డీటీయూలో ఖాళీలు


Thu,July 4, 2019 01:42 AM

ఢిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ(డీటీయూ)లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
University
-పోస్టు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
-మొత్తం ఖాళీలు: 167
-విభాగాల వారీగా ఖాళీలు: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌-7, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌-32, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ-15, మేనేజ్‌మెంట్‌ (డీఎస్‌ఎం)-15, మేనేజ్‌మెంట్‌ (యూఎస్‌ఎంఈ)-19, ఎకనామిక్స్‌ (యూఎస్‌ఎంఈ)-3, మ్యాథమెటిక్స్‌&కంప్యూటింగ్‌-5, అప్లయిడ్‌ ఫిజిక్స్‌-8, ఇంజినీరింగ్‌ ఫిజిక్స్‌-11, బయోటెక్నాలజీ-8, ఈసీఈ-26, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌-29 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్‌తోపాటు ఎంఈ/ఎంటెక్‌ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత. ఏజీపీ స్కేల్‌ను బట్టి ఆయా పోస్టులకు నెట్‌/సెట్‌ లేదా తత్సమాన పరీక్షల్లో వ్యాలిడ్‌స్కోర్‌ లేదా పీహెచ్‌డీ ఉండాలి. మరికొన్ని పోస్టులకు ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత ఉండాలి. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-వయస్సు: 2019, ఆగస్టు 1 నాటికి 35 ఏండ్లు మించరాదు.
-పేస్కేల్‌: ఏజీపీ రూ.6,000+ పేబ్యాండ్‌ 3 (15,600-39,100)
-ఎంపిక: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను అర్హత ప్రకారం షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. పీహెచ్‌డీ ఉన్నవారికి నేరుగా ఇంటర్వ్యూలు
నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఫీజు: జనరల్‌/ఓబీసీలకు రూ.1,000/- ఈడబ్ల్యూఎస్‌, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.500/-
-చివరితేదీ: ఆగస్టు 21
-వెబ్‌సైట్‌: http://www.dtu.ac.in

826
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles