బార్క్‌లో స్టయిఫండరీ ట్రెయినీలు


Wed,July 10, 2019 01:46 AM

కల్పకంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీకి చెందిన బాబా అటామిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టయిఫండరీ ట్రెయినీ, టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
barc
-మొత్తం పోస్టులు: 47 (స్టయిఫండరీ ట్రెయినీ-43, టెక్నీషియన్‌-4)విభాగాల వారీగా ఖాళీలు
-స్టయిఫండరీ ట్రెయినీ-43 ఖాళీలు (జనరల్‌-19, ఓబీసీ-15, ఎస్టీ-6, ఈడబ్ల్యూఎస్‌-3)
-విభాగాలవారీగా ఖాళీలు: ప్లాంట్‌ ఆపరేటర్‌-7, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌-4, ఫిట్టర్‌-12, వెల్డర్‌ -2, టర్నర్‌-1, ఎలక్ట్రీషియన్‌-4, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌-8, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌-4, ఏసీ మెకానిక్‌-1
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి (సైన్స్‌ అండ్‌ మ్యాథ్స్‌)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్‌సీవీటీ/ఎన్‌సీవీటీ నుంచి సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత. ప్లాంట్‌ ఆపరేటర్‌కు సైన్స్‌లో ఇంటర్‌ (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
-ట్రెయినింగ్‌ పీరియడ్‌: రెండేండ్లు
-వయస్సు: 2019 ఆగస్టు 7 నాటికి 18 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి.
-పే స్కేల్‌: ఏడాదికి రూ.10,500/-, రెండో ఏడాదికి రూ. 12,500/- స్టయిఫండ్‌ చెల్లిస్తారు. ట్రెయినింగ్‌ పూర్తయిన తర్వాత టెక్నీషియన్‌ బీ/సీగా ఉద్యోగం ఇస్తారు. ఈ సమయంలో పేస్కేల్‌ రూ. 21,700/ 25,500 లభిస్తుంది.
-టెక్నీషియన్‌ (బాయిలర్‌ ఆపరేటర్‌/పెయింటర్‌)-4 ఖాళీలు
-అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతితోపాటు బాయిలర్‌ అటెండెంట్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. టెక్నీషియన్‌ పెయింటర్‌కు పదోతరగతి (సైన్స్‌&మ్యాథ్స్‌)తోపాటు సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత.
-వయస్సు: 2019 ఆగస్టు 7 నాటికి 18 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి.
-పేస్కేల్‌: రూ.25,500/-
-అప్లికేషన్‌ ఫీజు: రూ.100/- ఎస్సీ/ఎస్సీ/పీహెచ్‌సీలకు ఎలాంటి ఫీజు లేదు.
-ఎంపిక: ఆబ్జెక్టివ్‌ రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్‌ ద్వారా
-స్టయిఫండరీ ట్రెయినీ పోస్టులకు ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటిది ప్రిలిమినరీ (మ్యాథమెటిక్స్‌, సైన్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌) రెండోది అడ్వాన్స్‌డ్‌ (సంబంధిత ట్రేడ్‌ టెస్ట్‌), మూడోది-స్కిల్‌ టెస్ట్‌.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 7
-వెబ్‌సైట్‌: https://recruit.barc.gov.in

418
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles