ఎయిర్‌ ఇండియాలో ఖాళీలు


Thu,July 18, 2019 01:28 AM

న్యూఢిల్లీలోని ఎయిర్‌ ఇండియా ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఈఎస్‌ఎల్‌) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Air-India
-ఏఐఈఎస్‌ఎల్‌ అనేది ఎయిర్‌ ఇండియా లిమిటెడ్‌ ఆధ్వర్యలో నడిచే సంస్థ. ఈ పోస్టులను ఐదేండ్ల కాలానికి భర్తీచేస్తారు. అభ్యర్థి పనితీరును బట్టి మరో ఐదేండ్లవరకు పొడిగిస్తారు.
-పోస్టు: ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీర్‌
-మొత్తం ఖాళీలు: 125 (జనరల్‌-51, ఈడబ్ల్యూఎస్‌-12, ఓబీసీ-35, ఎస్సీ-18, ఎస్టీ-9)
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌ లేదా 10+2 (మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ) ఉత్తీర్ణత. B737-700/800/900 ఎయిర్‌క్రాఫ్ట్‌లో పనిచేసి ఉండాలి.
నోట్‌: ఈ పోస్టులను ముంబై, నాగ్‌పూర్‌, ఢిల్లీతోపాటు దేశంలోని ఎక్కడైనా భర్తీచేస్తారు.
-పే స్కేల్‌: రూ.95,000-1,28,000/-
-అప్లికేషన్‌ ఫీజు: రూ.1000/- ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రూ.500/-
-ఎంపిక విధానం: వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: అర్హత కలిగిన అభ్యర్థులందరూ నిర్ణీత నమూనాలో దరఖాస్తును నింపి, డిమాండ్‌ డ్రాఫ్ట్‌, సంబంధిత సర్టిఫికెట్లతో నేరుగా పర్సనల్‌ అధికారి వద్ద హాజరుకావాలి.
-ఇంటర్వ్యూ తేదీ: ఆగస్టు 26-30
-వెబ్‌సైట్‌:www.airindia.in

588
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles