బైపీసీ కోటాలో అండర్‌ గ్రాడ్యుయేట్‌


Sun,July 7, 2019 01:34 AM

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ బైపీసీ స్ట్రీమ్‌ ద్వారా 2019-20 కిగాను అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, వెటర్నరీ,
ఫిషరీస్‌ డిగ్రీ కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశాల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

pjtsau-bipc
-మొత్తం సీట్ల సంఖ్య: 851
-ఈ నోటిఫికేషన్‌తో PJTSAU, PVNRTVU, SKLTSHU యూనివర్సిటీల్లో /అనుబంధ కాలేజీల్లోని అండర్‌ గ్రాడ్యుయేట్‌ (బీఎస్సీ అగ్రికల్చర్‌/హార్టిక్చర్‌, బీవీఎస్‌సీ & ఏహెచ్‌, బీఎఫ్‌ఎస్‌సీ) కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
కోర్సులు, సీట్ల వివరాలు:ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ
-నాలుగేండ్ల బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌-507 సీట్లు (75 పేమెంట్‌ సీట్లు)
-కాలేజీలు: రాజేంద్రనగర్‌, అశ్వారావుపేట (కొత్తగూడెం), పొలాస (జగిత్యాల), పాలెం (నాగర్‌కర్నూల్‌), వరంగల్‌, సిరిసిల్లా
శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం
-నాలుగేండ్ల బీఎస్సీ (ఆనర్స్‌) హార్టికల్చర్‌ -150 సీట్లు (20 పేమెంట్‌ సీట్లు)
-కాలేజీలు: రాజేద్రనగర్‌, పెద్దమందడి (వనపర్తి)పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ
-ఐదున్నరేండ్ల బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌-158 సీట్లు
-కాలేజీలు: రాజేంద్రనగర్‌, కోరుట్ల (జగిత్యాల), మామనూర్‌
-నాలుగేండ్ల బీఎఫ్‌ఎస్సీ
-36 సీట్లు
-కాలేజీలు: పెబ్బేరు (వనపర్తి), ముత్తుకూర్‌ (నెల్లూరు)
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి ఇంటర్‌ (బైపీసీ)తోపాటు తెలంగాణ స్టేట్‌ ఎంసెట్‌-2019లో ఉత్తీర్ణత సాధించాలి.
-వయస్సు: డిసెంబర్‌ 31 నాటికి 17 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 25 ఏండ్లు, పీహెచ్‌సీలకు 27 ఏండ్ల వరకు సడలింపు ఉంటుంది.
గమనిక: బీవీఎస్సీ & ఏహెచ్‌ కోర్సుకు 25 ఏండ్లు మించరాదు.
-ఫీజు: రూ.1800/-, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 900/-
-ఎంపిక: టీఎస్‌ ఎంసెట్‌ 2019లో వచ్చిన ర్యాంక్‌ ఆధారంగా.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా
-చివరి తేదీ: జూలై 27
-వెబ్‌సైట్‌: www.pjtsau.ac.in

1228
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles