కోస్ట్‌గార్డ్‌లో యాంత్రిక్‌ పోస్టులు


Sun,August 4, 2019 12:49 AM

భారత రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ ఖాళీగా ఉన్న యాంత్రిక్‌-01/2020 బ్యాచ్‌ (డిప్లొమా హోల్డర్స్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
navik
-పోస్టు పేరు: యాంత్రిక్‌ (డిప్లొమా)
-అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెకానికల్‌/ఎలక్ట్రానిక్స్‌ & టెలి కమ్యూనికేషన్‌ (రేడియో/పవర్‌), ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
గమనిక: ఇంటర్‌ స్టేట్‌ & జాతీయ స్థాయి క్రీడలలోని 1, 2 ,3వ స్థానం చాంపియన్‌షిప్‌ పొందిన ఎస్సీ/ఎస్టీలకు 5 శాతం ఉత్తీర్ణతలో సడలింపు ఉంటుంది.
-వయస్సు: 18 -22 ఏండ్ల మధ్య ఉండాలి. అనగా 1998, ఫిబ్రవరి 1 నుంచి 2002, జనవరి 31 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-జీతభత్యాలు: రూ. 29,200 + యాంత్రిక్‌ పే రూ.6,200/- వీటికి అదనంగా డీఏ, కిట్‌ మెయింటెనెన్స్‌ అలవెన్స్‌, ఇతర అలవెన్స్‌లు ఉంటాయి.
-పదోన్నతులు: యాంత్రిక్‌ టెక్నికల్‌ నుంచి ప్రధాన్‌ సహాయక్‌ ఇంజినీర్‌ హోదా వరకు వెళ్లవచ్చు.
-శారీరక ప్రమాణాలు: ఎత్తు :157 సెం.మీ ఉండాలి. ఛాతీ గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి.
-ఎంపిక విధానం: రాతపరీక్ష, పీఎఫ్‌టీ ద్వారా
-రాతపరీక్ష: ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. దీనిలో సంబంధిత డిప్లొమా ఇంజినీరింగ్‌ సబ్జెక్టులైన ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ & టెలి కమ్యూనికేషన్‌ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. జనరల్‌ నాలెడ్జ్‌, రీజనింగ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌పై కూడా ప్రశ్నలు ఇస్తారు.
-రాతపరీక్షలో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ (పీఎఫ్‌టీ), ప్రిలిమినరీ మెడికల్‌ ఎగ్జామినేషన్‌లను నిర్వహిస్తారు.
-ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌: 1.6 కి.మీ. దూరాన్ని 7 నిమిషాల్లో, 10 ఫుష్‌ అప్‌లు, 20 ఉతక్‌ బైటక్‌లు చేయాలి.
-పరీక్ష కేంద్రాలు: ముంబై, కోల్‌కతా, చెన్నై.
-శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్‌ చిల్కాలో 2020 ఫిబ్రవరి నుంచి ట్రెయినింగ్‌ ప్రారంభమవుతుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఆగస్టు 11 నుంచి ప్రారంభం
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 17
-వెబ్‌సైట్‌: www.joinindiancoastguard.gov.in

526
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles