యూపీఎస్సీ 2019-20


Wed,July 3, 2019 02:09 AM

దేశంలో అత్యున్నత ఉద్యోగాలుగా పిలిచే సివిల్ సర్వీసెస్ నుంచి గ్రూప్ ఏ ఆఫీసర్ల వరకు పలు కొలువులను భర్తీ చేసే సంస్థ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ). ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించిన ఇండియన్ సివిల్ సర్వీస్ క్రమానుగతంగా రూపాంతరం చెంది స్వాతంత్య్రానంతరం యూపీఎస్సీగా మారింది. ఈ సంస్థ ఏటా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసి ఎంపిక ప్రక్రియను చేపడుతుంది. ఏటా ఏయే ప్రకటనలు విడుదల చేస్తుంది. 2019-20 సంవత్సరంలో విడుదలకానున్న నోటిఫికేషన్ల వివరాలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం...
UPSC
యూపీఎస్సీ: బ్రిటిష్ పాలనలో సివిల్ సర్వీసెస్ ద్వారా ప్రతిభగలవారిని ఐసీఎస్ కింద ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టేవారు. తదనంతర కాలంలో అనేక మార్పులు చోటుచేసుకుని స్వాతంత్య్రానంతరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా మారింది.
-భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 320 పేర్కొన్న విధంగా యూపీఎస్సీని ఏర్పాటు చేశారు.

యూపీఎస్సీ విధులు

-దేశంలోని ఆయా శాఖలకు సంబంధించిన సర్వీసెస్ పరీక్షల నిర్వహణ, నియామకం చేస్తుంది.
-ఇంటర్వ్యూల ద్వారా నేరుగా ఎంపిక ప్రక్రియలు చేపడుతుంది.
-పదోన్నతులు, డిప్యూటేషన్, అబ్సార్షన్ ద్వారా ఆఫీసర్ల ఎంపికను చేపడుతుంది.
-పలు రకాల సర్వీసులకు సంబంధించిన నియామక నిబంధనలను, మార్పులను నిరంతర ప్రక్రియగా యూపీఎస్సీ చేస్తుంది.

ఏయే కొలువులను భర్తీ చేస్తుంది?

-ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్, సీడీఎస్, సీఐఎస్‌ఎఫ్ ఎగ్జామినేషన్, సీఐఎస్‌ఎఫ్ ఏసీ (ఎగ్జిక్యూటివ్) ఎల్‌డీసీఈ, ఎన్‌డీఏ& ఎన్‌ఏ, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఐఎఫ్‌ఎస్, ఐఈఎస్/ఐఎస్‌ఎస్, ఎస్‌వో/స్టెనో (జీడీ బీ)ఎల్‌డీసీఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షల నిర్వహణ ప్రక్రియను చేపడుతుంది.

2019-20లో రానున్న నోటిఫికేషన్లు

-ఎన్‌డీఏ&ఎన్‌ఏ ఎగ్జామినేషన్ (II)-2019 - ఆగస్టు 7
-ఎస్‌వో/స్టెనో (జీడీ-బీ/జీడీ-1) ఎల్‌డీసీఈ- సెప్టెంబర్ 18
-ఇంజినీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ)2020- సెప్టెంబర్ 25
-కంబైన్డ్ జియో-సైంటిస్ట్ ఎగ్జామినేషన్ 2020- సెప్టెంబర్ 25
-సీడీఎస్ (I) ఎగ్జామినేషన్ 2020 - అక్టోబర్ 30
-సీఐఎస్‌ఎఫ్ ఏసీ ఎల్‌డీసీఈ -2020 - డిసెంబర్ 4, 2019
-ఎన్‌డీఏ&ఎన్‌ఏ ఎగ్జామినేషన్ (I)-2020 - జనవరి 8
-సివిల్ సర్వీసెస్, ఐఎఫ్‌ఎస్ (ప్రిలిమ్స్), 2020- ఫిబ్రవరి 12, 2020
-ఐఈఎస్/ఐఎస్‌ఎస్ 2020 - మార్చి 25
-కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ 2020 - ఏప్రిల్ 8, 2020
-సీఏపీఎఫ్ (ఏసీ) 2020- ఏప్రిల్ 22, 2020
-ఎన్‌డీఏ&ఎన్‌ఏ (II) 2020- జూన్ 10, 2020
-సీడీఎస్ (II) 2020- 5 ఆగస్టు, 2020
-ఎస్‌వో/స్టెనో ఎల్‌డీసీఈ- సెప్టెంబర్ 16
-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

1108
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles