200 ఖాళీలు రాయ్‌పూర్ ఎయిమ్స్


Wed,July 3, 2019 12:43 AM

రాయ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
AIIMS-Bhopal
-మొత్తం పోస్టులు- 200 (జనరల్-79, ఈడబ్ల్యూఎస్-20, ఓబీసీ-56, ఎస్సీ-29, ఎస్టీ-16)
-పోస్టు పేరు: స్టాఫ్ నర్స్ (గ్రేడ్ -2)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నాలుగేండ్ల బీఎస్సీ ఆనర్స్/నర్సింగ్ లేదా బీఎస్సీ (పోస్టు సర్టిఫికెట్), బీఎస్సీ నర్సింగ్ (పోస్టు బేసిక్) లేదా జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫరీ డిప్లొమాలో ఉత్తీర్ణత. 50 బెడ్‌లు కలిగిన ఏదైన హాస్పిటల్/హెల్త్‌కేర్ హాస్పిటల్‌లో స్టాఫ్ నర్స్‌గా రెండేండ్లపాటు పనిచేసిన అనుభవం ఉండాలి. నర్స్ & మిడ్‌వైఫరీలో సెంట్రల్/స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వం లేదా రిజిస్ట్రేషన్సర్టిఫికెట్ ఉండాలి.
-పే స్కేల్: రూ. 44,900-1,42,400/-
-వయస్సు: 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ఓబీసీలకు రూ.1000/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 800/- పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్/ రాతపరీక్ష
-ఆన్‌లైన్ పరీక్షలో 100 ప్రశ్నలు-100 మార్కులకుగాను 90 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. దీనిలో సంబంధిత నర్సింగ్ సబ్జెక్టు నుంచి 80 ప్రశ్నలు, జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్‌నెస్-10 ప్రశ్నలు, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ నర్సింగ్ ఇన్ఫర్మాటిక్స్-10 ప్రశ్నలు ఇస్తారు.
-అభ్యర్థులు రాత పరీక్షలో సంస్థ నిర్ణయించిన కనీస అర్హత మార్కులను సాధించాలి.
-ప్రతి తప్పు జవాబుకు 1/4 మార్కులను తగ్గిస్తారు.
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 21
-వెబ్‌సైట్: www.aiimsraipur.edu.in

388
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles