భవిష్యత్తు ఓపెన్


Mon,August 5, 2019 01:11 AM

ఆర్థిక పరిస్థితుల వల్ల ఉన్నత చదువులు చదువలేనివారికి, కాలేజీలు అందుబాటులో లేనివారికి, ఉద్యోగాల్లో ప్రమోషన్ కావాలనుకునేవారికి దూరవిద్యా విధానం చాలా మేలు చేస్తుంది. వేలకు వేలు ఫీజులు కట్టలేనివారికి కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వల్ల లాభం చేకూరుతుంది. దూరవిద్య చదివితే పెద్దగా ఒరిగేదేమీ ఉండదని చాలామంది అనుకుంటారు. కానీ దూరవిద్య చదివి ఉన్నతోద్యోగాలు చేస్తున్నవారు చాలామందే ఉన్నారు. ఈ ఓపెన్ యూనివర్సిటీల్లో చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఓపెన్ యూనివర్సిటీలు, కోర్సులు, నోటిఫికేషన్ల వివరాలు నిపుణ పాఠకుల కోసం అందిస్తున్నాం..
open-university

దూరవిద్య అంటే?

-విద్యార్థులు, గృహిణులు.. ఇలా చదవుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ఇంటివద్ద ఉంటూ విద్య నేర్చుకోవడమే దూరవిద్య. చదువు మధ్యలో ఆపేసినవారికి, ఉద్యోగాలు చేస్తూ పైచదువులపై ఆసక్తి ఉన్నవారికి, తక్కువ ఖర్చుతో చదువుకోవాలనుకునేవారికి ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇందుకు ప్రత్యేకంగా స్టడీ సెంటర్లు ఉండటంతోపాటు, పుస్తకాలు తయారుచేస్తారు. ఒకప్పుడు దూర విద్య అంటే చులకన భావం ఉండేది. కానీ నేడు భవిష్యత్తు అంతా డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌దే అనేంతగా దూరవిద్య ఎదిగింది.
-1728లో బోస్టన్‌లో దూరవిద్య విధానం ప్రారంభమైంది. 1840లో తపాలా ద్వారా ఆధునిక దూరవిద్య గ్రేట్ బ్రిటన్‌లో ఆచరణలోకి వచ్చింది. 19వ శతాబ్దంలో తపాలా సేవలో జరిగిన అభివృద్ధివల్ల వాణిజ్యపరమైన దూరవిద్యా కాలేజీలు ప్రారంభమయ్యాయి. ప్రపంచంలో మొదటిసారిగా లండన్ యూనివర్సిటీ దూరవిద్యలో డిగ్రీలు అందించింది.
-మనదేశంలో దూరవిద్యా విధానం 1962లో ప్రారంభమైం ది. ఢిల్లీ యూనివర్సిటీ తొలిసారిగా ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)ని ప్రారంభించింది. ఇది జాతీయ స్థాయిలో దూర విద్యా కోర్సులను అందిస్తున్న ఏకైక యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా రాష్ర్టాల్లో ఓపెన్ యూనివర్సిటీలే కాకుండా రెగ్యులర్ యూనివర్సిటీలు కూడా దూర విద్యా విధానంలో డిగ్రీలు, డిప్లొమా తదితర ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి.
-ప్రభుత్వాలు ఉన్నత విద్యను విస్తృతం చేయాలనుకుంటే గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో (జీఎస్‌ఆర్)ను పెంచాలి. 2025 వరకు ఈ రేషియోను 30 శాతానికి పెంచడం లక్ష్యంగా ప్రభుత్వాలు పెట్టుకున్నాయి. ఇందులో ఓపెన్ యూనివర్సిటీలే ముఖ్యపాత్ర పోషించబోతున్నాయి.

గుర్తింపు ఉండాలి

-దేశంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అందించే కోర్సులకు న్యూఢిల్లీలోని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (డీఈసీ) గుర్తింపు తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా కోర్సులు నిర్వహిస్తున్న యూనివర్సిటీలు యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) అనుమతి పొందాలి. యూజీసీ గుర్తింపు ఉండి డీఈసీ అనుమతి లేకపోతే ఆ సంస్థలు అందించే దూరవిద్యా కోర్సుల సర్టిఫికెట్లకు గుర్తింపు ఉండదు. దీంతో ఈ సర్టిఫికెట్లను ఉన్నత చదవులు, ఉద్యోగ నియామకాల్లో పరిగణనలోకి తీసుకోరు. కాబట్టి ఏదైనా యూనివర్సిటీలో చేరేముందు దీనికి సంబంధించిన వివరాలను యూజీసీ వెబ్‌సైట్‌లో యూనివర్సిటీ గుర్తింపు జాబితాను పరిశీలించాలి.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం

-విద్యారంగంతోపాటు అన్ని రంగాల్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) వినియోగం పెరిగిపోయింది. ఓపెన్ యూనివర్సిటీల్లో కూడా విద్యాబోధన పద్ధతుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఐఐటీలు, ఐబీఎంలు కూడా ఏదో ఒక స్థాయిలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌ను అనుసరిస్తున్నాయి.
-అధిక శాతం యూనివర్సిటీలు డిస్టెన్స్ విద్యార్థులకు ఈ-లెర్నింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. కోర్సు రిజిస్ట్రేషన్ నంబర్, అడ్మిషన్ నంబర్ ఆధారంగా సదరు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకుంటే ఈ-లెర్నింగ్ మెటీరియల్ లభిస్తుంది.

కాకతీయ యూనివర్సిటీ

-వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ యూజీ, పీజీ కోర్సులను అందిస్తుంది.
-యూజీ కోర్సులు: బీఏ, బీకాం, బీకాం (కంప్యూటర్స్), బీజే, బీఎల్‌ఐఎస్సీ, బీఎస్సీ మ్యాథ్స్/స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, బీబీఏ.
-పీజీ కోర్సులు: ఎంఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, హిందీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సంస్కృతం, ఇంగ్లిష్, రూరల్ డెవలప్‌మెంట్, తెలుగు, సోషియాలజీ, జర్నలిజం, హెచ్‌ఆర్‌ఎం), ఎంకాం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంజే, ఎంటీఎం, ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఎమ్మెస్సీ సైకాలజీ, ఎమ్మెస్సీ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్.
-డిగ్రీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైనవారు అర్హులు. ఇంటర్ లేనివారు యూనివర్సిటీ నిర్వహించే అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. పీజీ కోర్సులకు సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణులైనవారు అర్హులు.
-ఇతర వివరాలు www.sdlceku.co.inలో చూడవచ్చు.

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ

-హైదరాబాద్‌లో ఉన్న ఈ యూనిర్సిటీ దూరవిద్యా విధానంలో డిగ్రీ, డిప్లొమా తదితర కోర్సులను అందిస్తుంది.
-డిగ్రీ కోర్సులు: బీఏ, బీకాం, బీఎస్సీ
-డిప్లొమా కోర్సులు: ప్రైమరీ ఎడ్యుకేషన్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్
-ఇంటర్ ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సులు చేయవచ్చు.
-వివరాలకు www.manuu.ac.inలో సంప్రదించవచ్చు.

ఆంధ్రా యూనివర్సిటీ

-ఆంధ్రప్రదేశ్ వైజాగ్‌లోని ఆంధ్రా యూనివర్సిటీ దూర విద్యావిధానంలో పలు కోర్సులను అందిస్తుంది.
-డిగ్రీ కోర్సులు: బీఏ, బీకాం
-కంప్యూటర్ సర్టిఫికెట్ కోర్సులు: ఆఫీస్ ఆటోమేషన్ అండ్ అకౌంటింగ్, ఆఫీస్ ఆటోమేషన్ అండ్ మల్టీమీడిమా టెక్నాలజీస్, ఆఫీస్ ఆటోమేషన్ అండ్ ఇంటర్నెట్ టెక్నాలజీస్
-ఇతర వివరాలకు www.andhrauniversisy.edu.inలో సంప్రదించవచ్చు.

ఇగ్నో

-ఇది జాతీయ స్థాయి ఓపెన్ యూనివర్సిటీ. దీన్ని 1985లో స్థాపించారు.
-డిగ్రీ కోర్సులు: బీఏ (ఆంత్రోపాలజీ, ఎకనామిక్స్, హిస్టరీ, సైకాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, మ్యాథమెటిక్స్, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్, సంస్కృతం), బీఎస్సీ, బీకాం, బీసీఏ, బీఎస్‌డబ్ల్యూ, బీఎల్‌ఐఎస్సీ, బీబీఏ.
-డిప్లొమా ప్రోగ్రామ్‌లు: పీజీ డిప్లొమా ఇన్ లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్‌వర్కింగ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, గాంధీ అండ్ పీస్ స్టడీస్, రూరల్ డెవలప్‌మెంట్, కౌన్సెలింగ్ అండ్ ఫ్యామిలీ థెరపీ, ట్రాన్స్‌లేషన్, ఇంటర్నేషనల్ బిజినెస్ ఆపరేషన్స్, ఎన్విరాన్‌మెంట్ అండ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్, అనలిటికల్ కెమిస్ట్రీ, ఐప్లెడ్ స్టాటిస్టిక్స్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఆడియో ప్రోగ్రామ్ ప్రొడక్షన్, హయ్యర్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, స్కూల్ లీడర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్, ఎడ్యుకేషనల్ మేనేజ్‌మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్, ఫార్మాస్యూటికల్ సేల్స్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, క్రిమినల్ జస్టిస్, అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్, ఫోక్‌లోర్ అండ్ కల్చర్ స్టడీస్, హాస్పిటల్ అండ్ హెల్త్ మేనేజ్‌మెంట్, జెరియాట్రిక్ మెడిసిన్, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్, హెచ్‌ఐవీ మెడికల్ ప్రోగ్రామ్, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ మేనేజ్‌మెంట్, ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్, బుక్ పబ్లిషింగ్, ఉమెన్స్ అండ్ జెండర్ స్టడీస్, సస్టెయినబుల్ సైన్స్, సోషల్ వర్క్ కౌన్సెలింగ్, మెంటల్ హెల్త్, డెవలప్‌మెంట్ స్టడీస్, ఎన్విరాన్‌మెంటల్ అండ్ ఆక్యుపేషనల్ హెల్త్.
-డిప్లొమా కోర్సులు: డిప్లొమా ఇన్.. ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, పంచాయత్ లెవల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్‌మెంట్, టూరిజం స్టడీస్, ఆక్వాకల్చర్, క్రియేటివ్ రైటింగ్ ఇన్ ఇంగ్లిష్, బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్-ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఉమెన్స్ ఎంపవర్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్, పారాలీగల్ ప్రాక్టీస్, క్రిటికల్ కేర్ నర్సింగ్, వ్యాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, డెయిరీ టెక్నాలజీ, మీట్ టెక్నాలజీ, ప్రొడక్షన్ ఆఫ్ వ్యాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ సెరీల్స్-పల్సెస్ అండ్ ఆయిల్‌సీడ్స్ తదితర కోర్సులు ఉన్నాయి.
-పీజీ కోర్సులు: ఎంఏ (ఇంగ్లిష్, ఫిలాసఫీ, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, గాంధీ అండ్ పీస్ స్టడీస్, సైకాలజీ, ఆంత్రోపాలజీ, డెవలప్‌మెంట్ స్టడీస్, అడల్ట్ ఎడ్యుకేషన్, జెండర్ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్), ఎంసీఏ, ఎమ్మెస్సీ (మ్యాథమెటిక్స్, ఫుడ్ న్యూట్రిష్, కౌన్సెలింగ్ అండ్ ఫ్యామిలీ థెరపీ), ఎంఏ (రూరల్ డెవలప్‌మెంట్), మాస్టర్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఎల్‌ఐఎస్, ఎంకాం తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
-డిగ్రీ కోర్సులకు ఇంటర్, డిప్లొమా కోర్సులకు డిగ్రీ, డిప్లొమా కోర్సులకు ఇంటర్ ఉత్తీర్ణులైనవారు అర్హులు. పై కోర్సుల్లో కొన్నింటికి సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
-వివరాలకు వెబ్‌సైట్ ignou.ac.inలో సంప్రదించవచ్చు.

open-university2

రాష్ర్టాలవారీగా ఓపెన్ యూనివర్సిటీలు

తెలంగాణ

-జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ (www.jnuh.ac.in)
-యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (www.uohyd.ac.in)
-నల్సార్ యూనివర్సిటీ, హైదరాబాద్ (www.nalsar.ac.in)
-యూనివర్సిటీ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ (ఇఫ్లూ), హైదరాబాద్
-పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్ (www.teluguuniversity.ac.in)
-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయత్‌రాజ్, హైదరాబాద్ (www.nirdpr.ac.in)
-ఇక్ఫాయ్, హైదరాబాద్ (www.ifheindia.org)

ఆంధ్రప్రదేశ్

-శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి (www.svuniversity.edu.in)
-శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి (www.spmvv.ac.in)
-ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు (www.nagarjunauniversity.ac.in)
-శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ, అనంతపురం (www.skuniversity.org)
-ద్రవిడియన్ యూనివర్సిటీ, కుప్పం (www.dravidianuniversity.ac.in)
-రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ, తిరుపతి (http://rsvidyapeetha.ac.in)

ఢిల్లీ

-ఢిల్లీ యూనివర్సిటీ (www.du.ac.in)
-ఇంద్రప్రస్థ యూనివర్సిటీ (www.ipu.ac.in)
-జామియా హమ్‌దర్ద్ (www.jamiahamdard.edu)
-జామియా మిలియా ఇస్లామియా (www.jmi.ac.in)
-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ (http://www.imd.org)

కర్ణాటక

-గుల్బర్గా యూనివర్సిటీ, గుల్బర్గా (www.gulbargauniversity.kar.nic.in)
-కన్నడ యూనివర్సిటీ, హంపీ (www.kannadauniversity.org)
-కర్ణాటక యూనివర్సిటీ, ధార్వాడ్ (www.kud.ac.in)
-కువెంపు యూనివర్సిటీ, షిమోగా (www.kuvempu.ac.in)
-మంగళూర్ యూనివర్సిటీ, మంగళూర్ (www.mangaloreuniversity.ac.in)
-నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, బెంగళూరు (www.nls.ac.in)
-విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ బెల్గామ్ (www.vtu.ac.in)
-బెంగళూరు యూనివర్సిటీ (www.bangloreuniversity.ac.in)
-కర్ణాటక స్టేట్ ఉమెన్స్ యూనివర్సిటీ, బీజాపూర్ (www.kswu.ac.in)
-తుముకూర్ యూనివర్సిటీ, తుముకూర్ (www.tumkuruniversity.ac.in)

తమిళనాడు

-అళగప్ప యూనివర్సిటీ, కరైకుడి (www.alagappauniversity.ac.in)
-అన్నామలై యూనివర్సిటీ, అన్నామలైనగర్ (www.annamalaiuniversity.ac.in)
-భారతియార్ యూనివర్సిటీ, కోయంబత్తూర్ (www.b-u.ac.in)
-భారతిదాసన్ యూనివర్సిటీ, తిరుచిరాపల్లి (www.bdu.ac.in)
-కర్పగమ్ యూనివర్సిటీ, కోయంబత్తూర్ (http://kahedu.edu.in)
-మదురై కామరాజ్ యూనివర్సిటీ, మదురై (www.mkuniversity.org)
-మనోన్‌మణియమ్ సుందరన్ యూనివర్సిటీ, తిరునల్వేలి (www.msuniv.ac.in)
-మీనాక్షి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (www.maher.ac.in)
-మదర్‌థెరిసా ఉమెన్స్ యూనివర్సిటీ, కొడైకెనాల్ (www.motherteresawomenuniv.ac.in)
-తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ, కోయంబత్తూర్ (www.tnau.ac.in)

మహారాష్ట్ర

-టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ముంబై (www.tiss.edu)
-భారతి విద్యాపీఠ్ యూనివర్సిటీ, పుణె (www.bharatividyapeeth.edu)
-ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్, ముంబై (www.iipsindia.org)
-మహాత్మాగాంధీ అంతరాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయ, వార్ధా (www.hindivishwa.org)
-నర్సిమోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్-హైదరాబాద్, బెంగళూరు, ముంబై (www.nmisms.edu)
-శివాజీ యూనివర్సిటీ, కొల్హాపూర్ (www.unishivaji.ac.in)
-యూనివర్సిటీ ఆఫ్ ముంబై (www.mu.ac.in)
-స్వామి రామానంద తీర్థ మరాఠ్వాడా యూనివర్సిటీ, నాందేడ్ (www.srtmun.in)
-యశ్వంత్‌రావు చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ, నాసిక్ (www.ycmou.digitaluniversity.ac)
-బాలాజీరావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మోడర్న్ మేనేజ్‌మెంట్, పుణె (www.bimmpune.com)
-వీటితోపాటు మిగతా రాష్ర్టాల్లో కూడా ఓపెన్ యూనివర్సిటీలు ఉన్నాయి.

దూర విద్యా యూనివర్సిటీలు - కోర్సులు

-ప్రొఫెసర్ జీ రాంరెడ్డి సెంటర్ ఫర్
-డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్‌ఆర్‌సీడీఈ)

-ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ జీ రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్‌ఆర్‌సీడీఈ) దూర విద్యా విధానంలో పలు యూజీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తుంది.
-గ్రాడ్యుయేట్ కోర్సులు: బీఏ, బీకాం జనరల్, బీబీఏ, బీఏ (మ్యాథ్స్ & స్టాటిస్టిక్స్)
-పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు: ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ (ఇంగ్లిష్, హిందీ, తెలుగు, సంస్కృతం, ఉర్దూ, ఫిలాసఫీ, సోషియాలజీ, పబ్లిక్ పర్సనల్ మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, సైకాలజీ), ఎంకామ్, ఎమ్మెస్సీ (మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్)
-ఎంసీఏ మూడేండ్లు, మిగతా కోర్సులన్నీ రెండేండ్లు.
-పీజీ డిప్లొమా కోర్సులు (ఏడాది): మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్, బయోఇన్ఫర్మాటిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్
-పీజీ కోర్సులకు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఇంటర్, పీజీ డిప్లొమా కోర్సులకు ఏదైనా డిగ్రీ/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైనవారు అర్హులు.
-ఎంబీఏ/ఎంసీఏ కోర్సులకు డిగ్రీతోపాటు టీఎస్/ఏపీ ఐసెట్ లేదా ఓయూసీడీఈ నిర్వహించే ఎలిజిబిలిటీ టెస్ట్‌లో పాస్ కావాలి.
నోట్: ఈ విద్యాసంవత్సరం నుంచి ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బీకాం కంప్యూటర్ అప్లికేషన్, పీజీ డిప్లొమా ఇన్ డాటా సైన్స్ కోర్సులు ప్రారంభం కానున్నాయి.
-పై కోర్సులన్నింటికి సెప్టెంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి.
-ఇతర వివరాలకు వెబ్‌సైట్ www.oucde.netలో సంప్రదించవచ్చు.

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ

-హైదరాబాద్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్‌ఏఓయూ) యూజీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తుంది.
-యూజీ ప్రోగ్రామ్స్: బీఏ, బీఎస్సీ, బీకాం, బీఎల్‌ఐఎస్సీ
-పీజీ ప్రోగ్రామ్స్: ఎంఏ (ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఇంగ్లిష్, తెలుగు, హిందీ, ఉర్దూ), ఎమ్మెస్సీ (మ్యాథమెటిక్స్, అప్లయిడ్ మ్యాథమెటిక్స్, సైకాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫిజిక్స్, జువాలజీ), ఎంబీఏ, ఎంకాం, ఎంఎల్‌ఐఎస్సీ
-పీజీ డిప్లొమా (ఏడాది): పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, బిజినెస్ ఫైనాన్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, రైటింగ్ ఫర్ మాస్ మీడియా ఇన్ తెలుగు, హ్యూమన్ రైట్స్, కల్చర్ అండ్ టూరిజం, ఉమెన్స్ స్టడీస్
-సర్టిఫికెట్ కోర్సులు (6 నెలలు): ఫుడ్ & న్యూట్రిషన్, లిటరసీ & కమ్యూనిటీ డెవలప్‌మెంట్, ఎన్‌జీఓస్ మేనేజ్‌మెంట్, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ & ఎడ్యుకేషన్
-యూజీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైనవారు లేదా 2015 నుంచి 2019 మధ్య ఓపెన్ వర్సిటీ అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా అర్హులు. మిగతా కోర్సులకు సంబంధిత విభాగంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులు.
-ఆగస్టు 16వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రూ.200 ఫైన్‌తో ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలి.
-ఇతర వివరాలకు వెబ్‌సైట్ www.braouonline.in లో సంప్రదించవచ్చు.

-సత్యం చాపల

620
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles