కోర్టు కొలువులు


Mon,August 5, 2019 01:09 AM

-సబార్డినేట్ కోర్టుల్లో పోస్టులు
-మొదటిసారి ఆన్‌లైన్‌లో పరీక్ష
-ఏడోతరగతి నుంచి డిగ్రీ చదివిన వారికి అవకాశం
-పర్మినెంట్ ఉద్యోగాలు, సొంత జిల్లాలో ఉద్యోగావకాశం
-మొత్తం 1539 ఖాళీలు
ఏడోతరగతి నుంచి డిగ్రీ చదివిన వారికి కొలువుల మేళా! పాత పది జిల్లాల్లోని సబార్డినేట్ కోర్టులతోపాటు మరికొన్ని కోర్టుల్లో పదిహేనువందలకు పైగా పోస్టులు. ఈసారి అన్ని జిల్లాలకు ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ నిర్వహించి, ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక చేయనున్నారు. ఆయా పోస్టుల వివరాలు, పరీక్ష విధానం, జిల్లాల వారీగా ఖాళీలు నిపుణ పాఠకుల కోసం...
court-jobs

గ్రేడ్-III స్టెనోగ్రాఫర్

-జిల్లాల వారీగా ఖాళీలు: ఆదిలాబాద్-5, ఖమ్మం-4, కరీంనగర్-10, మహబూబ్‌నగర్-7, మెదక్-3, నిజామాబాద్-4, నల్లగొండ-12, వరంగల్-5, మెట్రోపాలిటిన్ సెషన్స్ కోర్టు-1, సిటీ సివిల్‌కోర్టు -1, సిటీ స్మాల్ కాజెస్ కోర్టు -2 ఉన్నాయి.
-పేస్కేల్: రూ.22,460-66,330/-
-అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఇంగ్లిష్ టైప్‌రైటింగ్‌లో తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ బోర్డు నుంచి హయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్ (నిమిషానికి 45 పదాలు) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ (నిమిషానికి 120 పదాలు) ఉత్తీర్ణత. కంప్యూటర్ ఆపరేషన్స్‌పై పరిజ్ఞానం ఉండాలి.
నోట్: ఒకవేళ హయ్యర్ గ్రేడ్ అభ్యర్థులు లభించనిచో లోయర్ గ్రేడ్ సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు.
-వయస్సు: 2019, జూలై 1 నాటికి 18-34 ఏండ్ల మధ్య ఉండాలి.
-పరీక్ష విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఇస్తారు. 50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో 25 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్, 25 ప్రశ్నలు జనరల్ ఇంగ్లిష్ నుంచి ఇస్తారు. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్, తెలుగులో ఇస్తారు.
-స్కిల్‌టెస్ట్ ( స్టెనోగ్రఫీ)లో 30 మార్కులు, వైవా వాయిస్‌కు 20 మార్కులు.
-కనీస అనర్హత మార్కులు జనరల్-40, బీసీలకు 35, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 30 శాతం మార్కులు నిర్ణయించారు. అర్హత సాధించినవారిని ఇంటర్వ్యూకు 1:3 నిష్పత్తిలో ఎంపికచేస్తారు.

టైపిస్టు

-పేస్కేల్: రూ.16,400- 49,870/-
-జిల్లాల వారీగా ఖాళీలు: ఆదిలాబాద్-4, ఖమ్మం-15, కరీంనగర్-11, మహబూబ్‌నగర్-15, నిజామాబాద్-6, నల్లగొండ-25, రంగారెడ్డి-33, వరంగల్-11, మెట్రోపాలిటిన్ సెషన్స్ కోర్టు-17, సిటీ సివిల్‌కోర్టు, హైదరాబాద్-3, సిటీ స్మాల్ కాజెస్ కోర్టు-5, కోర్టు ఆఫ్ స్పెషల్ జడ్జ్ ఫర్ ఎకనామిక్స్

అఫెన్సెస్-1.

-అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. ఇంగ్లిష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణత లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-కంపూట్యర్ ఆపరేషన్స్‌పై పరిజ్ఞానం ఉండాలి.

ఎంపిక విధానం:

-ఆన్‌లైన్ బేస్డ్ టెస్ట్ ద్వారా చేస్తారు. ఇది ఇంటర్‌స్థాయిలో ఉంటుంది.
-పరీక్ష 50 మార్కులకు ఉంటుంది. దీనిలో ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. 25 మార్కులు జనరల్ నాలెడ్జ్, 25 మార్కులు ఇంగ్లిష్ నుంచి ఇస్తారు.
-ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.
-టైపింగ్ టెస్ట్‌ను 20 మార్కులకు నిర్వహిస్తారు. దీన్ని కంప్యూటర్‌పై నిర్వహిస్తారు.
-టైపింగ్ స్కిల్‌టెస్ట్‌లో ఓసీలకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 30 శాతం మార్కులన క్వాలిఫయింగ్ మార్కులుగా నిర్ణయించారు.
-ఆన్‌లైన్ టెస్ట్, స్కిల్‌టెస్ట్‌లో ఉత్తీర్ణులైన వారిని 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు.

ఫీల్డ్ అసిస్టెంట్

-పేస్కేల్: రూ.16,400-49,870/-
-జిల్లాల వారీగా ఖాళీలు: ఆదిలాబాద్-2, ఖమ్మం-11, కరీంనగర్-4, మహబూబ్‌నగర్-6, మెదక్-3, నిజామాబాద్-5, నల్లగొండ-11, రంగారెడ్డి-15, వరంగల్-11, మెట్రోపాలిటిన్ సెషన్స్ కోర్టు -2, సిటీ సివిల్‌కోర్టు-4, సిటీ స్మాల్ కాజెస్ కోర్టు-2 ఉన్నాయి.
-అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
నోట్: ఇంటర్ కంటే ఎక్కువ అదనపు అర్హతలు ఉంటే ఇంటర్వ్యూ సమయంలో వాటికి సంబంధించిన సర్టిఫికెట్లను దాఖలు చేయాలి.
ఎంపిక: ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా చేస్తారు.
-ఈ పరీక్ష 80 మార్కులు ఉంటుంది. ఇంటర్వ్యూ (వైవా వాయిస్)కి 20 మార్కులు కేటాయించారు.
-కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 80 ప్రశ్నలు ఇస్తారు. దీనిలో 40 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 ప్రశ్నలు ఇంగ్లిష్ నుంచి ఇస్తారు.
-పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగులో ఉంటుంది.

ఎగ్జామినర్

-పేస్కేల్: రూ.15,460-47,330/-
-జిల్లాల వారీగా ఖాళీలు: ఖమ్మం-10, కరీంనగర్-7, మహబూబ్‌నగర్-5, మెదక్-1, నిజామాబాద్-6, నల్లగొండ-11, రంగారెడ్డి-9, వరంగల్-1, మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు-2, సిటీ సివిల్ కోర్టు-1, సిటీ స్మాల్ కాజెస్ కోర్టు-3, కోర్టు ఆఫ్ స్పెషల్ జడ్జ్ ఫర్ ఎకానమీ అఫెన్సెస్-1 ఉన్నాయి.
-అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
నోట్: నిర్దేశిత అర్హత కంటే ఎక్కువ విద్య, సాంకేతిక అర్హతలు కలిగి ఉన్న వాటికి సంబంధించిన సర్టిఫికెట్లను ఇంటర్వ్యూ సమయంలో దాఖలు చేయాలి.
-ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్ట్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా
-కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌ను 80 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో 40 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 ప్రశ్నలు ఇంగ్లిష్ నుంచి ఇస్తారు.
-ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు.
-ఇంటర్యూ (వైవా వాయిస్) 20 మార్కులకు ఉంటుంది.
-ఆన్‌లైన్ ఎగ్జామ్‌లో కనీస అర్హత మార్కులు సాధించినవారిని పోస్టుల సంఖ్యను బట్టి 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

రికార్డు అసిస్టెంట్

-పేస్కేల్: రూ.15,030-46,060/-
-జిల్లాల వారీగా ఖాళీలు: ఆదిలాబాద్-3, మెదక్-2 ఉన్నాయి.
-అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌ను 80 మార్కులకు నిర్వహిస్తారు.
-దీనిలో 40 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్, 40 ప్రశ్నలు జనరల్ ఇంగ్లిష్ నుంచి ఇస్తారు.
-జనరల్ నాలెడ్జ్ ప్రశ్నపత్రాన్ని ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ఇస్తారు.
-ఆన్‌లైన్ పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించినవారిని పోస్టుల సంఖ్యను బట్టి 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

ప్రాసెస్ సర్వర్

-పేస్కేల్: రూ.15,460-47,330/-
-జిల్లాల వారీగా ఖాళీలు: ఆదిలాబాద్-8, ఖమ్మం-24, కరీంనగర్-23, మహబూబ్‌నగర్-7, మెదక్-11, నిజామాబాద్-7, నల్లగొండ-18, వరంగల్-8, మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు-4, సిటీ స్మాల్ కాజెస్ కోర్టు- 3, సిటీ సివిల్ కోర్టు-12, కోర్టు ఆఫ్ స్పెషల్ జడ్జ్ ఫర్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్-2 ఉన్నాయి.
-అర్హతలు: రాష్ట్ర బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైనవారు అర్హులు.
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా చేస్తారు.
-పరీక్ష పదోతరగతి స్థాయిలో ఉంటుంది.
-పరీక్ష 80 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో 40 మార్కులు జనరల్ నాలెడ్జ్, 40 మార్కులు జనరల్ ఇంగ్లిష్‌కు కేటాయించారు.
-జనరల్ నాలెడ్జ్ ప్రశ్నప్రత్రాన్ని ఇంగ్లిష్, తెలుగులో ఇస్తారు.
-పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు
-ఇంటర్వ్యూ (వైవా వాయిస్) 20 మార్కులకు ఉంటుంది.
-ఆన్‌లైన్ పరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించినవారిని పోస్టుల సంఖ్యను బట్టి 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

ఆఫీస్ సబార్డినేట్

-పేస్కేల్: 13,000-40,270/-
-జిల్లాల వారీగా ఖాళీలు: ఆదిలాబాద్-40, ఖమ్మం-78, కరీంనగర్-96, మహబూబ్‌నగర్-79, మెదక్-86, నిజామాబాద్-80, నల్లగొండ-64, రంగారెడ్డి-45, వరంగల్-47, మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు-21, సిటీ సివిల్‌క కోర్టు-27, సిటీ స్మాల్ కాజెస్ కోర్టు-11, కోర్టు ఆఫ్ స్పెషల్ జడ్జ్ ఫర్ ఎకనామిక్ అఫెన్సెస్ కోర్టు-7, కోర్టు ఆఫ్ స్పెషల్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్-3, కోర్టు స్పెషల్ జడ్జ్ ఫర్ ట్రయల్ ఆఫ్ కేసెస్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఇన్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్-2 ఉన్నాయి.
-అర్హతలు: ఏడోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. పదోతరగతి ఫెయిల్ అయినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోట్: ఉన్నత విద్యను అభ్యసించిన లేదా నిర్దేశిత అర్హత కంటే ఎక్కువ అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు.
-అదేవిధంగా కుకింగ్, కార్పెంటరీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పెయింటింగ్ తదితర వృత్తిపనులు వచ్చిన వారు దరఖాస్తులో ఆ వివరాలను పొందుపర్చాలి.
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా
-ఆన్‌లైన్ కంప్యూటర్ ఎగ్జామ్‌ను 80 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో 40 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ నుంచి, 40 ప్రశ్నలు జనరల్ ఇంగ్లిష్ నుంచి ఇస్తారు.
-ప్రతి ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు.
-కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌లో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నపత్రాన్ని ఇంగ్లిష్, తెలుగులో ఇస్తారు.
-ఆన్‌లైన్ ఎగ్జామ్‌లో కనీస అర్హత మార్కులు సాధించినవారిని పోస్టుల సంఖ్యను బట్టి 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

కాపియిస్ట్

-పేస్కేల్: రూ.15,460-47,330/-
-జిల్లాల వారీగా ఖాళీలు: ఆదిలాబాద్-8, ఖమ్మం-11, కరీంనగర్-19, మహబూబ్‌నగర్-13, మెదక్-6, నిజామాబాద్-9, నల్లగొండ-16, రంగారెడ్డి-8, వరంగల్-6, మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు-6, సిటీ సివిల్ కోర్టు-13, సిటీ స్మాల్ కాజెస్ కోర్టు-7 ఉన్నాయి.
-అర్హతలు: రాష్ట్ర ఇంటర్‌మీడియట్ బోర్డు నిర్వహించిన ఇంటర్‌కోర్సు ఉత్తీర్ణత లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ ఎగ్జామినేషన్ నిర్వహించిన ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ హయ్యర్ గ్రేడ్ పరీక్ష ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
నోట్: అభ్యర్థులకు అదనపు విద్యా, సాంకేతిక అర్హతలు ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికెట్లను ఇంటర్వ్యూ సమయంలో దాఖలు చేయాలి.
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
-ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. పరీక్ష 50 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో 25 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ నుంచి, 25 ప్రశ్నలు జనరల్ ఇంగ్లిష్ నుంచి ఇస్తారు. పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు.
-స్కిల్/టైపింగ్ టెస్ట్ 30 మార్కులు. దీన్ని కంప్యూటర్ పై నిర్వహిస్తారు.
-ఇంటర్వ్యూ (వైవా వాయిస్) 20 మార్కులకు ఉంటుంది.
-ప్రశ్నపత్రంలో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఇంగ్లిష్, తెలుగులో నిర్వహిస్తారు.
-ఆన్‌లైన్, స్కిల్‌టెస్ట్‌లో కనీస అర్హత మార్కులు సాధించినవారిని పోస్టుల సంఖ్యను బట్టి 1:3 నిష్పత్తి చేస్తారు.

జూనియర్ అసిస్టెంట్

-పేస్కేల్: రూ.16,400-49,870/-
-జిల్లాల వారీగా ఖాళీలు: ఆదిలాబాద్-1, ఖమ్మం-49, కరీంనగర్-30, మహబూబ్‌నగర్-42, మెదక్-4, నిజామాబాద్-10, నల్లగొండ-52, రంగారెడ్డి-65, వరంగల్-9, మెట్రోపాలిటిన్ సెషన్స్ కోర్టు -3, సిటీ సివిల్‌కోర్టు-4, సిటీ స్మాల్ కాజెస్ కోరు-6, కోర్టు ఆఫ్ స్పెషల్ జడ్జ్ ఫర్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్-2 ఉన్నాయి.
-అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణత. కంప్యూటర్ ఆపరేషన్స్‌పై నాలెడ్జ్ ఉండాలి. ఇంతకంటే ఎక్కువ అర్హతలు ఉంటే ఇంటర్వ్యూ సమయంలో సర్టిఫికెట్లను సమర్పించాలి.
-ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా చేస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 80 మార్కులు పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో 40 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్, 40 ప్రశ్నలు జనరల్ ఇంగ్లిష్ నుంచి ఇస్తారు. పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, తెలుగులో ఇస్తారు. వైవా వాయిస్‌కు 20 మార్కులు.

ముఖ్య సమాచారం

-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో (అన్ని పోస్టులకు)
-చివరితేదీ: సెప్టెంబర్ 4
-వయస్సు: అన్ని పోస్టులకు 2019, జూలై 1 నాటికి 18- 34 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
-పరీక్ష ఫీజు: జనరల్, బీసీలకు రూ.800/-
-ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.400/-
-వెబ్‌సైట్: www.hc.ts.nic.in / www.districts.ecourts.gov.in/telangana

-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

28458
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles