జీవసందీప్తిని ప్రదర్శించే అనెలిడా జీవి?


Wed,June 19, 2019 02:35 AM

swallowtail

(జూన్ 12 తరువాయి) ప్రవాళాలు

- సీలెంటిరేటా జీవుల శరీరం కాల్షియం కార్బోనేట్ (CaCo3) నిర్మితం
- సీలెంటిరేటా జీవులు స్రవించిన కాల్షియం కార్బోనేట్ నిలువలను ప్రవాళాలు అంటారు.
- ఇవి ఉష్ణమండల సముద్రాల్లో (21 సెంటిగ్రేడ్ వద్ద) ఎక్కువగా ఉంటాయి.
- ప్రవాళాలు చీకటి, చల్లని లోతైన ప్రాంతాల్లో ఏర్పడవు.
- ప్రవాళాలు మన దేశంలో ఎక్కువ సంఖ్యలో లక్ష్యద్వీప్‌లో ఉన్నాయి.
- మన దేశంలో అధిక వైవిధ్యం గల ప్రవాళాలు నికోబార్ దీవుల్లో ఉన్నాయి.
- ప్రపంచంలో అధిక వైవిధ్యం గల ప్రవాళాలు పసిఫిక్ మహాసముద్రంలోని ఫిజి దీవుల్లో ఉన్నాయి.

ప్రవాళ అవరోధం (Coral reef)

- అనేక ప్రవాళాలు కలిసి ఏర్పడిన దిబ్బను ప్రవాళ అవరోధం/ పగడపు దీవి అంటారు.
- అతిపెద్ద, పొడవైన ప్రవాళ అవరోధం-great barrier reef (ఆస్ట్రేలియా) (10 మైళ్లు విస్తరించి ఉన్నది)
- ట్యుబిఫెరాను ఆర్గాన్ పైప్ కోరల్ అంటారు. దీన్ని మందుల తయారీలో ఉపయోగిస్తారు.

4. టీనోఫొరా (Ctenophora)

- టీనోఫొరా జీవులను సాధారణంగా సీవాల్‌నట్స్ (sea walnuts) లేదా కోంబ్ జెల్లీలు (comb jellies) లేదా సీ గూస్ బెర్రీలు (sea gooes berries) అని పిలుస్తారు.
- ఇవి కేవలం సముద్రజలాల్లో నివసిస్తాయి.
- ఇవి కణజాలస్థాయి కలిగిన ద్విస్తరిత జీవులు.
- వీటి శరీర బాహ్యతలం మీద ఎనిమిది వరుసల శైలికామయ కంకాకార ఫలకాలు (combplates) ఉంటాయి. ఇవి గమనానికి తోడ్పడుతాయి. అందువల్ల వీటికి టీనోఫొరా అనే పేరు వచ్చింది.
- వీటిలో దంశకణాలు ఉండవు కాని ఒక విధమైన జిగురు కణాలు (glue cells) ఉంటాయి. ఈ కణాలనే లాసో కణాలు (lasso cells)/ కోలోబ్లాస్ట్‌లు (collo blasts) అని కూడ అంటారు. ఇవి ఆహారాన్ని పట్టుకోవడానికి తోడ్పడుతాయి.
- టీనోఫొరాలో జీవసందీప్తి (సజీవులు కాంతిని వెలువరించటం) అత్యున్నత స్థాయిలో కనబడుతుంది.
- ఇవి ఉభయలింగ జీవులు, ప్రత్యుత్పత్తి లైంగికంగా మాత్రమే జరుగుతుంది.
ఉదా: ఫ్లూరో బ్రాకియా, హర్మిఫొరా, టీనోప్లానా, బెరో

5. ప్లాటీహెల్మెంథిస్ (Platyhelminthes)

- ప్లాట్ అంటే బల్లపరుపు అని హెల్మెంథ్స్ అంటే పురుగులు అని అర్థం.
- ఈ జీవుల దేహం పృష్టోదరాలు అణిగి ఉంటుంది. ఈ కారణంగా వీటిని బల్లపరుపు పురుగులు (flat wormes) అంటారు.
- ఇవి ద్విపార్శ సౌష్టవం కలిగిన మొదటి జీవులు.
- ఇవి మొట్టమొదటి త్రిస్తరిత జీవులు.
- ఇవి మొట్టమొదటి అవయవస్థాయి జంతువులు
- వీటిలో జ్వాలా కణాలు (Flame cells) ఉండి ద్రవాభిసరణ క్రమతలో, విసర్జన క్రియలో తోడ్పడుతాయి.
- ఇవి ఎక్కువగా అంతర పరాన్నజీవులు. వీటిలో కొక్కేలు (Hooks), చూషకాలు (Suckers) ఉంటాయి.
- ఈ పరాన్న జీవుల్లో ప్రిమ్యుటేషన్ ఉంటుంది. అంటే ఒక పరాన్న జీవిలోపల ఉన్నప్పుడు మరొక దాన్ని లోపలకు రానివ్వకుండా నిరోధించడం.

ఉదా:

- ప్లనేరియా- దీనిలో పునరుత్పత్తి అధిక స్థాయిలో ఉంటుంది
- టీనియాసోలియం(Pork tape worm)
- టీనియాసాజినేట (Beaf tale worm)
- ఫాసియోలా హెపాటికా (లివర్‌ఫ్లూక్)- గొర్రెల్లో లివర్ రాట్ వ్యాధిని కలిగిస్తుంది.
- షిస్టోసోమా/ బిల్హార్జియా (blood fluke)
- ఇఖైనోకోకస్ గ్రాన్యులోసస్ (Dog tape worm)

7. అనెలిడా (Annelida)

- అన్యులస్ అంటే చిన్నవలయాలు/ ఖండితాలు అని అర్థం
- ఈ జీవుల శరీరంపై వలయాకార ఖండితాలు (అన్యుల్స్) ఉండటం వలన వీటికి అనెలిడా అనే పేరు వచ్చింది.
- ఇవి జలచర/భూచర జీవులు
- ఇవి సాధారణంగా స్వేచ్ఛాజీవులు, కాని కొన్ని పరాన్నజీవులు.
- ఇవి సమఖండ విన్యాసాన్ని (metamerism) ప్రదర్శిస్తాయి.
- ఇవి మొట్టమొదటి నిజ శరీరకుహర జీవులు.
- మొట్టమొదట రక్తప్రసరణ వ్యవస్థ ఈ జీవులలోనే ఏర్పడింది.వీటిలో సంవృత రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది.
- వీటి దేహకుడ్యంలో వర్తుల కండరాలు, ఆయత కండరాలు ఉంటాయి. ఈ కండరాలు గమనానికి తోడ్పడుతాయి.
- నీరిస్ లాంటి జలచర అనెలిడా జీవులు పార్శ ఉపాంగాలను కలిగి ఉంటాయి. వీటిని పార్శ పాదాలు (parapadia) అంటారు. ఇవి ఈదడంలో సహాయపడతాయి. ఈ పార్శ పాదాలు ఈదడంతో పాటు శ్వాస క్రియలో కూడ తోడ్పడుతాయి.
- ఇవి ఏకలింగజీవులు (dioecious) (నేరిస్) కాని కొన్ని ఉభయలింగ జీవులు (monoecious) (వానపాము, జలగ)

ఉదా:

- నీరిస్ (ఇసుకుపురుగు/రాగ్‌వార్మ్/క్లామ్‌వార్మ్)
- పెరిటిమా (earth worm)
- హిరుడినేరియా (Blood sucking leach)
- ఎఫ్రొడైట్ (సముద్ర చుంచెలుక)
- అరెనికోలా (లగ్ వర్మ్)
- పాంటోబ్డిల్లా (సముద్ర జలగ)
- హిమడిప్సా (భూచర జలగ)
- పలాలో పురుగు- ఇది జీవసందీప్తిని ప్రదర్శిస్తుంది (చల్లని కాంతిని వెదజల్లడం)

వానపాము (Earth worm)

- వీటి పెంపకాన్ని వర్మికల్చర్ (vermi culture) అంటారు.
- వీటి ఎరువును వర్మికంపోస్ట్ అంటారు
- వానపాములను కృషీవలునికి మిత్రులు (friends of farmers) అంటారు
- ఇవి నేలలో బారియలు చేయటం వల్ల రంద్రాలు ఏర్పడి, నేలలోకి గాలి ప్రవేశిస్తుంది. దీంతో వానపామును సహజ నాగలి (natural tractor) అంటారు.
- వీటి క్రిమివిసర్జనల (warm casting) వల్ల నేల సారవంతమవుతుంది. వానపాములు భూమిని సారవంతం చేసే ప్రక్రియను వెర్మికంపోస్టింగ్ అంటారు.
- వానపాములను చేపలు పట్టడానికి ఎరగా వాడుతారు
- వానపాములను గౌట్ వ్యాధి చికిత్సలో వాడతారు.

జలగ (Leech)

- దీని శాస్త్రీయ నామం- హిరుడినేరియా
- ఇది రక్తాన్ని ఆహారంగా తీసుకుంటుంది (స్వాంగీవోరస్)
- ఇది జంతువులను కుట్టినప్పుడు లాలాజలం ద్వారా హిరుడిన్ అనే పదార్థం రక్తనాళాల్లోకి పోతుంది. ఫలితంగా కుట్టిన ప్రదేశంలో రక్తం గడ్డ కట్టదు.
- వైద్యరంగంలో జలగలను ఉపయోగించి చెడురక్తాన్ని తీసివేస్తారు. ఈ ప్రక్రియను ప్లిబోటమి అంటారు.

8. ఆర్థ్రోపొడా (Arthropoda)

- ఆర్థోస్ అంటే కీళ్లు/ అతుకులు అని, పొడా అంటే కాళ్లు అని అర్థం.
- ఈ వర్గంలో కీళ్లు/ అతుకులు గల కాళ్లు కలిగిన జీవులను చేర్చారు
- జంతురాజ్యంలో అతిపెద్ద వర్గం-ఆర్థ్రోపొడా
- భూమి మీద నామీకరించిన జాతుల్లో మూడింట రెండు వంతులపైన ఆర్థ్రోపొడా జీవులు కలవు. జంతు జాతులలో ఇవి 80 శాతం వరకు ఉంటాయి.
- వీటి దేహం ఖైటిన్ నిర్మిత బాహ్యాస్థిపంజరంతో కప్పి ఉంటుంది. ఇది దేహరక్షణకు, నీటి నష్టనివారణకు తోడ్పడుతుంది.
- వీటి దేహం ఖండితాలుగా విభజించబడి తల, ఉరం, ఉదరం అనే భాగాలను కలిగి ఉంటుంది.
- వీటి కండరాలు రేఖిత రకానికి చెందినవి. ఇవి వేగంగా చలించడానికి తోడ్పడుతాయి. (రేఖిత కండరాలు పరిణా మ క్రమంలో ప్రథమంగా ఆర్థ్రోపొడాలలోనే ఏర్పడ్డాయి)
- వీటిలో శ్వాసక్రియ మొప్పలు (gills), పుస్తకాకార మొప్పలు, పుస్తకాకార ఊపిరితిత్తులు/ వాయునాళాల లాంటి శ్వాస అవయవాల ద్వారా జరుగుతుంది.
- వీటి రక్తంలో రాగిని కలిగిన(Cu) హీమోసయనిన్ అనే శ్వాసవర్ణకం ఉంటుంది.
- వీటిలో విసర్జనక్రియ మాల్ఫీజియన్ నాళికలు హరిత గ్రంథులు (Green glands) కోక్సల్ గ్రంథుల ద్వారా జరుగుతుంది.
- ఇందులో జిఫొస్యురా, ఎరాక్నిడా, క్రస్టేషియా, కైలోపొడ, డిప్లోపొడా, ఇన్‌సెక్టా (కీటకాలు) అనే విభాగాలు ఉంటాయి.

ఎ. జిపోస్యురా

- ఇవి సముద్ర జీవులు
- వీటిలో ఒక జత కెలిసెరాలు (మొదటి జత ఉపాంగాలు ఆహార అంతర్గహణకు రూపాంతరం చెందాయి) నాలుగు జతల నడిచే కాళ్లు (walking legs) ఒక జత తోసేకాళ్లు (pusher legs) ఉంటాయి.
ఉదా: లిమ్యులస్ (రాచపీత)- ఇది సజీవ శిలాజం

బి. ఎరాక్నిడా

- ఇవి భూచర జీవులు
ఉదా: తేళ్లు, సాలెపురుగులు, టిక్స్, మైట్స్‌ను చేర్చారు.

తేలు (Scorpion)

- దీని శాస్త్రీయ నామం- పేలిమ్నియస్
- తోక చివరి భాగంలో విషపు గ్రంథులు ఉంటాయి.
- ఇవి శిశూత్పాదకం అంటే పిల్లలను కంటుంది.
- ఇది కానిబాలిజమ్‌ను ప్రదర్శిస్తుంది (అంటే తమ జాతిజీవులను ఆహారంగా తీసుకుంటుంది- స్వజాతి భక్షణ)
- ఇది కోర్ట్‌షిప్ అనే నృత్యం చేస్తుంది.

సాలెపురుగు (spider)

- వీటిని గురించిన అధ్యయనాన్ని ఏరినాలజీ అంటారు
- సంపర్కం జరిగిన తర్వాత ఆడజీవి మగజీవిని చంపి తింటుంది. అంటే స్వజాతి భక్షణ
- ఇది ఇంజినీరింగ్ నైపుణ్యంతో గూడును కట్టుకుంటుంది.

పేలు & పురుగులు (ticks&mites)

- ఇవి జంతువులపైన బాహ్య పరాన్నజీవనం గడుపుతాయి.

పేను (lice)

- ఇది బాహ్య పరాన్నజీవి
- దీని శాస్త్రీయ నామం- పెడిక్యులస్ పిథిరస్

నల్లి (bug)

- ఇది బాహ్య పరాన్నజీవి
- ఇది కూడ కానిబాలిజం (స్వజాతి భక్షణ)ను ప్రదర్శిస్తుంది
- దీని శాస్త్రీయ నామం-సిమెక్స్ లాక్టులారియస్
- వీటి అధ్యయనాన్ని ఎకరాలజీ అంటారు

సార్కోప్టెస్

- దీన్ని దురదమైట్ అంటారు.
- దీని ద్వారా స్కేబిస్ అనే చర్మవ్యాధి వస్తుంది.

6. ఆస్క్‌హెల్మింథిస్/నిమాటీహెల్మింథిస్

- నిమాటి అంటే గుండ్రం, దారము అని హెల్మింథిస్ అంటే పురుగులు అని అర్థం
- ఈ వర్గాన్ని నిమటోడా అని కూడా అంటారు.
- వీటిని ఇంకో రకంగా గుండ్రటి పురుగులు (round worms) దారపు పురుగులు (thread worms) నులిపురుగులు, ఏలికపాములు అని కూడా అంటారు.
- నిమటోడా దేహం అడ్డుకోతలో వర్తులాకారం/ గుండ్రంగా ఉంటుంది కాబట్టి వీటికి గుండ్రటి పురుగులు అనే పేరు వచ్చింది.
- ఇవి కొన్ని స్వేచ్ఛాజీవులు, మరికొన్ని మొక్కలు, జలచర, భూచర జంతువుల్లో పరాన్నజీవులుగా జీవిస్తాయి.
- ఇవి అవయవస్థాయిని కలిగిన జీవులు.
- మొదట జీర్ణనాళం ఈ జీవులలో ఏర్పడినది. వీటి ఆహారనాళంలో బాగా అభివృద్ధి చెందిన కండరయుత గ్రసని ఉంటుంది.
- ఇవి ఎక్కువగా అండోత్పాదకాలు (ఆస్కారిస్), కొన్ని అండశిశూత్పాదకాలు (ఉచరేరియా)

ఉదా:

- ఆస్కారిస్ (Round worm)
- ఉచరేరియా (Filaria worm)
- ఆంఖైలోస్టోమా (Hook worm)
- ఎంటిరోబియస్ వర్మికులారిస్ (pin worm)
- ట్రైకినెల్లా (ట్రైకినా పురుగు),ట్రైక్యూరిస్ (విప్ పురుగు)
- ప్లాటి, నిమాటిహెల్మెంథిస్ జీవుల అధ్యయనాన్ని హెల్మెంథాలజీ అంటారు.

mallesh

372
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles