భారత రిజర్వ్ బ్యాంక్ స్థాపనకు ఏ బ్యాంకు ఆదర్శం?


Wed,June 19, 2019 01:41 AM

బ్యాంకింగ్ వ్యవస్థ

- భారత ఆర్థిక వ్యవస్థకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక నిధులను సమకూర్చడానికి, అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, ద్రవ్య సప్లయ్, రుణాల సప్లయ్ వంటి అంశాలను నిర్వహించే మార్కెట్లను 1) విత్త మార్కెట్లు 2) ద్రవ్య మార్కెట్లుగా విభజించారు.
- అప్పు అవసరమైన వారికి సులభంగా అప్పును రుణదాతలకు రుణగ్రహీతలను సమకూర్చే యంత్రాంగాన్నే ద్రవ్య మార్కెట్ లేదా మనీ మార్కెట్ అంటారు.
- ద్రవ్య మార్కెట్ రెండు రకాలు 1) అవ్యవస్థీకృత రంగం 2) వ్యవస్థీకృత రంగం
- అవ్యవస్థీకృత రంగంలో వడ్డీ వ్యాపారులు, వ్యాపారులు ప్రధాన పాత్ర వహిస్తారు. వ్యవస్థీకృత రంగం కిందకు మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ వస్తుంది.

వ్యవస్థీకృత రంగం - బ్యాంకింగ్

- బ్యాంకు అనే పదం సహజంగా వాణిజ్య బ్యాంకుల భావనగా ఉపయోగిస్తారు. వీటిని వివిధ పేర్లతో పిలుస్తారు.
- జర్మనీలో BANCK అంటే ఉమ్మడి నిల్వనిధి అనే అర్థంలో, ఫ్రెంచ్‌లో BANVEగా, ఇటలీలో BANCOగా పిలుస్తారు. BANCO అంటే ఒక బెంచ్ (బల్ల) అని అర్థం.
- 1157లో ది బ్యాంక్ ఆఫ్ వెనిస్ మొదటి పబ్లిక్ సంస్థగా నెలకొల్పారు. తర్వాత 1401లో బ్యాంక్ ఆఫ్ బార్సిలోనా, 1407లో బ్యాంక్ ఆఫ్ జెనీవాలను స్థాపించారు. 1609లో బ్యాంక్ ఆఫ్ అమ్‌స్టర్‌డామ్, 1690లో బ్యాంక్ ఆఫ్ హామ్‌బర్గ్ వల్ల కొత్త అధ్యాయం మొదలైంది.
- లాంబర్డ్ ఆఫ్ ఇటలీ బ్యాంక్ ఇంగ్లండ్‌లో వ్యాపారం ప్రారంభించి సేవలను అందించింది. 1694లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నెలకొల్పగా.. 1833లో ఇది వాణిజ్య బ్యాంకుగా రూపాంతరం చెందింది.

భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ

- భారత్‌లో మొదటి బ్యాంకును 1770లో కోల్‌కతాలో హిందుస్థాన్ బ్యాంక్ అనే పేరుతో అలెగ్జాండర్ అండ్ కో అనే బ్రిటిష్ కంపెనీ స్థాపించింది.
- 1806లో ప్రెసిడెన్షియల్ బ్యాంకును బ్యాంక్ ఆఫ్ బెంగాల్ పేరుతో ఏర్పాటు చేశారు.
- 1881లో భారతీయ యాజమాన్యంతో బ్యాంక్-అవధ్ కమర్షియల్ బ్యాంక్ (యూపీ)ను ఏర్పాటు చేశారు.
- 1840లో బ్రిటిష్‌వారు బొంబాయి ప్రెసిడెన్షిలో బ్యాంక్ ఆఫ్ బొంబాయిను, 1843లో, మద్రాసులో బ్యాంక్ ఆఫ్ మద్రాస్‌ను ఏర్పాటు చేశారు.
- పై మూడు బ్యాంకులను 1921లో విలీనం చేసి ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు.
- 1949 బ్యాంకింగ్ నియంత్రణ చట్టం ప్రకారం బ్యాంకింగ్ సంస్థ అంటే రుణ సౌకర్యాలను, పెట్టుబడులను అందించే లక్ష్యంతో ప్రజల వద్ద నుంచి డిపాజిట్లను స్వీకరించి వారు కోరిన సమయంలో చెక్కులు, డ్రాఫ్ట్‌లు వంటి వాటి ద్వారా డిపాజిటర్ల సొమ్మును వెనుకకు తీసుకునే సౌకర్యం కల్పించే సంస్థ.
- 1970, 1980 దశకంలో బ్యాంకుల జాతీయీకరణ, 1990 తర్వాత వచ్చిన విత్త సంస్కరణల్లో భాగంగా బ్యాంకింగ్ లక్ష్యాల్లో అనేక మార్పులు జరిగాయి.
- దేశంలోనే జిల్లా స్థాయిలో పరిపానంతా కంప్యూటరీకరించిన మొదటి జిల్లా కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ జిల్లా.

బ్యాంకింగ్ వ్యవస్థ నిర్మాణ స్వరూపం

- బ్యాంకింగ్ వ్యవస్థ విత్త మార్కెట్‌లో అంతర్భాగం. భారతదేశ వ్యవస్థాపక బ్యాంకింగ్ వ్యవస్థ (ఆర్గనైజ్‌డ్ బ్యాంక్ సెక్టార్) నిర్మాణం
1) భారతీయ రిజర్వ్ బ్యాంక్
2) వాణిజ్య బ్యాంకులు
3) సహకార బ్యాంకులు
- భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ అన్ని బ్యాంకులపై అథారిటీగా ఉంటుంది. దీని విధివిధానా రూపకల్పనకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం-1934లో ప్రవేశపెట్టింది.
- అన్ని బ్యాంకులు ఈ రిజర్వ్ బ్యాంక్ అజమాయిషీలో పనిచేయాలని 1949లో బ్యాంకింగ్ నియత్రంణ చట్టం ద్వారా నిర్దేశించారు.
- ప్రారంభంలో కొన్ని బ్యాంకులు మాత్రమే ఉండటంతో రిజర్వ్ బ్యాంక్ తన రెండో షెడ్యూల్‌లో చేర్చుకున్న బ్యాంకులను షెడ్యూల్ బ్యాంకులుగా పిలుస్తారు.
- బ్యాంకుల సంఖ్య పెరగడంతో షెడ్యూల్ బ్యాంక్ కాని వాటికి లైసెన్స్ మంజూరు చేయడం వాటిని నాన్ షెడ్యూల్ బ్యాంకుగా పిలుస్తారు.
- షెడ్యూల్ బ్యాంకుకు విదేశీమారక ద్రవ్యాన్ని నిర్వహించే అవకాశంతో పాటు విస్తృత సేవలు అందజేయడానికి అనుమతి ఉంది.
- నాన్ షెడ్యూల్ బ్యాంకులు అందించే సేవలు కొంత ప్రాంతానికి కొన్ని సేవలకు మాత్రమే పరిమితమవుతాయి.
- బ్యాంకులకు ఉండే మూలధనం, బ్యాంకులు చేపట్టే కార్యక్రమాలను బట్టి రిజర్వ్ బ్యాంక్ షెడ్యూల్ బ్యాంకులుగా పరిగణిస్తుంది.
- వాణిజ్యపరమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ లాభాపేక్షగా ఏర్పడ్డ సంస్థ వాణిజ్య బ్యాంకుగా, పరస్పర సహకారంతో సభ్యులకు లాభం చేకూరేవిధంగా కార్యక్రమాలను నిర్వహించే సహకార బ్యాంకుగా పిలుస్తారు.

విత్త పర్యవేక్షణ

- RBI తన విధులను ఆర్థిక పర్యవేక్షణ బోర్డు 1994 నవంబర్‌లో స్థాపించిన ఈ బోర్డు రిజర్వుబ్యాంకు డైరెక్టర్లతో నిర్వహించబడుతుంది.
- ఆర్థిక రంగంలో ఉన్న వాణిజ్య బ్యాంకులు, విత్తసంస్థలు, బ్యాంకేతర సంస్థలను పర్యవేక్షించడం ప్రధాన కర్తవ్యంగా ఈ మండలి పనిచేస్తుంది.
- కేంద్ర బోర్డు నుంచి నలుగురు డైరెక్టర్లు, రెండేండ్ల పదవీకాలం గడువుతో ఈ బోర్డు నుంచి పనిచేస్తారు.
- నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఈ కమిటీలో పదవిరీత్యా సభ్యులుగా కొనసాగుతారు. ఒక డిప్యూటీ గవర్నర్ ఈ బోర్డుకు ఉపాధ్యాక్షులుగా ఉంటారు.

RBI విధులు

1. సంప్రదాయక విధులు
2. అభివృద్ధిపరమైన విధులు
3. పర్యవేక్షణ విధులు

సంప్రదాయక విధులు

a. కరెన్సీ నోట్లను జారీ చేయడం 1934లో ఆర్‌బీఐ చట్టం సెక్షన్ 22 ప్రకారం కరెన్సీ నోట్లు జారీచేసే గుత్తాధిపత్య అధికారం ఉంది.
- ద్రవ్య సుస్థిరతను కాపాడటం, చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లను, బ్యాంకు డిపాజిట్లను, వాణిజ్య వ్యాపార అవసరాలకు అనుగుణంగా సరిదిద్దడం ఆర్‌బీఐ విధులు.
- ఒక రూపాయి నోట్లను తప్ప ఇతర కరెన్సీ నోట్లు అన్నింటిని ఆర్‌బీఐ ముద్రించి పంపిణీ చేస్తుంది. ఒక రూపాయి నోట్లను, నాణేలను భారతదేశ ఆర్థిక మంత్రిత్వశాఖ ముద్రణ చేస్తుంది. అందుకే ఒక రూపాయి నోటుపై ఆర్థికశాఖ ప్రధాన కార్యదర్శి సంతకం ఉంటుంది.
- 1956 నుంచి కనీస నిల్వ పద్ధతి (Minimum Reserve System)ని అనుసరిస్తుంది.

b. ప్రభుత్వానికి బ్యాంకర్‌గా సలహాదారుగా

- RBI కేంద్ర ప్రభుత్వానికి బ్యాంకర్‌గా, ప్రతినిధిగా, సలహాదారుగా వ్యవహరిస్తుంది.
- RBI ప్రభుత్వానికి బ్యాంకింగ్ సౌకర్యాలను కల్పిస్తుంది. నగదు నిల్వలను డిపాజిట్లుగా ఉంచుతుంది. ప్రభుత్వం తరపున చెల్లింపులు చేస్తుంది. ప్రభుత్వం రుణాలు ఆర్బీఐ ద్వారా జారీ చేయడం జరుగుతుంది.
- RBI ప్రభుత్వానికి ద్రవ్యోల్బణం, ప్రతి ద్రవ్యోల్బణం, కరెన్సీ మూల్య హీనికరణ, కరెన్సీ పునర్ మూల్యాంకనం, లోటు ద్రవ్య విధానం, చెల్లింపుల శేషం సంబంధమైన విషయాలు, ద్రవ్యసంబంధమైన విషయాల్లో సలహాలు ఇస్తుంది.

c. బ్యాంకుల బ్యాంకర్, అంతిమ రుణదాత

- రిజర్వ్‌బ్యాంకు చట్టం 1934 ప్రకారం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్-1949 ప్రకారం RBI, అన్ని ప్రభుత్వ బ్యాంకులకు షెడ్యూల్డ్, వాణిజ్య బ్యాంకులకు నాయకత్వం వహించి వాటి కార్యకలాపాలను తీర్చిదిద్దే అధికారం RBI కి ఉంటుంది.
- బ్యాంకింగ్ క్రమబద్ధీకరణ చట్టం 1949 ప్రకారం వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లలో కొంత భాగాన్ని RBI వద్ద నగదు నిల్వలుగా ఉంచుతుంది. దీనినే నగదు నిల్వల నిష్పత్తి (Cash Reseve Ratio) అంటారు.
- అత్యవసర పరిస్థితిలో వాణిజ్య బ్యాంకులకు రుణ సౌకర్యం కల్పించి RBI అంతిమ రుణదాతగా వ్యవహరిస్తుంది.

d. రుణ నియంత్రణ

- పరిమాణాత్మక, గుణాత్మక చర్యల ద్వారా వాణిజ్యబ్యాంకులిచ్చే రుణ పరిమాణాన్ని అవసరాలకు అనుగుణంగా నియంత్రిస్తుంది.
- పరపతి నియంత్రణ RBI ప్రధాన విధి. వాణిజ్య బ్యాంకులు సృష్టించే నియంత్రణ, పరపతి సృష్టికరణపై కేంద్ర బ్యాంకు వివిధ పద్ధ్దతులలో నియంత్రణ చర్యలు చేపడుతుంది. అవి రెండు రకాలు
i. ధనాత్మక పద్ధతి
ii. గుణాత్మక పద్ధతి
- ధనాత్మక పద్ధతిలో ఎంత మొత్తాన్ని రుణాలుగా మంజూరు చేయాలో నిర్ధారిస్తుంది.

2. అభివృద్ధిపరమైన విధులు- మన దేశం ఆర్థికాభివృద్ధిని సాధించడంలో RBI విశిష్ట పాత్ర నిర్వహిస్తుంది.

a. బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి పరచడం: బ్యాంకుల కార్యకలాపాలకు, బ్యాంకుల అభివృద్ధికి సంబంధించి ప్రత్యేకంగా బ్యాంకింగ్ కార్యకలాపాల శాఖను RBI ఏర్పాటు చేసింది.
b. వ్యవసాయ పరపతిని ప్రోత్సహించడం: 1982లో వ్యవసాయ పరపతి కోసం RBI నాబార్డును స్థాపించింది. నాబార్డు మూలధనంలో 50 శాతం RBI కల్పిస్తుంది.
c. పారిశ్రామికాభివృద్ధి పరపతిని అందించడం: చిన్నతరహా, భారీ పరిశ్రమలకు కావాల్సిన ద్రవ్య సహాయాన్ని RBI అందిస్తుంది. ఇందుకుగాను కొన్ని విత్త సహాయ సంస్థలను RBI స్థాపించింది. IDBI, SFC, SIDBIల స్థాపనలో RBI ప్రముఖ ప్రాత్ర పోషించింది.

d. బిల్ మార్కెట్‌ను అభివృద్ధి పరచడం: 1952లో బిల్ మార్కెట్ పథకాన్ని ప్రారంభించి ద్రవ్య మార్కెట్‌ను అభివృద్ధి పరిచింది.

e. IMFలో భారత ప్రభుత్వం ప్రతినిధిగా వ్యవహరిస్తుంది.
- సమాచార సేకరణ, ప్రచురణ, శిక్షణ కళాశాలల ఏర్పాటు: RBI బులిటెన్ రిపోర్ట్ ఆఫ్ కరెన్సీ అండ్ బ్యాంకింగ్, బ్యాంకులకు సంబంధించిన గణాంక పట్టికలు మొదలైన పుస్తకాలను RBI ప్రచురిస్తుంది.
- RBI బ్యాంకుల్లో పనిచేసే సిబ్బందికి శిక్షణను ఇవ్వడానికి మూడే శిక్షణ కళాశాలలను నిర్వహిస్తుంది.
బ్యాంకర్ల శిక్షణ కళాశాల- ముంబై
వ్యవసాయ బ్యాంకింగ్ కళాశాల- పుణె
రిజర్వ్ బ్యాంక్ సిబ్బంది కళాశాల- చెన్నై
- RBI 1974 నుంచి న్యూస్ లెటర్ అనే పక్షపత్రికను ప్రచురిస్తుంది.

3. RBI పర్యవేక్షణ విధులు

- బ్యాంకింగ్ రంగం ఆర్థిక పరిపుష్టికి పర్యవేక్షణతో కూడిన ఆర్థికేతర కార్యాకలాపాలను కూడా RBI నిర్వహిస్తుంది.
a. సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకుల స్థాపనలో లైసెన్స్‌లను మంజూరు చేయడంలో, శాఖలను విస్తృతపరచడంలో, ద్రవ్యత్వ ఆస్తుల నిర్వహణలో, బ్యాంకుల సంయోగంలో, పునర్‌నిర్మాణంలో, పరిసమాప్తి విషయంలో RBI విస్తృత అధికారాలను కలిగి ఉంటుంది.
b. అనేక ఆర్థిక సంస్థలను నిర్దిష్ట కాలవ్యవధిలో తనిఖీ చేసి వాటికి చెందిన రికార్డుల రిటర్న్స్‌ను సమర్పించమనే అధికారం RBIకి ఉంది.
c. భారతీయ బ్యాంకింగ్ రంగానికి ప్రామాణికతతో కూడిన విలువలను అందజేయడానికి బ్యాంకింగ్ సంస్థల ద్వారా దేశ ఆర్థికాభివృద్ధికి RBI పాలుపంచుకుంటుంది.

కేంద్రబ్యాంక్

- దేశంలో అత్యున్నత స్వయంప్రతిపత్తి ఉన్న బ్యాంకింగ్ సంస్థనే కేంద్ర బ్యాంక్‌గా పిలుస్తారు. ఇది ద్రవ్యమార్కెట్‌కు నాయకత్వం వహిస్తుంది. వాణిజ్య బ్యాంకుల పర్యవేక్షణ, నియంత్రణ, క్రమబద్దీకరణ బాధ్యతలను కూడా వహిస్తుంది.
- 1656లో ఏర్పడిన స్వీడన్‌లోని రిక్స్ బ్యాంక్ అతి ప్రాచీనమైన కేంద్ర బ్యాంక్.
- 1694లో స్థాపించిన బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ మొదటి కేంద్ర బ్యాంక్.
- 1800లో ది బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్‌ను స్థాపించారు.
- 1914లో అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ పేరుతో కేంద్ర బ్యాంకును స్థాపించారు.
- భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ స్థాపనకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌ను ఆదర్శంగా తీసుకున్నారు.
- ప్రభుత్వ విధానాన్ని అమలుపరుస్తూ దానికి కోశ వ్యవహారాల్లో మధ్యవర్తిగా ఉండి, బ్యాంకింగ్ ద్రవ్యమార్కెట్ సంస్థలను నియంత్రించే సంస్థనే కేంద్ర బ్యాంక్ అంటారు.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)

- భారత కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1926లో హిల్టన్ యంగ్ కమిషన్ సిఫారసుల మేరకు జేఎం కీన్స్ ప్రణాళిక ఆధారంగా దీన్ని ఆర్‌బీఐ చట్టం-1934 ప్రకారం 1935 ఏప్రిల్ 1న రూ.5 కోట్ల మూలధనంతో వాటాదార్ల బ్యాంకుగా ఏర్పడింది.
- 1949, జనవరి 1న ఈ బ్యాంకును జాతీయం చేశారు. ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ముంబై, కలకత్తా, న్యూఢిల్లీల్లో ప్రాంతీయ కార్యాలయాలున్నాయి.
- RBI విధి విధానాలను రూపొందించుటకు, పర్యవేక్షించుటకు 20 మంది డైరెక్టర్లు సభ్యులుగా, ఒక కేంద్రబోర్డును నియమించారు.
- ఇందులో గవర్నర్, నలుగురు డిప్యూటీ గవర్నర్లు, ఆర్థిక శాఖ నుంచి ప్రభుత్వ ప్రతినిధి, వివిధ రంగాలకు చెందిన 10 మంది ప్రతినిధులు, 4 ప్రాంతాల ప్రతినిధులు (ముంబై, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ) డైరెక్టర్లుగా కొనసాగుతారు.
- 4 ప్రాంతాల స్థానిక బోర్డులలో ఐదుగురు సభ్యులను నాలుగేండ్ల పదవీ కాలంతో నియమిస్తారు. దీనికి 6 శిక్షణ కేంద్రాలు, 22 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.
- RBI మొదటి గవర్నర్ సర్ అబ్స్‌బార్నె అర్కల్ స్మిత్.
- RBI తొలి భారతీయ గవర్నర్‌C.D దేశ్‌ముఖ్.
- RBI ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్, ఇతను 25వ గవర్నర్.
giridhar

909
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles