గుండ్రని నోరు ఉండి దవడలు లేని జీవులు?


Wed,July 3, 2019 01:11 AM

Biodiversity
-జూన్ 26 తరువాయి
సీతాకో క చిలుక(Butterfly)

-వీటి అధ్యయనాన్ని లెపిడాప్టెరాలజి అంటారు.
-వీటి ఆహారం మకరందం (తేనె).
-మిడత (Grosshopper)/ లోకస్ట్ (Locusts)
-ఇవి సమూహాలతో వచ్చి పంటలను నాశనం చేస్తాయి.
Larva

లెపిస్మా (సిల్వర్‌పిష్/Book worm)


-ఇది జీవితకాలం నీరు తాగదు
-ఇది పాతపుస్తకాలు, పటాల ఫ్రేములు (ఫొటో ఫ్రేములు) లాంటి వాటి మధ్యలో ఉంటుంది.
-దీని విసర్జక పదార్థం- గ్వానైన్

ఎఫిడ్ (Aphid)


-ఈ కీటకం మొక్కల రసాలపై ఆధారపడుతుంది
నోట్: పెరిపేటస్‌ను అనెలిడా, ఆర్థ్ధ్రోపొడాకు మధ్య సంధాన సేతువు (connecting link) అంటారు. ఎందుకంటే దీనిలో అనెలిడా, ఆర్థ్రోపొడా జీవుల లక్షణాలు ఉంటాయి.

మొలస్కా ( Mollusca)


Larva1
-దీని అధ్యయనాన్ని మెలకాలజి అంటారు
-ఇది 2వ అతిపెద్ద వర్గము
-ఇవి మెత్తటి శరీరాన్ని కలిగి ఉంటాయి. ఈ మెత్తటి శరీరం కాల్షియం కార్బోనేట్‌తో నిర్మితమైన కర్పరాలను కలిగి ఉంటాయి.
-కర్పరాల గురించిన అధ్యయనం-కాంకాలజి
-ఇవి భూచరాలు/జలచరాలు
-వీటిలో స్పష్టమైన తల, కండరయుత పాదం, అంతరంగ సముదాయాన్ని కలిగి ఉంటాయి. వీటి అంతరంగ సముదాయాన్ని కప్పి ఉంచుతూ ఒక మృదువైన స్పంజికలాంటి ప్రావారం (mantle/pallium) ఉంటుంది. ఇది కర్పరాన్ని ఏర్పరుస్తుంది.
-వీటిలోని కొన్ని జీవుల్లో ఆస్యకుహరంలో ఆకురాయిలాంటి నిర్మాణం ఉంటుంది. దీనిని రాడ్యులా అంటారు. ఇది ఆహారాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగపడుతుంది.
-వీటిలో ఓస్ప్రేడియం అనే జ్ఞానాంగం ఉండి నిటి స్వచ్ఛతను పరీక్షించడానికి తోడ్పడుతుంది.
-వీటి రక్తంలో రాగి(Cu)ని కలిగిన హీమోసయనిన్ అనే శ్వాస వర్ణకం ఉంటుంది. ఈ కారణంగా వీటి రక్తం నీలి వర్ణంలో ఉంటుంది.
-వీటిలో కొన్నింటియందు ఇంక్‌గ్లాండ్ (ముషిరగోణి) ఉండి రక్షణలో తోడ్పడుతుంది.
-మొలస్కాలోని గ్యాస్ట్రోపొడా జీవుల్లో మెలిక (టార్షన్) అనే ప్రక్రియ కనపడుతుంది
-మొలస్కాలోని ఈ గ్యాస్ట్రోపొడా జీవుల నుంచే ముత్యాలు (pearls) ఉత్పత్తి అవుతాయి.
-ముత్యాలను ఉత్పత్తి చేసే జీవి-పింక్టాడా వల్గారిస్
-కృత్రిమంగా ముత్యాలను తయారు చేసే విధానాన్ని Pearl culture (ముత్యపు సంవర్ధనం) అంటారు.

ఉదాహరణ


-నత్త (పైలాగ్లొబోసా)-దీనిని ఏపిల్ నత్త అంటారు
-పింక్టాడా (ముత్యపు చిప్ప)
-సెపియా (కటిల్‌ఫిష్)- దీని నుంచి లభ్యమయ్యే ఇంక్‌ను ఔషధంగా వాడుతారు
-ఆక్టోపస్ (దెయ్యపుచేప)- దీనిలో కర్పరం ఉండదు
-ఎప్లీసియా (సముద్ర చెవులపిల్లి)
-డోరిస్ (సముద్ర నిమ్మకాయ), డెంటాలియం
-యూనియో (మంచినీటి ఆల్చిప్ప)
-మైటిలస్ (సముద్ర ఆల్చిప్ప)
-ఆర్కిట్యూథిస్ (బృహత్ స్కిడ్)- అతి పెద్ద సజీవ అకశేరుకం
-టెరిడో (Wood borer)- ఇది పడవలకు రంధ్రాలు చేస్తుంది
-లాలిగో (Squid)

10. ఇఖైనోడర్మేటా (Echino dermata)


-ఇఖైనో అంటే ముళ్లు అని, డెర్మా అంటే చర్మ అని అర్థం
-వీటిని ముళ్ల వంటి చర్మం గల జంతువులు అంటారు
-ఇవి సముద్రపు నీటిలో మాత్రమే నివసిస్తాయి
-వీటి ప్రౌఢజీవులు వ్యాసార్థ సౌష్టవాన్ని (radial symmetry) ప్రదర్శిస్తాయి.
-ఈ జీవుల విశిష్ట లక్షణం జలప్రసరణ వ్యవస్థ/ అంబులేక్రల్ వ్యవస్థను కలిగి ఉంటాయి. ఇది చలనానికి, ఆహారాన్ని పట్టుకోవడానికి, ఆహార రవాణకు, శ్వాసక్రియకు తోడ్పడుతుంది.
-ఈ జీవులలో ప్రత్యేక విసర్జక అవయవాలు ఉండవు
-ఈ జీవులకు అధిక పునరుత్పత్తి శక్తి ఉంటుంది.
ఉదా..
-స్టార్‌ఫిష్ (సముద్ర నక్షత్రం)- అలంకరణ కోసం అక్వేరియంలో పెంచుతారు
-నియోమెట్రా (ఫెదర్ స్టార్)
-ఒఫియోథ్రిక్స్ (స్పైనీ బ్రిటిల్ స్టార్)
-గార్గానో సెఫాలస్ (బాస్కెట్ స్టార్)
-ఇఖైనోడిస్కస్ (సాండ్ డాలర్)
-ఇఖైనోకార్డియం (హార్ట్ ఆర్చిన్)
-క్లెపియాస్టర్ (కేక్ ఆర్చిన్)
-హలో థూరియా (సీకుకుంబర్/సముద్ర దోసకాయ)

11. హెమికార్డేటా (Hemichordata)


-వీటిని అర్ధసకశేరుకాలు అని కూడ అంటారు
-వీటిని పూర్వం కార్డేటా వర్గంలో ఒక ఉపవర్గంగా పరిగణించారు. కానీ ఇప్పుడు అకశేరుకాలలో ఒక ప్రత్యేక వర్గంగా చేర్చారు.
-వీటి దేహం పూర్వాంతంలో తుండం (probhosis) కాలర్ (collar) పొడవైన మొండెం (trunk)గా ఉంటుంది.
-శ్వాసక్రియ మొప్పల ద్వారా జరుగుతుంది.
-విసర్జన ముఖపూర్వ తుండ గ్రంథుల ద్వారా జరుగుతుంది.
ఉదా: బెలనోగ్లాసస్ (ఎకార్న్ వర్మ్), సాకోగ్లాసస్, టైకోడెరా, రాబ్డోఫూరా, సెఫలోడిస్కస్

సకశేరుకాలు/కార్డేటా


-పృష్టవంశం (notochord), పృష్టనాళికాయుత నాళికాదండం (dorsal hallow nerve cord), గ్రసనీ మొప్పచీలికలు/రంథ్రాలు (pharyngeal gill slitsl clefts)
Larva2
పాయు పరిపుచ్ఛం (post-anal tail) లాంటి లక్షణాలను కలిగిఉన్న జంతువులను కార్డేటా అంటారు.
-ఇవి పైలక్షణాలతో పాటు ద్విపార్శ సౌష్టవాన్ని, త్రిస్తరిత లక్షణాన్ని, ఎంటిరోసిలిక్ శరీరకుహరం అవయవస్థాయి వ్యవస్థీకరణ వంటి లక్షణాలను కలిగి ఉంటాయి.
-కార్డేటా వర్గాన్ని 3 ఉపవర్గాలుగా విభజించవచ్చు. అవియూరోకార్డేటా/ట్యూనికేటసెఫలోకార్డేటావర్టిబ్రేట (సకశేరుకాలు)
-యూరోకార్డేటా, సెఫలోకార్డేటా రెండింటిని కలిపి ప్రోటోకార్డేటా (Proto chordata) అంటారు.

యూరోకార్డేటా (Urochordata/ tunicata)


-ఇవి సముద్ర జంతువులు
-వీటిలో పృష్టవంశం (notochord) అనేది లార్వా (డింబకం) తోకలో మాత్రమే ఉంటుంది. ఆ కారణంగానే వీటికి యూరోకార్డేటా అనే పేరు వచ్చింది.
ఉదా: ఎసీడియా, సాల్పా, డొలియోలం
సెఫలోకార్డేటా (cephalo cordata)
-పృష్టవంశం (noto choral) అనేది తల నుంచి తోక వరకు జీవితకాలం అంతా ఉంటుంది. వీటిలో పృష్టవంశం తల వరకు ఉండటంతో వీటికి సెఫెలోకార్డేటా అనే పేరు వచ్చింది.
Larva3
ఉదా: బ్రాంకియోస్టోమా (ఆంఫియాక్సస్/ లాన్స్‌లెట్)

వర్టిబ్రేట (సకశేరుకాలు)/ క్రేనియేట


-వీటిలో పిండదశలో పృష్టవంశం (Notochord) ఉండి ప్రౌడదశలో పృష్టవంశం స్థానంలో మృదులాస్థి/ అస్థి నిర్మిత వెన్నెముక/ కశేరుదండం ఏర్పడుతుంది.
-పృష్ట వంశం ఉన్న జీవులను కార్డేటా అని, పృష్టవంశం స్థానంలో వెన్నెముక/కశేరుదండం ఏర్పడిన జీవులను సకశేరుకాలు (vertrbrates) అని అంటారు.
-పై కారణంగా అన్ని సకశేరుకాలు కార్డేటాలే, కాని కార్డేటాలన్ని సకశేరుకాలు కావు.
-సకశేరుకాలు కండరయుతమైన ఉదర హృదయాన్ని కలిగి ఉంటాయి.
-వీటి హృదయంలో రెండు/మూడు/ నాలుగు గదులు ఉంటాయి.
-వీటిలో మూత్రపిండాలు విసర్జన, ద్రవాభిసరణ క్రమతలో తోడ్పడుతాయి.
-ఈ ఉపవర్గం వర్టిబ్రేటాను (సకశేరుకాలు) దవడలు ఉండటం, లేకపోవడాన్ని ఆధారంగా చేసుకోని 2 విభాగాలుగా విభజించవచ్చు.
-ఏనేత (Agnatha) అహనుకశేరుకాలు
-నేతోస్టొమేట (Gnathostomata) హనుకశేరుకాలు

ఏనేత (Agnatha )


-వీటిని అహనుకశేరుకాలు అంటారు.
-ఇవి దవడలు లేని చేపల లాంటి జలచర సకశేరుకాలు
-వీటిని రెండు రకాలుగా విభజించారు. అవి..
-ఆస్ట్రకోడర్మి (ఇవి విలుప్తం/ అంతరించినాయి)
-సైక్లోస్టొమేట (జీవించి ఉన్నాయి)

సైక్లోస్టొమేట (Cyclostomes)


-Cyclos అంటే వర్తుల/ గుండ్రని అని, stoma అంటే నోరు అని అర్థం. గుండ్రని నోరుగల దవడలు లేని జంతువులను సైక్లోస్టోమ్స్ అంటారు.
-ఇవి అహను (Jawless) సకశేరుకాలు
-ఇవి మంచినీరు/సముద్ర జలాల్లో నివసిస్తాయి.
-వీటిలో 6-15 జతల మొప్ప చీలికలు ఉండి శ్వాసక్రియలో తోడ్పడుతాయి.
-వీటిలో హృదయం రెండు గదులతో ఉంటుంది.
ఉదా : పెట్రోమైజాన్( లాంప్రే)మిక్సిన్ (హాగ్ చేప/ ైస్లెమ్ ఈల్)
-పెట్రోమైజాన్‌లు సముద్రం నుంచి నదులకు గుడ్లు పెట్టడానికి ప్రవాసం చెందుతాయి (ఎనడ్రోమస్ వలస). ఇవి గుడ్లు పెట్టిన తర్వాత మరణిస్తాయి. వీటి గుడ్లు అభివృద్ధి చెంది అమ్మోసీటస్ డింబకం ఏర్పడి, రూపవిక్రియ చెంది ప్రౌడజీవిగా మారిన తర్వాతత సముద్రానికి తిరిగి చేరుతుంది.
-మిక్సిన్‌లు పూర్తిగా సముద్రజీవులే. ఇవి చనిపోయిన/చనిపోతున్న చేపలను తింటాయి. దీనిలో ప్రత్యక్ష పిండాభివృద్ధి జరుగుతుంది. దీన్ని కలత పెట్టినప్పుడు శ్లేష్మకోశాల నుంచి పాలలాంటి ద్రవాన్ని విడుదల చేస్తుంది. నీటిని తాకగానే ఇది జిగురుగా మారుతుంది.

నేతోస్టొమేట (Gnathostomata)


-Gnathos అంటే దవడ, stoma అంటే నోరు అని అర్థం
-ఇవి దవడలు గల సకశేరుకాలు
-దీనిలో వాజాలు (Fins) కలిగిన చేపలు (pisces) అంగాలు (limbs) కలిగిన చతుష్పాదులు (tetrapodes) ఉన్నాయి.
-యూరోకార్డేటా, సెఫలోకార్డేటా రెండిని కలిపి క్రేనియేట అంటారు. (మెదడును ఆవిరించి కపాలం లేనటువంటి జీవులను ఏక్రేనియేట, మెదడును ఆవరించి కపాలం ఉన్న జీవులను క్రేనియేట అంటారు)
mallesh

1017
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles