బీటెక్‌లో చేరుతున్నారా గేట్‌ కూడా మొదలు పెట్టండి


Mon,July 22, 2019 01:12 AM

gatee
-GATE-2020 ప్రకటన విడుదలైంది. ఈసారి ఈ పరీక్షను ఐఐటీ ఢిల్లీ నిర్వహిస్తున్నది. GATE-2020 స్కోర్‌ మూడేండ్లు ఉంటుంది.
-ఆన్‌లైన్‌ అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్‌ 3
-చివరితేదీ: సెప్టెంబర్‌ 24
-పరీక్ష తేదీ: 2020, ఫిబ్రవరి 1, 2, 8, 9
-వివరాలకు http://gate.iitd.ac.in వెబ్‌సైట్‌ చూడవచ్చు.
-మొత్తం 65 ప్రశ్నలకు 100 మార్కులు.
-నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. కాబట్టి తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు గుర్తించాలి.
1 మార్కు ప్రశ్నల తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు.
2 మార్కుల ప్రశ్నకు 2/3 మార్క్‌ నెగెటివ్‌ అవుతుంది.
-న్యూమరికల్‌ ప్రశ్నలకు నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు.

పరీక్షించే అంశాలు


-ఇంజినీరింగ్‌ ప్రాబ్లమ్స్‌ను అవగాహన చేసుకోవడానికి ఇంగ్లిష్‌పై పట్టు ఉండాలి.
-ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలోని సమస్యలను సాధించడానికి కచ్చితత్వం, వేగం కలిగిన ఆలోచనలు అవసరం. కాబట్టి జనరల్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
-ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలోని కాన్సెప్ట్స్‌ అర్థం చేసుకుని, సాధించడానికి మ్యాథమెటిక్స్‌ (higher) చాలా అవసరం.
-ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కాన్సెప్ట్స్‌ అండ్‌ సొల్యూషన్స్‌ ను అప్లయ్‌ చేయగలగాలి. అభ్యర్థిని అప్లికేషన్‌ ఓరియంటేషన్‌లో పరీక్షిస్తారు.
-ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ లో సడెన్‌ ప్రాబ్లమ్స్‌ను రికగ్నైజ్‌ చేసి రెక్టిఫై చేసే స్కిల్స్‌ ఉండాలి.
-ఇంజినీరింగ్‌ ఫీల్డ్‌లో టైమ్‌ మేనేజ్‌మెంట్‌ కీలకం. కాబట్టి నెగెటివ్‌ మార్కింగ్‌తో 65 ప్రశ్నలు ఆన్సర్స్‌ చేయడానికి 3 గంటల సమయం ఇచ్చి పరీక్షిస్తారు.

మంచి ర్యాంకు రావాలంటే


-గేట్‌ జాతీయ స్థాయి పరీక్ష. దీనికి పోటీ ఎక్కువగా ఉంటుంది. అంతమాత్రాన మనం దాన్ని సాధించలేమని కాదు కదా! కష్టమనే భావనను పక్కనపెట్టి, ప్రణాళికాబద్ధంగా, కాన్సెప్టువల్‌ లెర్నింగ్‌, ప్రాక్టీస్‌, సరైన మార్గదర్శకత్వంలో చదివితే మంచి స్కోర్‌ సాధించవచ్చు.
-ప్రిపరేషన్‌ కోసం స్టడీ మెటీరియల్‌ (పాఠ్య పుస్తకాలు, ఎక్స్‌పర్ట్‌ నోట్స్‌, గేట్‌, ఈఎస్‌ఈ క్వశ్చన్‌ బ్యాంక్‌, మోడల్‌ క్వశ్చన్‌ పేపర్లు) సేకరించుకోవాలి.
-గేట్‌ సిలబస్‌లో ఉన్న సబ్జెక్టుల ప్రిపరేషన్‌ను ప్రణాళిక ప్రకారం ప్రారంభించాలి.
-జనరల్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌కు సంబంధించి ప్రతిరోజు ఒక గంట ప్రిపేరవుతూ ప్రాక్టీస్‌ చేయాలి. గేట్‌ ప్రిపరేషన్‌ నిరంతరంగా ఎగ్జామ్‌ వరకు సాగడానికి మనసు, శరీరం

సంసిద్ధంగా ఉండాలి.


-ఇంజినీరింగ్‌ మ్యాథమెటిక్స్‌కు సంబంధించిన ఫార్ములాలు, కాన్సెప్ట్‌లు ఎప్పుడు అడిగినా చెప్పేట్లు ప్రిపేర్‌ కావాలి.
-సంబంధిత ఇంజినీరింగ్‌ సబ్జెక్టుల్లో కామన్‌ అంశాలైన నెట్‌వర్క్స్‌, సిగ్నల్‌ సిస్టమ్స్‌, ఈఎంఎఫ్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌, ఈడీసీ, అనలాగ్‌ సర్క్యూట్స్‌, డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌లోని కాన్సెప్ట్‌లను అర్థం చేసుకుని ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్‌ చేయాలి. పరీక్షలో వీటిపై వచ్చే ప్రశ్నలు లాజికల్‌గా ఉంటాయి. అందువల్ల షార్ట్‌ కట్‌ మెథడ్స్‌ నేర్చుకోవడం వల్ల టైమ్‌ మేనేజ్‌మెంట్‌ చేయవచ్చు.
exam
-ప్రతి సబ్జెక్టు నుంచి 7-10 మార్కులు వస్తాయి. కాబట్టి అన్ని అంశాలను క్షుణ్ణంగా ప్రిపేర్‌ కావాలి. దీనికోసం గేట్‌ ప్రిపరేషన్‌ను తొందరగా ప్రారంభించాలి. వచ్చే ఏడాది జనవరి లోపు కనీసం రెండుసార్లు ప్రిపరేషన్‌ పూర్తిచేయాలి.
-ఒక సబ్జెక్టును చదివేటప్పుడు సినాప్టిక్‌ నోట్స్‌, ముఖ్యమైన ఫార్ములాలు, ఈక్వేషన్లు తయారు చేసుకుని పరీక్ష వరకు గుర్తుంచుకునే పద్ధతిని అలవర్చుకోవాలి.
-సబ్జెక్టు ప్రిపరేషనల్‌లో మొదటగా కాన్సెప్టులు నేర్చుకోవాలి. తర్వాత గత గేట్‌ ఈఎస్‌ఈ ప్రశ్నలు ప్రాక్టీస్‌ చేయాలి. ప్రామాణిక పాఠ్యపుస్తకంలోని ఎక్సర్‌సైజ్‌ ప్రశ్నలు చేయాలి. వాటికి సంబంధించి పరీక్షలు (ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌) రాయాలి. ప్రిపరేషన్‌ సమయంలో వచ్చే అనుమానాలను వెంటనే నివృత్తి చేసుకోవాలి.
-ఇంజినీరింగ్‌ కోర్‌ సబ్జెక్టులను అప్లికేషన్‌ ఓరియెంటెడ్‌గా, సబ్జెక్టులను సమ్మిళితం చేసి ప్రిపేరవ్వాలి.
-ఉదాహరణకు ట్రిపుల్‌ ఈ (ఈఈఈ) వారికి పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ మెషిన్స్‌లోని అంశాలను కలిపి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.
-ఈసీఈ వారికి సిగ్నల్‌ సిస్టమ్స్‌, కమ్యూనికేషన్స్‌ను కలిపి ప్రశ్నలు వస్తాయి.
-ప్రిపరేషన్‌ సమయంలో అన్నికంటే విలువైనది కాలం అని గ్రహించాలి. పరీక్షకు ఆరు నెలల సమయం మాత్రమే ఉండటంతో కోచింగ్‌ తీసుకుంటే ఉపయోగంగా ఉంటుంది. కోచింగ్‌ సెంటర్‌ను ఎంపికచేసుకునేటప్పుడు...
-క్లాస్‌తోపాటు అనుమానాలను నివృతి చేసేవారు
-క్లాస్‌లో ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారు
-అధ్యాపకుల అనుభవం, పిరియాడికల్‌గా మోటివ్‌ చేయడం వంటివి గమనించాలి.
-హైదరాబాద్‌ కోఠీలోని స్పేస్‌ ఇంజినీరింగ్‌ అకాడమీ బాగా చదివే పేద విద్యార్థులకు గేట్‌-2020 కోసం ఉచితంగా కోచింగ్‌, హాస్టల్‌ వసతి కల్పిస్తున్నది. 25 ఏండ్ల అనుభవం కలిగిన డైరెక్టర్‌ జేసీ రుద్రపతి ఆధ్వర్యంలో గేట్‌-2020 కోచింగ్‌ ఇస్తున్నారు. అవసరం ఉన్నవారు 9848485698 నంబర్‌లో సంప్రదించవచ్చు.
-Free coaching for GATE-2020 and GOVT. Jobs at SPACE engg Academy
-Eligibility: BTech/BE (completed), GATE-19 Qualifying card, 75% and above in BTech.
-Selection: Written exam + Interview
-Final selection: 30 Students
-Top 10 students: Stipend Rs. 1000/month

ఇలా చేయండి


-బీటెక్‌ లేదా బీఈ చదువుతున్న విద్యార్థులు గేట్‌ ప్రిపరేషన్‌ను బీటెక్‌ రెండో ఏడాదిలోని ప్రారంభించాలి.
-అకడమిక్‌ ప్రోగ్రామ్‌, గేట్‌ ప్రిపరేషన్‌ సింక్‌ అయ్యేలా చూసుకోవాలి.
-గేట్‌ స్కోర్‌ వల్ల కలిగే లాభాలను అవగాహన చేసుకోవాలి.

రిఫరెన్స్‌ బుక్స్‌


-నెట్‌వర్క్‌ థియరీ- నెట్‌వర్క్‌ అండ్‌ సిస్టమ్స్‌-డీ రాయ్‌ చౌదురి,ఇంజినీరింగ్‌ సర్క్యూట్‌ అనాలసిస్‌- విలియం హెచ్‌ హయట్‌
-కంట్రోల్‌ సిస్టమ్స్‌- కంట్రోల్‌ సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌- ఐజే నాగ్‌రాథ్‌, ఎం గోపాల్‌,అటామిక్‌ కంట్రోల్‌ సిస్టమ్‌- BC Kuo,లీనియర్‌ కంట్రోల్‌ సిస్టమ్‌- బీఎస్‌ మాంక్‌
-ఎలక్ట్రో మ్యాగ్నటిక్‌ థియరీ- ఎలిమెంట్స్‌ ఆఫ్‌ ఎలక్ట్రోమ్యాగ్నటిక్స్‌- సాదిక్‌, ఇంజినీరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్స్‌- డబ్ల్యూహెచ్‌ హయట్‌, యాంటెన్నా అండ్‌ వేవ్‌ ప్రాపగేషన్‌- కేడీ ప్రసాద్‌, ఎలిమెంట్స్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్స్‌- ఎన్‌ఎన్‌ రావ్‌
-డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌- డిజిటల్‌ డిజైన్‌- ఎం మోరిస్‌ మను, డిజిటల్‌ సిస్టమ్స్‌- టోకి అండ్‌ విడ్‌మర్‌, మోటర్న్‌ డిజిటల్‌ ఎలక్ట్రానిక్స్‌- ఆర్‌పీ జైన్‌
-సిగ్నల్స్‌ అండ్‌ సిస్టమ్స్‌- సిగ్నల్స్‌ అండ్‌ సిస్టమ్స్‌- అలెన్‌ వీ ఓపెన్‌హైమ్‌, అలెన్‌ ఎస్‌
-అనలాగ్‌ సర్క్యూట్స్‌- ఎలక్ట్రానిక్‌ డివైజెస్‌ అండ్‌సర్క్యూట్స్‌- కెన్నెడీ, డెవిస్‌, ఇంటిగ్రేటెడ్‌ ఎలక్ట్రానిక్స్‌- జాకబ్‌ మిల్‌మన్‌,Ap Amp & Linear integrated circuit- రమాకాంత్‌ ఏ గైక్వాడ్‌,సెమీ కండక్టర్‌ డివైజెస్‌- SM Sze
-ఇంజినీరింగ్‌ మ్యాథమెటిక్స్‌- ఇంజినీరింగ్‌ మ్యాథమెటిక్స్‌- ఓపెన్‌హైమ్‌ అండ్‌ విల్‌స్కీ
-ఎలక్ట్రిక్‌ మెషిన్స్‌ అండ్‌ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌- ఎలక్ట్రికల్‌ మెషిన్స్‌ అండ్‌ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌- పీఎస్‌ భింబ్రా, ఎలక్ట్రికల్‌ మెషిన్స్‌ అండ్‌ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌- Nagratb & Kotbari
-ఎలక్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ మెజర్‌మెంట్స్‌- మెజర్‌మెంట్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌- AK Sawhney, మెజర్‌మెంట్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌- కూపర్‌
-పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ డ్రైవ్‌- పవర్‌ ఎలక్ట్రానిక్స్‌- పీఎస్‌ భింబ్రా
-పవర్‌ సిస్టమ్స్‌- పవర్‌ సిస్టమ్స్‌- నాగ్‌రాథ్‌ & కొఠారీ, పవర్‌ సిస్టమ్స్‌- సీఎల్‌ వాధ్వా, పవర్‌ సిస్టమ్స్‌- ఏ హుస్సైన్‌
-కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌- కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌- విల్‌స్కీ, ఎస్‌. హమీద్‌ నవాబ్‌,యాన్‌ ఇంట్రడక్షన్‌ టూ అనలాగ్‌ అండ్‌ డిజిటల్‌ కమ్యూనికేషన్స్‌- సైమన్‌ హైకిన్స్‌, కమ్యూనికేసన్‌ అనలాగ్‌ అండ్‌ డిజిటల్‌- సైమన్‌ హైకిన్స్‌, మోడర్న్‌ డిజిటల్‌ అండ్‌ అనలాగ్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌- సింగ్‌ అండ్‌ సప్రే, ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌- బీపీ లథి
-మైక్రో ప్రాసెపర్స్‌- మైక్రోప్రాసెసర్స్‌ ఫర్‌ ప్రోగ్రామింగ్‌ ఎగ్జాంపుల్స్‌- బీ రామ్‌
rudrapathi

427
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles