అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీటెక్


Wed,June 19, 2019 01:20 AM

PJTSAU
హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎంపీసీ స్ట్రీమ్ కింద (రైతుల కోటా) 2019-20కిగాను బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

- కోర్సు పేరు: బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ)
- మొత్తం సీట్ల సంఖ్య: 36 (అగ్రికల్చర్ ఇంజినీరింగ్-18, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ -18)
- కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్, కంది (సంగారెడ్డి), కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ రుద్రూర్ (నిజమాబాద్ జిల్లా) కాలేజీలు బీటెక్ కోర్సును అందిస్తున్నాయి.
- అర్హత: ఇంటర్ (మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్) ఉత్తీర్ణత. అభ్యర్థి నాన్ మున్సిపల్ ప్రాంతంలో 1 నుంచి ఇంటర్ వరకు కనీసం నాలుగేండ్లు చదవాలి. తల్లిదండ్రుల పేరిట తప్పనిసరిగా కనీసం ఎకరం భూమిని కలిగి ఉండాలి.
- వయస్సు: 2019 డిసెంబర్ 31 నాటికి 17 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 25 ఏండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు 27 ఏండ్ల వరకు సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్ ఫీజు: జనరల్/బీసీలు రూ.1800/-, ఎస్సీ/ఎస్టీ/ పీహెచ్‌సీలకు రూ. 900/-
- ఎంపిక: ఎంసెట్ -2019 ర్యాంక్ ఆధారంగా.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: జూలై 12
- వెబ్‌సైట్: www.pjtsau.ac.in

956
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles