మృదులాస్థి నిర్మిత అంతరాస్థిపంజర చేపల విభాగం?


Wed,July 17, 2019 01:20 AM

చేపల హృదయాన్ని సిరా హృదయం (Venous heart) అంటారు. చేపల శరీర అవయవాల నుంచి సిరా రక్తం (ఆక్సిజన్ లేని రక్తం) మాత్రమే హృదయానికి చేరడంవల్ల సిరా హృదయం అని పేరు వచ్చింది. వీటిలో విసర్జక పదార్థం అమ్మోనియా. కానీ మృదులాస్థి చేపల్లో యూరియా విసర్జక పదార్థం.
fish-wide
నేతోస్టొమేటా (Gnathostomes)
-Gnathos అంటే దవడ, Stoma అంటే నోరు అని అర్థం.
-ఇవి దవడలు గల సకశేరుకాలు.
-దీనిలో వాజాలు (Fins0) కలిగిన చేపలు, అంగాలు (Limbs) కలిగిన చతుష్పాదులు ఉంటాయి.
-సకశేరుకాలను స్థూలంగా కింది విధంగా చెప్పవచ్చు. అవి..
-1. చేపలు (Pisces)
-2. ఉభయచరాలు (Amphibians)
-3. సరీసృపాలు (Reptiles)
-4. పక్షులు (Aves)
-5. క్షీరదాలు (Mammales)

చేపలు
-చేపల గురించిన అధ్యయనాన్ని ఇక్తియాలజీ అంటారు.
-చేపల పెంపకాన్ని పిషీకల్చర్ (Pisciculture) అంటారు.
-చేపలు, రొయ్యలు, పీతలు, ఆల్చిప్పలు, మొదలైన జలచర జీవుల పెంపకాన్ని ఆక్వాకల్చర్ అంటారు.
-చేపల ఉత్పత్తిని బ్లూ రెవల్యూషన్ అంటారు.
-ఇవి సైలూరియన్ కాలంలో ఉద్భవించాయి.
-డివోనియన్ కాలాన్ని చేపల స్వర్ణయుగం అంటారు.
-చేపల్లో వాజాలు ఉండి చలనానికి తోడ్పడుతాయి.
-చేపల్లో పొలుసులు ఉంటాయి, కానీ కొన్నింటిలో ఉండవు.
-వీటిలో శ్వాసక్రియ మొప్పల ద్వారా జరుగుతుంది. కానీ డిప్నాయ్ చేపల్లో ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది.
-వీటి హృదయంలో రెండు గదులు ఉంటాయి.
-చేపల్లో హృదయం మొప్పలకు రక్తాన్ని సరఫరా చేయడంవల్ల దీన్ని జలశ్వాస హృదయం (Branchial heart) అంటారు.
-చేపల్లో ఏక రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది.
-చేపల హృదయాన్ని సిరా హృదయం (Venous heart) అంటారు. చేపల శరీర అవయవాల నుంచి సిరా రక్తం (ఆక్సిజన్ లేని రక్తం) మాత్రమే హృదయానికి చేరడంవల్ల సిరా హృదయం అని పేరు వచ్చింది.
-వీటిలో విసర్జక పదార్థం అమ్మోనియా. కానీ మృదులాస్థి చేపల్లో యూరియా విసర్జక పదార్థం.
-చేపల్లో 10 జతల కపాలనాడులు ఉంటాయి. కేంద్ర నాడీవ్యవస్థను కప్పి మెనింక్స్ ప్రిమిటివా (Meninx Primitiva) అనే ఒక పొర ఉంటుంది.
-వీటిలో పార్శరేఖా జ్ఞానేంద్రియ వ్యవస్థ (Lateral-line Sensory System) ఉండి నీటి కదలికలు, కంపనాలను గుర్తించడానికి తోడ్పడుతుంది.
-చేపల్లో నేత్రాలకు కనురెప్పలు ఉండవు. నిమేషక పటలం (Nictitating Membrane) కనుగుడ్డును రక్షిస్తూ ఉంటుంది.
-ఇవి శీతలరక్త జంతువులు.
-ఇవి ఏకలింగ జీవులు (స్త్రీ, పురుష జీవులు వేర్వేరుగా ఉంటాయి).
-చేపల్లో ప్రస్తుతం రెండు విభాగాలు ఉన్నాయి. అవి..
1. కాండ్రిక్తిస్/మృదులాస్థి చేపలు
2. ఆస్టిక్తిస్/అస్థి చేపలు

కాండ్రిక్తిస్ (Chondrichthyes)
-Chondros అంటే మృదులాస్థి అని, Ichthyes అంటే చేపలు అని అర్థం.
-వీటినే మృదులాస్థి చేపలు అంటారు. వీటి అంతరాస్థిపంజరం మృదులాస్థితో నిర్మితమై ఉంటుంది.
-ఇవి సముద్ర చేపలు.
-వీటిలో మొప్ప చీలికలు ఉపరికులం (Operculum/Gill cover) లేకుండా ఉంటాయి. ఇవి శ్వాసక్రియలో తోడ్పడుతాయి.
-వీటిలో చర్మం ప్లాకాయిడ్ పొలుసులను కలిగి ఉండి గట్టిగా ఉంటుంది. (దంతాలు మార్పుచెంది ప్లాకాయిడ్ పొలుసులు ఏర్పడుతాయి)
-వీటిలో దవడలు చాలా గట్టిగా ఉంటాయి.
-ఇవి పరభక్షకాలు.
-వీటిలో వాయుకోశం (Airbladder) ఉండదు. తత్ఫలితంగా నీటిలో మునగకుండా ఉండటం కోసం నిరంతరం ఈదుతూ ఉంటాయి.
-ఇవి ఏకలింగ జీవులు.
-వీటిలో ఎక్కువగా శిశూత్పాదకాలు (Viviparous) ఉన్నాయి.
-మగ చేపల్లో శ్రోణివాజాల దగ్గర సంపర్కదండాలు (Claspers) ఉండి అంతర ఫలదీకరణలో తోడ్పడుతాయి.
-ఇవి యూరియోటెలిక్ జీవులు. రక్తంలో యూరియాను నిల్వ ఉంచుకుని, శరీరద్రవాల ద్రవాభిసరణ గాఢతను పెంచుకుంటాయి.

ఉదా:
-స్కోలియోడాన్ (సొరచేప/డాగ్ ఫిష్)
-ప్రిస్టిస్ (రంపపు చేప/సా ఫిష్)
-కార్కరోడాన్ (గ్రేట్ వైట్ షార్క్)
-ట్రైగాన్, డాసియాటిస్ (విషపూరిత చేపలు)
-టార్పిడో (విద్యుత్ చేప) - వీటిలో పృష్ట కండరాలు విద్యుత్ అవయవాలుగా మార్పు చెందుతాయి.
-స్పిర్నా (సుత్తితల చేప)
-రింకోడాన్/రైనోడాన్ (వేల్ షార్క్/తిమింగలపు సొర) - ఇది అతిపెద్ద చేప, రెండో అతిపెద్ద జంతువు.
fish
ఆస్టిక్తిస్ (Osteichthyes)
-Osteon అంటే అస్థి అని, Ichthyes అంటే చేపలు అని అర్థం.
-ఇవి అస్థిచేపలు. వీటి ఎముకలు అస్థితో నిర్మితమై ఉండి గట్టిగా ఉంటాయి.
-ఇవి సముద్రపు నీటిలోనూ, మంచినీటిలోనూ నివసిస్తాయి.
-నోరు పూర్వాంతంలో ఉంటుంది.
-ఇవి నాలుగు జతల మొప్పలను కలిగి ఉంటాయి. ఇవి శ్వాసక్రియలో తోడ్పడుతాయి. మొప్పలను ఆవరించి ఉపరికులం ఉంటుంది.
-చర్మంపై సైక్లాయిడ్/టీనాయిడ్ పొలుసులు ఉంటాయి.
-వీటిలో వాయుకోశం ఉంటుంది. ఇది నీటిలో తేలడానికి తోడ్పడుతుంది.
-ఇవి ఏకలింగ జీవులు. వీటిలో బాహ్యఫలదీకరణ జరుగుతుంది.
-వీటిలో ప్రత్యక్ష పిండాభివృద్ధి జరుగుతుంది.
-ఇవి అండోత్పాదకాలు.

ఉదా:
సముద్ర చేపలు (Marine Fish)
--ఎక్సోసీటస్ (ఎగిరే చేప)
-హిప్పోకాంపస్ (సముద్ర గుర్రం) - పురుష జీవిలో గుడ్లసంచి ఉంటుంది.

మంచినీటి చేపలు (Fresh water Fish)
-లేబియో (రోహు)
-కట్ల కట్ల (కట్ల)
-క్లేరియస్ (మగర్)

అక్వేరియం చేపలు
-బెట్టా (పోరాడే చేప)
-టీరోఫిల్లం (ఏంజిల్ ఫిష్)

మత్స్య పరిశ్రమ యాజమాన్యం (Fishery management)


-మానవుడికి ఆహారంగా ఉపయోగపడే చేపలు, ఇతర జలచర జంతువులను పట్టడం, పెంచడం, వివిధ రకాలుగా నిలువ చేయడం, విక్రయించడాన్ని మత్స్య పరిశ్రమ/వృత్తి అంటారు.

చేపల ఆర్థిక ప్రాముఖ్యం


-చేప మాంసం సాధారణంగా ప్రోటీన్లకు, విటమిన్లకు (ఏ, డీ), ఖనిజాలకు మూలం.
-చేప మాంసంలో అయోడిన్ సమృద్ధిగా లభిస్తుంది.
-సొర చేప, కాడ్ చేప కాలేయ నూనెల్లో విటమిన్-ఏ, డీ పుష్కలంగా లభిస్తాయి.
-సాైర్డెన్, సాల్మన్ చేపల నూనెలో ఒమేగా-3 ఫాటీ ఆమ్లాలు విరివిగా లభిస్తాయి.

-ఫిష్‌గ్వాన్:స్క్రాప్ చేపల నుంచి తయారు చేసిన ఎరువును ఫిష్‌గ్వానో అంటారు. దీన్ని కోళ్ల పరిశ్రమలో దాణాగా, అరటి, రబ్బరు తోటలకు ఎరువుగా వాడుతారు.

-షాగ్రీన్:ఎండబెట్టిన సొరచేప చర్మాన్ని షాగ్రీన్ అంటారు. దీన్ని తివాచీలు, గృహోపకరణ వస్తువులను నునుపు చేయడానికి ఉపయోగిస్తారు.

-ఐసిన్ గ్లాస్:పిల్ల చేపల ఎండిన గాలి తిత్తుల నుంచి తీసిన పదార్థంతో చేసినదాన్ని ఐసిన్‌గ్లాస్ (Isinglass) అంటారు. దీన్ని వైన్‌ను శుద్ధిచేయడానికి ఉపయోగిస్తారు.

-ఫిష్‌గ్లూ (Fish glue):ఎసిటిక్ ఆమ్లంలో చేపల చర్మాన్ని కరిగించి దీన్ని తయారుచేస్తారు. దీన్ని పుస్తకాల బైండింగ్‌లో వాడుతారు.
-చేపలను కృత్రిమంగా ప్రజననం (ప్రేరిత ప్రజననం) చెందించడానికి పియూష గ్రంథి నుంచి సంగ్రహించిన గొనడో ట్రోపిన్ (FSH, LH) ఉన్న ద్రావణం లేదా ఓవాప్రిమ్‌ను వాడుతారు.

-కొన్ని సముద్ర నీటి చేపలు- హిల్సా, సాైర్డెన్, బాంబేడక్, మకెరల్, సిల్వర్ పాంఫ్రెట్‌లుదేశంలో అతిపెద్ద ఫిషరీ- కేరళ తీరంలోని ఆయిల్ సాైర్డెన్‌లు.

మత్స్య పరిశ్రమ రకాలు-చేపల వనరులు లభ్యమయ్యే విధానాన్ని బట్టి మత్స్య పరిశ్రమను రెండు స్థూల విభాగాలుగా విభజించవచ్చు. అవి..

MALADASH

-ఎ. పట్టుకోబడే మత్స్య పరిశ్రమ
-బి. సంవర్ధన మత్స పరిశ్రమ

పట్టుకోబడే మత్స్య పరిశ్రమ


-సహజ నీటి ఆవాసాల నుంచి చేపలను పట్టడాన్ని పట్టుకోబడే మత్స్య పరిశ్రమ (Capture Fishery) అంటారు.
-చేపలు పట్టడం సముద్రం నుంచి కావచ్చు లేదా భూమిపై ఉన్న జలాల నుంచి కావచ్చు.
-చేపలను సముద్రం నుంచి పట్టుకుంటే దాన్ని సముద్ర మత్స్య పరిశ్రమ (Marine Fishery) అని, తీర సుదూర జలాల నుంచి పట్టుకున్నట్లయితే దాన్ని దూర తీర మత్స్య పరిశ్రమ (Offshore Fishery) అని, తీర జలాల్లో పట్టుకుంటే దాన్ని తీర ప్రాంత మత్స్య పరిశ్రమ (Inshore Fishery) అని, నదీ ముఖద్వారాల నుంచి కానీ, మంచి నీటి నుంచి కానీ పట్టుకుంటే దాన్ని భౌమ్యాంతర లేదా మంచి నీటి మత్స్య పరిశ్రమ (Inland Fishery) అంటారు.

సంవర్ధన మత్స్య పరిశ్రమ


-నియంత్రిత పరిస్థితుల్లో, ఎంపిక చేసిన జలచరాల పెంపకం, నిర్వహణ చేసి నియమిత కాలం తర్వాత పట్టుకోవడాన్ని సంవర్ధన పరిశ్రమ లేదా జల సంవర్ధన అంటారు.
-జలచర జీవులను పెంచడాన్ని జల సంవర్ధనం (Aqua culture) అంటారు. (చేపలు, రొయ్యలు, పీతలు, ఆల్చిప్పలు మొదలైనవి)
-చేపలను మాత్రమే పెంచితే దాన్ని చేపల పెంపకం లేదా మత్స్య సంవర్ధనం (Pisci culture) అంటారు.

మంచినీటి చేపల పెంపకంలో విరివిగా వాడే రకాలు..


-భారతదేశ కార్ప్ చేపలు- కట్లకట్ల (కట్ల), సిైర్హెనస్ మ్రిగాలా (మ్రిగాల్), లేబియోరోహిటా (రోహు)
-విదేశీ చైనా కార్ప్ చేపలు- సామాన్య కార్ప్, గ్రాస్ కార్ప్, సిల్వర్ కార్ప్.

271
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles