింద ఉండే అధిజఘనాస్థి రూపాంతరమైన శిశుకోశం (Marsupiam)లో రక్షిస్తుంది.
- అపోజం: ఇది అతి తక్కువ గర్భావది కాలం, అతి ఎక్కువ దంతాలు కలిగిన జంతువు. ఇది దక్షిణ అమెరికాలో నివసిస్తుంది.

యూథీరియం (నిజ జరాయు దారులు)

- ఇవి అభివృద్ధి చెందిన క్షీరదాలు.
- వీటిని సాధారణంగా జరాయు క్షీరదాలు అంటారు.
- జలచర క్షీరదాలు: వీటిని గురించిన అధ్యయనాన్ని సీటాలజి అంటారు.
ఉదా: సీల్, వాల్స్,్ర హిప్పొపోటమస్, బీవర్, డాల్ఫిన్, తిమింగలం

- తిమింగలం (బెలనాప్టెరా మస్కులఫ్): ఇది జంతు సామ్రాజ్యంలో అతిపెద్దది. వీటి వేటను వేలింగ్ అంటారు. దీని పూర్వాంగాలు తెడ్డులా (ప్లిప్పర్) మార్పు చెందిఉంటాయి.
- డాల్ఫిన్: ఇది మానవుని తర్వాత అత్యంత తెలివైన జంతువు. దీన్ని జాతీయ జలచర జంతువుగా ప్రకటించారు.
- హిప్పోపొటమస్: దీన్ని రివర్ హార్స్ (నీటి గుర్రం) అంటారు.

గమనిక: హిప్పోకాంపస్ (సముద్ర గుర్రం) అనేది చేప.
- బీవర్: ఇది సముద్రంలో ఆనకట్టలు కడుతుంది.
- సీల్, వాల్స్:్ర ఇవి ఆర్కిటిక్ ప్రాంతం (ఉత్తర ధృవం)లో నివసిస్తాయి. వీటిలో రధనికలు రూపాంతరం చెంది పొడవుగా ఉంటాయి.
గమనిక: జలచర క్షీరదాల చర్మం కింద కొవ్వు పొర ఉంటుంది. దీన్ని బ్లబ్బర్ అంటారు. ఇది దేహ ఉష్ణోగ్రతను క్రమపరుస్తుంది.


భూచర క్షీరదాలు

ఉదా: ఏనుగు (లాక్సోడాంట), జిరాఫి, కొడాయిక్ ఎలుగుబంటి, ఒంటె, ఖడ్గమృగం (రైనోసారస్), చిరుత, గబ్బిలం, జాగ్వార్, గుర్రం, మ్యూల్, హెన్ని, ఎద్దు, ఆవు, బర్రె, మేక, గొర్రె, తోడేలు, కుక్క, పిల్లి, పంది, గొరిల్లా, గిబ్బన్, చింపాంజి, పాండా.
ఏనుగు
- ఇది అతిపెద్ద భూచర క్షీరదం.
- ఇందులో రెండు జతల కుంతకాలు (దంతాలు) టస్క్స్‌గా రూపాంతరం చెంది ఉంటాయి.
- ఇది చెవులను కదిలించడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను క్రమపర్చుకుంటుంది.
- దీన్ని జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించారు.

ఒంటె

- ఇది నీటిని కొవ్వు రూపంలో మూపురంలో దాచుకుంటుంది.
- దీని చెమట గ్రంధులు క్రియారహితంగా ఉంటాయి.
- ఒంటెలు రెండు రకాలు. అవి..
- కామెలస్ డ్రోమేరస్: ఇది ఒకే మూపురాన్ని కలిగి ఉండి పొడవైన మెడతో ఉంటుంది.
- కామెలస్ బాట్రియానస్: ఇది రెండు మూపురాలను కలిగి ఉంటుంది. మందమైన చర్మం ఉంటుంది.
- ఇది ఒకసారి నీటిని తాగితే 12-15 రోజులవరకు ఉండగలుగుతుంది.
- క్షీరదాల ఎర్రరక్త కణాల్లో కేంద్రకం ఉండదు. కానీ ఒంటె, లామాల్లో కేంద్రకం ఉంటుంది.

జిరాఫీ

- ఇది ఎత్తయిన క్షీరదం.
- ఇందులో పొడవైన నాడీకణం ఉంటుంది.

పునుగు పిల్లి

- ఇది సర్వభక్షక (Omnivore) జీవి.
- ఆగ్నేయాసియాలో ఎక్కువగా ఉంటుంది.
- దీన్నుంచి తయారు చేసిన నూనెను తిరుమల తిరుపతి దేవస్థానం అభిషేకంలో ఉపయోగిస్తారు.

కొడాయిక్ ఎలుగుబంటి

- ఇది భూమిపై ఉన్న అతిపెద్ద మాంసాహార క్షీరదం లేదా జంతువు.

ఖడ్గమృగం

- దీని ముక్కుపై ఉన్న వెంట్రుక కొమ్ముగా రూపాంతరం చెందింది.
- ఇది భూమిపై వేగంగా పరిగెత్తే రెండో క్షీరదం.
- ఖడ్గమృగాల సంరక్షణ కేంద్రం- కజిరంగా నేషనల్ పార్క్ (అసోం)

Animals1

290
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles