జామ్-2020


Wed,July 17, 2019 03:27 AM

Student

- ఐఐటీల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల కోసం


సాధారణ డిగ్రీ చేసి పీజీ, పీహెచ్‌డీలను ఐఐటీల్లో చేయాలనుకుంటున్నారా? డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఐఐటీల్లో చదువుకునే చేసే అవకాశాన్ని కల్పించే పరీక్ష ఇది. దీనిలో అర్హత సాధిస్తే మీరు ఐఐటీల్లో పీజీ, పీహెచ్‌డీ చేయవచ్చు. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ, డ్యూయల్ డిగ్రీ వంటి కోర్సు చేయడానికి జాతీయస్థాయిలో ఏటా నిర్వహించే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎమ్మెస్సీ (జామ్) -2020 ప్రకటన త్వరలో విడుదలకానున్న నేపథ్యంలో జామ్‌కు సంబంధించిన వివరాలు నిపుణ పాఠకుల కోసం...

- జామ్: దేశంలో ఇంజినీరింగ్, సైన్స్ విద్యకు పేరుగాంచిన ఐఐటీలు, ఐఐఎస్సీలలో పీజీ చేయాలనుకునేవారి కోసం జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ ఎమ్మెస్సీ (జామ్)ను 2004-05 నుంచి ఐఐటీలు ప్రారంభించాయి. ఈ టెస్ట్ ద్వారా సైన్స్, మ్యాథ్స్, బయాలజీకి సంబంధించిన పీజీస్థాయి కోర్సులు, పీహెచ్‌డీల్లో ప్రవేశాలను ఐఐటీలు, ఐఐఎస్సీ కల్పిస్తున్నాయి.

- కొంత కాలంగా జాతీయ ప్రాముఖ్యత కలిగిన విద్యాసంస్థలు ఎన్‌ఐటీలు, ఐఐఈఎస్‌టీ-శిబ్‌పూర్, ఎస్‌ఎల్‌ఐఈటీ-పంజాబ్, ఐఐఎస్‌ఈఆర్‌లు కూడా ఈ స్కోర్‌తో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

ముఖ్య సమాచారం

- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం
- చివరితేదీ: అక్టోబర్ 8
- పరీక్ష తేదీ: 2020, ఫిబ్రవరి 9
- ఆర్గనైజింగ్ ఇన్‌స్టిట్యూట్: ఐఐటీ కాన్పూర్
- ఫలితాల వెల్లడి: 2020, మార్చి 20
- పరీక్ష రెండు సెషన్లలో (ఉదయం, మధ్యాహ్నం) ఉంటుంది.
- వెబ్‌సైట్: jam.iitk.ac.in (or) https://www.iitk.ac.in/
నోట్: త్వరలో అధికారిక ప్రకటనను ఐఐటీ కాన్పూర్ విడుదల చేయనున్నది.

ఏయే కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు?

- ఐఐటీల్లో ఎమ్మెస్సీ (రెండేండ్లు), జాయింట్ ఎమ్మెస్సీ-పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ-పీహెచ్‌డీ, డ్యూయల్ డిగ్రీ, పోస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌తోపాటు ఐఐఎస్సీలో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ (బయాలజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్) ప్రోగ్రామ్ ఉన్నాయి.

ఎవరు అర్హులు?

- సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో లేదా 5.5 సీజీపీఏతో బ్యాచిలర్ డిగ్రీ (బీఎస్సీ, బీఈ/బీటెక్) ఉత్తీర్ణత.

పరీక్ష విధానం:

- ఆన్‌లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-సీబీటీ) విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
- పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది.
- మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. 60 ప్రశ్నలు, 100 మార్కులు.
- ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, న్యూమరికల్ ఆన్సర్ టైప్ విధానంలో ఇస్తారు. సెక్షన్ ఏలో నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. మిగిలిన సెక్షన్లలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉండదు.
ఏయే సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు?
- బయోటెక్నాలజీ, బయాలజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్.

- కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

777
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles