పరిశో‘ధన’లకు ఇన్‌స్పైర్


Mon,July 15, 2019 12:09 AM

చాలామంది విద్యార్థులకు సైన్స్ అంటే మక్కువ ఎక్కువ. చిన్నప్పటి నుంచే రకరకాల ప్రయోగాలు చేస్తూ భవిష్యత్తులో పెద్ద శాస్త్రవేత్తలు కావాలనుకుంటారు. కానీ చాలామందికి ఆసక్తి ఉన్నా ప్రోత్సాహం కరువై పరిశోధనలవైపు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. సరిగ్గా ఈ సమస్యకు పరిష్కారం కోసం భారత ప్రభుత్వం పిల్లల్లో శాస్త్ర సాంకేతిక పరిశోధన ఆసక్తిని పెంచి, వారిని ఆ రంగంలో నిపుణులుగా తయారుచేసేందుకు ఇచ్చే పురస్కారాలకు సంబంధించిన ఇన్‌స్పైర్ సంక్షిప్తంగా...
inspire
-న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ విజ్ఞాన సాంకేతిక విభాగం ప్రతి ఏటా అందించే ఇన్‌స్పైర్ పురస్కారాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
-అర్హతలు: 10 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి 6 నుంచి 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ/ఎయిడెడ్ ప్రైవేట్ రికగ్నైజ్డ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు.
ఏం చేయాలి?
-విద్యార్థులు తాము నిత్యజీవితంలో ఎదుర్కొనే సమస్యలను అధిగమించడానికి లేదా సమాజానికి ఉపయోగపడే ఒక నూతన పరికరాన్ని రూపొందించడానికి తమ ఆలోచనలను ప్రాజెక్టు ప్రపోజల్ రూపంలో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.
-స్టయిఫండ్: ఎంపికైన ప్రతిపాదనలకు ఒక్కొక్కరికీ రూ.10 వేల ఆర్థిక సహాయం ప్రాజెక్టు రూపకల్పన కోసం అందిస్తారు. దీనికి సంబంధించిన అదనపు సమాచారం అన్ని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోనూ, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో లభిస్తుంది.
-చివరితేదీ: జూలై 31
-వెబ్‌సైట్: www.inspireawards-dst.gov.in

279
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles