సీడీఎస్‌ఈ ఎగ్జామ్ (II) -2019


Wed,June 19, 2019 01:22 AM

DEFENCE-ACADEMYa
త్రివిధ దళాలైన మిలిటరీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో ఉన్నత ఉద్యోగాలకు నిర్వహించే సీడీఎస్‌ఈ-II, 2019 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది.


- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ (సీడీఎస్‌ఈ)ను ప్రతిఏటా రెండుసార్లు యూపీఎస్సీ నిర్వహిస్తుంది.
- మొత్తం ఖాళీలు - 417
- ఇండియన్ మిలిటరీ అకాడమీ (డెహ్రాడూన్) - 100 (వీటిలో ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్ అభ్యర్థులకు 13 పోస్టులు కేటాయించారు)
- ఇండియన్ నేవల్ అకాడమీ (ఎజిమల) - 45 (వీటిలో ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్ అభ్యర్థులకు 6 పోస్టులు కేటాయించారు)
- ఎయిర్‌ఫోర్స్ అకాడమీ (హైదరాబాద్) - 32
- ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీ (చెన్నై) - 225 (పురుషులకు మాత్రమే. వీటిలో ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్ అభ్యర్థులకు 50 పోస్టులు కేటాయించారు)
- ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీ (చెన్నై) - 15 (నాన్ టెక్నికల్, మహిళలకు మాత్రమే)

విద్యార్హతలు:
- ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ) అండ్ ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
- ఇండియన్ నేవల్ అకాడమీ: ఏదైనా బ్రాంచీలో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
- ఎయిర్ ఫోర్స్ అకాడమీ: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
- వయస్సు: 2020, జూలై 1 నాటికి 20 - 24 ఏండ్లు (1996, జూలై 2 నుంచి 2000, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి)
- ఐఎంఏ/ఇండియన్ నేవల్ అకాడమీ పోస్టులకు 1996, జూలై 2 నుంచి 2001, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
- శారీరక ప్రమాణాలు: కనీసం 157.5 సెం.మీ. ( నేవీకి 157 సెం.మీ., ఎయిర్‌ఫోర్స్‌కు 162.5 సెం.మీ., మహిళలు 152 సెం.మీ ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి)
- ఫిజికల్ కండిషనింగ్: రన్నింగ్ - 15 నిమిషాల్లో 2-4 కి.మీ. పరుగెత్తాలి.
- ఫుష్ అప్స్ - సిట్ అప్స్- కనీసం 20, రోప్ ైక్లెంబింగ్ - 3 - 4 మీటర్లు. చిన్ అప్స్- కనీసం 8.
- ఫీజు: రూ. 200/- , ఎస్సీ/ఎస్టీ, మహిళ అభ్యర్థులకు ఫీజు లేదు.
- ఎంపిక: రాతపరీక్ష + ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ (ఐపీటీ) ద్వారా ఇంటెలిజెన్స్ పర్సనాలిటీ టెస్ట్ (ఐపీటీ)
- ఎస్‌ఎస్‌బీ రెండు దశల్లో ఈ టెస్ట్ నిర్వహిస్తుంది.
- స్టేజ్ -1లో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్‌లు ఉంటాయి. వీటిలో పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్క్రిప్షన్ టెస్ట్‌లు ఉంటాయి.
- స్టేజ్ -2లో ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టాస్క్స్, సైకాలజీ టెస్ట్‌లు ఉంటాయి.
- మిలిటరీ, నేవల్, ఎయిర్‌ఫోర్స్ అకాడమీల్లో ప్రవేశాల కోసం మొత్తం 300 మార్కుల్లో భాగంగా ఇంగ్లిష్-100, జనరల్‌నాలెడ్జ్-100, ఎలిమెంటరీ మ్యాథ్స్-100 ప్రశ్నలు ఇస్తారు. ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలో ప్రవేశాల కోసం మొత్తం 200 మార్కుల్లో భాగంగా ఇంగ్లిష్-100, జనరల్‌నాలెడ్జ్-100 నుంచి ప్రశ్నలు ఇస్తారు.

- కాలవ్యవధి - ఒక్కో సబ్జెక్టును 2 గంటల్లో పూర్తిచేయాలి.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరకాస్తులకు చివరితేదీ: జూలై 8
- పరీక్షతేదీ: సెప్టెంబర్ 8
- వెబ్‌సైట్: www.upsconline.nic.in

428
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles