పదోతరగతితో కోస్ట్‌గార్డ్ కొలువులు


Thu,May 16, 2019 01:42 AM

Coast-Guard
ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో నావిక్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

- పోస్టు: నావిక్ (డొమెస్టిక్ బ్రాంచి-కుక్, స్టీవార్డ్)
- అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
- ఉద్యోగ బాధ్యతలు: కుక్- మెనూ ప్రకారం ఆహారాన్ని తయారుచేయడం, సరుకుల అకౌంటింగ్‌తోపాటు సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన పనులు చేయాలి.
- స్టీవార్డ్: ఆహారాన్ని వడ్డించడం, హౌజ్‌కీపింగ్, అకౌంటింగ్, మెనూ తయారీ తదితర పనులు చేయాలి.
- వయస్సు: 2019, అక్టోబర్ 1 నాటికి 18-22 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1997 అక్టోబర్ 1 నుంచి 2001 సెప్టెంబర్ 30 మధ్య జన్మించి ఉండాలి.
- శారీరక ప్రమాణాలు: కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. ఎత్తుకు అనుగుణంగా ఛాతీ ఉండాలి. గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీలు వ్యాకోచించాలి.
- జీతభత్యాలు: ప్రారంభవేతనం నెలకు రూ.21,700/- (లెవల్-3)తోపాటు అదనంగా డీఏ, ఇతర అలవెన్సులు ఇస్తారు.
- పదోన్నతులు: నావిక్ నుంచి ప్రధాన అధికారి వరకు పదోన్నతి పొందవచ్చు. ప్రధాన అధికారి పేస్కేల్ నెలకు రూ.47,600 + డీఏ.

- ఇతర సౌకర్యాలు: రేషన్, దుస్తులు, కుటుంబంలోని అందరికీ ఉచిత వైద్యం, ఉచిత వసతి సౌకర్యం, 45 ఈఎల్స్, 8 సీఎల్స్, క్యాంటీన్ సౌకర్యం కల్పిస్తారు. పదవీ విరమణ తర్వాత ఈసీహెచ్‌ఎస్ వైద్య సౌకర్యం కల్పిస్తారు.
- ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి వారికి రాతపరీక్ష నిర్వహిస్తారు.
- రాతపరీక్ష: క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, మ్యాథ్స్, జనరల్ సైన్స్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్ (కరెంట్ అఫైర్స్, జీకే), రీజనింగ్ (వెర్బల్, నాన్ వెర్బల్)పై ప్రశ్నలు ఇస్తారు.
- రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ) నిర్వహిస్తారు.
- పీఎఫ్‌టీ: దీనిలో 1.6 కి.మీ దూరాన్ని ఏడు నిమిషాల్లో పరుగెత్తాలి. 20 ఉతక్‌బైఠక్‌లు, 10 పుష్‌అప్‌లు చేయాలి. దీనిలో అర్హత సాధించినవారికి వైద్యపరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జూన్ 5 నుంచి ప్రారంభం
- చివరితేదీ: జూన్ 10
- వెబ్‌సైట్: www.joinindiancoastguard.gov.in

341
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles