జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష


Tue,July 9, 2019 01:11 AM

కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తిగల జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2020-21 విద్యాసంవత్సరానికి 6వ తరగతి (రెసిడెన్షియల్ ప్రోగ్రామ్)లో ప్రవేశం కోసం నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ విడుదల చేసింది.
JNV
-జవహర్ నవోదయ ప్రవేశపరీక్ష-2020
-అర్హత: ప్రస్తుత విద్యా సంవత్సరం (2019-20)లో ఏ జిల్లాలోనైతే నవోదయ విద్యాలయం పనిచేస్తుందో అదే జిల్లాకు చెందిన ప్రభుత్వ/ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వతరగతి చదువుతూ ఉండాలి.
-గమనిక: గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కనీసం 75 శాతం సీట్లు, బాలికలకు 1/3వ వంతు సీట్లు కేటాయించారు.
-వయస్సు: 2007 మే 1 నుంచి 2011 ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి.
-ఎంపిక: జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష ఆధారంగా
-పరీక్ష మొత్తం 80 ప్రశ్నలకుగాను 100 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షలో మూడు సెక్షన్లు ఉంటాయి. రెండు గంటల్లో పూర్తిచేయాలి. పరీక్ష పత్రం ఇంగ్లిష్/హిందీతోపాటు ప్రాంతీయ (తెలుగు) భాషలో ముద్రిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చిరునామా: నవోదయ విద్యాలయ సమితి,
-ప్రాంతీయ కార్యాలయం,1-1-10/3, సర్దార్‌పటేల్ రోడ్, సికింద్రాబాద్ తెలంగాణ -500003
-చివరితేదీ: సెప్టెంబర్ 15
-ప్రవేశపరీక్ష: సమ్మర్ బౌండ్ ఎంపిక పరీక్ష-2020 జనవరి 11, వింటర్‌బౌండ్ ఎక్స్‌ట్రీమ్ ఎంపిక పరీక్ష-2020 ఏప్రిల్ 11
-వెబ్‌సైట్: http://navodayahyd.gov.in
JNV1
exam

1488
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles