నేవీలో 172 చార్జ్‌మ్యాన్ ఖాళీలు


Wed,May 22, 2019 12:49 AM

navy1
-పోస్టులు: చార్జ్‌మ్యాన్ (మెకానిక్/ అమ్యునిషన్ & ఎక్స్‌ప్లోజివ్)
-మొత్తం ఖాళీలు- 172 విభాగాల వారీగా..
-మెకానిక్-103 (జనరల్-41, ఎస్సీ-18, ఎస్టీ-6, ఓబీసీ-28, ఈడబ్ల్యూఎస్-10)
-అమ్యునిషన్ & ఎక్స్‌ప్లోజివ్-69 (జనరల్-25, ఎస్సీ-13, ఎస్టీ-7, ఓబీసీ-18, ఈడబ్ల్యూఎస్-6)
-అర్హతలు: మెకానిక్ విభాగానికి మెకానికల్/ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్/ప్రొడక్షన్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో కనీసం రెండేండ్ల అనుభవం ఉండాలి.
-అమ్యునిషన్ విభాగానికి కెమికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాతోపాటు రెండేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 30 ఏండ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్నవారిని అర్హతలను బట్టి స్క్రూటినీ చేసి ఆన్‌లైన్ టెస్ట్‌కు పిలుస్తారు.
-ఆన్‌లైన్ టెస్ట్: ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఇస్తారు. దీనిలో మొత్తం నాలుగు సెక్షన్లు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్/అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్/లాజికల్ రీజనింగ్, అప్లయిడ్ సైన్స్ & స్పెషలైజేషన్, జనరల్ ఇంగ్లిష్‌పై ప్రశ్నలు ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 26
-ఫీజు: రూ. 205/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు ఎటువంటి ఫీజు లేదు)
-వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in

746
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles