ప్రకృతి సిద్ధంగా ఏర్పడే ఖనిజ నిర్మిత ఘన పదార్థం?


Wed,June 19, 2019 02:49 AM

earth

భూ ప్రావారం

- దీన్ని మెసోస్పియర్ అని కూడా పిలుస్తారు.
- ఇది భూమి మధ్య పొర. భూ పటలం నుంచి సగటున 2865 కి.మీ. లోతు వరకు విస్తరించి ఉంటుంది. అంటే దీని మందం 2900 కి.మీ.
- ఈ పొర భూమి అంతర్భాగంలో దాదాపు 16 శాతం ఆక్రమించి ఉంది.
- దీని ఘనపరిమాణం 16 శాతం (భూమి ఘనపరిమాణంలో).
- భూ ప్రావారం భౌతికస్థితిని అనుసరించి రెండు భాగాలుగా విభజించారు. అవి...

బాహ్య ప్రావారం

- దీన్ని ఏస్థినోస్పియర్ అంటారు. దీని సాంద్రత 3-3.5
- బాహ్య ప్రావారం ఘనస్థితిలో ఉంటుంది.
- ఇందులో ఆలివైన్స్, పైరోగ్సీన్స్, గార్నెట్స్, సిలికా, మొదలైన సిలికేట్లు ఎక్కువగా ఉన్నాయి.

- బాహ్య ప్రావారానికి, అంతర్ ప్రావారానికి మధ్య గొలిటిసిస్‌పొర ఉంటుంది.
- భూ పటలం, భూప్రావారం మధ్య సరిహద్దును మెహరోవిసిక్ విచ్ఛన్న పొర అని పిలుస్తారు. (భూకంప శాస్త్రజ్ఞుడు ఆండ్రిజా మొహిరోవిసిక్ పేరుమీదుగా ఈ పొరను పిలుస్తున్నారు)


అంతర్‌ప్రావారం

- దీన్ని మిసోస్పియర్ అంటారు. దీని సాంద్రత 4.5
- అంతర్ ప్రావారం నుంచి ద్రవస్థితి ప్రారంభమవుతుంది.
- ఇందులో ఇనుముకు సంబంధించిన ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.

భూ కేంద్రమండలం

- దీన్ని బారిస్పియర్ అని పిలుస్తారు.
- ఇది లోపలి పొర. భూ ప్రావారం నుంచి అంటే 286 కి.మీ. నుంచి 636 కి.మీ. లోతు వరకు విస్తరించి ఉన్నది. అంటే దీని మందం 3500 కి.మీ.
- దీని ఘనపరిమాణం దాదాపు 83 శాతం వరకు ఆక్రమించి ఉంది. (ఇది అత్యంత మందమైన పొర)
- భూ కేంద్రంలో ప్రధానంగా నికెల్ (80 శాతం), ఫెర్రస్ (30 శాతం) ఉన్నాయి. వీటి మొదటి అక్షరాలను కలిపి నిఫె (NIFE) అని పిలుస్తారు.
- భూకంప తరంగాల ప్రవర్తననుబట్టి లేహమాన్ డెన్మార్క్ అనే భూకంప శాస్త్రజ్ఞురాలు భూ కేంద్రాన్ని రెండు భాగాలుగా విభజించారు. అవి..

బాహ్య భూకేంద్రమండలం

- ఇది లోహరూప ద్రవపొర. దీని మందం 286 కి.మీ.-5150 కి.మీ.
- ఈ పొరలో ఇనుము, నికెల్ వంటి లోహాలు ద్రవరూపంలో ఉంటాయి.
- ఈ పొరలో మాగ్మా అనే ద్రవ పదార్థం ఉందని శాస్త్రజ్ఞులు అంచనావేస్తున్నారు.

- భూప్రావారం, భూ కేంద్రమండలం మధ్య సరిహద్దు పొరను గుటెన్‌బర్గ్ విచ్ఛిన్నత (Gutenberg discontinuity) అంటారు.

అంతర భూకేంద్ర మండలం- ఇది ఘనరూపంలో ఉండే లోపలి భాగం.
- దీనిమందం 5150 కి.మీ.-6365 కి.మీ.
- ఈ పొరలో ఇనుము, లోహ మిశ్రమాలు, బంగారం వంటి భార పదార్థాలు ఉంటాయి.

శిలలు

- మండుతున్న సూర్యగోళం నుంచి అనూహ్య పరిస్థితుల్లో వేరుపడి, చల్లారి, ఘనీభవించడం వల్ల భూగోళం ఏర్పడింది.
- విశ్వంలో జీవాయుతగ్రహం భూమి.
- మండుతున్న సూర్యగోళం నుంచి వేరుపడుతున్నప్పుడు ఇది వాయు స్థితిలో ఉంది. నెమ్మదిగా చల్లబడటం వల్ల ఘనీభవించి, ఘనస్థితిలోకి వచ్చింది. అందువల్ల భూమి ఉపరితలం గట్టిపడి కోడిగుడ్డు పెంకులా తయారైంది.
- భూ ఆవిర్భావం గురించి భిన్న అభిప్రాయాలున్నప్పటికీ భూవిజ్ఞాన శాస్త్ర ప్రకారం భూగోళం సుమారు 4500 మి. ఏండ్లనాడు ఆవిర్భవిస్తే, దానిపై శిలలు తొలిసారిగా 700-3600 మి. ఏండ్ల మధ్యకాలంలో ఏర్పడ్డాయి. అంటే భూమి పుట్టిన 1000 మి. ఏండ్ల తర్వాత భూమి మీద తొలిసారిగా శిలలు ఆవిర్భవించాయి.

శిల

- భూ పటలానికి సంబంధించి ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ఖనిజ నిర్మిత ఘన పదార్థాన్ని శిల అంటారు.
- ప్రకృతిలో ఇప్పటివరకు 2 వేలకుపైగా మూలకాలను కనుగొంటే భూపటలంలో 50 మూలకాలు మాత్రమే ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైనవి 10 మూలకాలు మాత్రమే.
- ఒకే ఖనిజంతో తయారైన శిలను ఏకఖనిజ శిల అంటారు. దీనికి ఉదాహరణ డ్యూనైట్. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఖనిజాలతో ఏర్పడిన శిలను బహుఖనిజ శిల అంటారు. ఉదాహరణ గ్రానైట్.

శిలల వర్గీకరణ

- శిలలను స్వీడన్‌కు చెందిన లిన్నేయస్ మొదటిసారి వర్గీకరించాడు. ఇతడు 1770లో రాసిన సిస్టమ్స్ నేచురే అనే గ్రంథంలో వృక్షాలు, జంతువులు మొదలైన వాటిని వర్గీకరించిన అపార అనుభవంతో శిలావరణంపై ఉన్న శిలలను కూడా వర్గీకరించాడు.
- శిలలను వాటి పుట్టుక ఆధారంగా మూడు రకాలుగా వర్గీకరించాడు..

ramesh1

అగ్నిశిలలు

- వీటిని ఆది శిలలు లేదా మాతృ శిలలు అంటారు.
- ఇవి అగ్ని/నిప్పు మూలంగా ఏర్పడ్డాయి.
- భూమి అంతర్భాగంలో అత్యంత వేడిగా ఉన్న మాగ్మా అనే శిలాద్రవం అగ్నిపర్వత బిలం (క్రేటర్) ద్వారా బయటికి వచ్చి (లావా) చల్లబడి, ఘనీభవించి శిలగా మారడం ద్వారా ఈ శిలలు ఏర్పడతాయి.
- ఇవి భూమిపై మొదటగా ఏర్పడ్డ శిలలు. అందువల్ల వీటిని ఆదిశిలలు (Primary rocks) అని పిలుస్తారు.
- అగ్ని శిలల నుంచి అవక్షేప, రూపాంతర శిలలు ఆవిర్భవిస్తాయి. వాటికి మాతృక అగ్నిశిలలే. కాబట్టి వీటిని మాతృ శిలలు అనికూడా అంటారు.
- మాగ్నా అనే శిలాద్రవం వల్ల అవక్షేప, రూపాంతర శిలలు ఏర్పడటమే కాకుండా మాగ్మాద్రవం భౌతిక, రసాయన లక్షణాలపై ఈ శిలల లక్షణాలు ఆధారపడి ఉంటాయి.
ఉదా: మాగ్మా ద్రవంలో ఆమ్ల ధర్మాలు అధికంగా ఉంటే ఈ శిలల్లో కూడా ఆమ్ల ధర్మాలు ఎక్కువగా ఉంటాయి. మాగ్మా ద్రవంలో క్షార ధర్మాలు అధికంగా ఉంటే ఈ శిలల్లో కూడా క్షార ధర్మాలు ఎక్కువగా ఉంటాయి.
- అగ్నిశిలలు ఏర్పడే విధానాన్ని బట్టి రెండు రకాలు. అవి బాహ్యఅగ్ని శిలలు, అంతర్గత అగ్నిశిలలు.

బాహ్య అగ్నిశిలలు

- భూమి అంతర్భాగంలో ఉన్న మాగ్మా అనే శిలాద్రవం భూ అంతర్భాగం నుంచి బయలుదేరి అగ్నిపర్వత బిలం ద్వారా భూమి ఉపరితలానికి వచ్చి తొందరగా చల్లబడటం వల్ల ఏర్పడే శిలలను బాహ్య అగ్నిశిలలు అని పిలుస్తారు.
- ఇవి లావా వల్ల ఏర్పడ్డాయి కాబట్టి వీటిని అగ్నిపర్వత శిలలు అనికూడా పిలుస్తారు.
- వీటిలో చిన్నచిన్న స్పటికాలు ఉంటాయి. ఇవి తొందరగా చల్లబడుతాయి.
ఉదా: బసాల్ట్స్, ఆండిసైట్, ఒబ్స్‌డియన్, రాయోలైట్.

అంతర్గత అగ్నిశిలలు

- భూమి అంతర్భాగంలో ఉన్న మాగ్మా అనే శిలాద్రవం, భూమి ఉపరితలానికి రావాలని ప్రయత్నించి పైకి రాలేక, మార్గ మధ్యంలో ఎక్కడో ఒక అనుకూలమైన చోట నెమ్మదిగా చల్లబడి ఘనీభవించడం ద్వారా ఇవి ఏర్పడతాయి.
- ఇవి ముద్దగా ఉంటాయి. వీటిలో పెద్ద పెద్ద స్పటికాలు ఉంటాయి.
- ఇవి నెమ్మదిగా చల్లబడుతాయి.
ఉదా: గ్రానైట్, గాబ్రో, డయోరైట్, డొలిరైట్
- అంతర్గత అగ్ని శిలలు ఏర్పడే చోటును, చల్లబడటానికి తీసుకున్న సమయాన్ని ఆధారంగా చేసుకుని వాటిని తిరిగి రెండు రకాలుగా విభజించవచ్చు. అవి.. పాతాళశిలలు, ఉపపాతాళ శిలలు

పాతాల శిలలు

- భూమి అంతర్భాగంలో చాలా లోతున ఏర్పడుతాయి.
- మాగ్మా అనే శిలాద్రవం చాలా లోతులో ఉండటం వల్ల భూమిపైకి రాలేక లోలోపలే ఎక్కడో నెమ్మదిగా చల్లబడి, ఘనీభవించడం ద్వారా ఇవి ఏర్పడతాయి.
ఉదా: గ్రానైట్, డయోరైట్, గాబ్రో, పెరిడోటైట్

ఉపపాతాళ శిలలు

- భూమి లోపల ఉన్న మాగ్మా ద్రవం మార్గ మధ్యలో ఉన్న పగుళ్లలో ఇరుక్కొని (భూమి ఉపరితలానికి రావాలని ప్రయత్నించి రాలేక మార్గమధ్యలో) నెమ్మదిగా చల్లబడటం వల్ల ఉపపాతాల శిలలు ఏర్పడుతాయి.
- ఇవి భూమిలోపల ఉన్న పగుళ్లు, రంధ్రాలు, ఖాళీ ప్రదేశాలు మొదలైన వాటి ఆకారాల బట్టి రకరకాల ఆకారాలున్న శిలలు ఏర్పడతాయి.
- ఇవి బాహ్య అగ్నిశిలలు, పాతాళ శిలల మధ్య ఏర్పడతాయి.
ఉదా: గ్రానొపైల్, పొరిఫిరైస్, డోలరైట్.

ప్రాక్టీస్ బిట్స్

1. కిందివాటిలో మందమైన పొర? (2)

1) భూపటలం
2) భూ ప్రావారం
3) బయటి కేంద్రభాగం
4) లోపలి కేంద్రభాగం

2. తక్కువ మందమైన పొర? (1)

1) భూపటలం
2) భూప్రావారం
3) భూకేంద్రమండలం
4) ఏదీకాదు

3. అత్యంత బరువైన పొర? (4)

1) లిథోస్పియర్
2) అస్థినోస్పియర్
3) మిసోస్పియర్
4) బారోస్పియర్

4. భూప్రావారం పై పొరను ఏమంటారు? (2)

1) బారోస్పియర్
2) లిథోస్పియర్
3) అస్థినోస్పియర్
4) మిసోస్పియర్

5. భూపటలానికి, భూ ప్రావారానికి మధ్య పొర? (2)

1) కన్రాడ్
2) మొహొరొవిక్
3) గుటెన్‌బర్గ్
4) గొలిటిసిస్

ramesh

427
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles