నైపర్ జేఈఈ-2019


Mon,May 13, 2019 01:28 AM

మానవాళి అంతా ఔషధాలపై మనుగడ సాగించే స్థితి నేడు నెలకొంది. ఏటేటా ప్రపంచవ్యాప్తంగా మందుల పరిశ్రమ గణనీయమైన వృద్ధి సాధిస్తుంది. భారతదేశం 2018 ఆర్థిక సంవత్సరంలో ఫార్మా రంగం విలువ అక్షరాల రెండు లక్షల కోట్లు. ఫార్మా రంగం దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిలో ఒకటి. మన రాష్ట్రంలో హైదరాబాద్‌కు సమీపంలో ఫార్మాసిటీ ఏర్పాటుకానున్నది. ఇలాంటి నేపథ్యంలో ఫార్మా లో ఉన్నతవిద్యను అభ్యసించిన వారికి అద్భుతమైన ఉపాధి అవకాశాలు ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన ఫార్మా విద్యకు చిరునామాగా నిలిచే నైపర్‌లలో పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయస్థాయి ప్రవేశపరీక్ష దరఖాస్తు గడువు మే 15న ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఎంట్రెన్స్ గురించి సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం...
niper-hyd

నైపర్

-కేంద్ర రసాయన, ఎరువుల మంత్రిత్వశాఖ పరిధిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైపర్). దేశంలో ఫార్మా రంగంలో పరిశోధనలకు, ఉన్నత విద్యను అందించడానికి కేంద్రం ప్రారంభించిన సంస్థలు ఇవి. మొహాలీ, అహ్మదాబాద్, గువాహటి, హాజీపూర్, హైదరాబాద్, కోల్‌కతా, రాయబరేలీల్లో మొత్తం ఏడు క్యాంపస్‌లు ఉన్నాయి. త్వరలో మరో నాలుగు క్యాంపస్‌లు కూడా ప్రారంభం కానున్నాయి.
-అర్హతలు- బీఫార్మసీ, బీవీఎస్సీ, బీటెక్, ఎంబీబీఎస్, పీజీ, జీప్యాట్ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణత. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ఎంపిక విధానం

-రెండు దశల్లో ఎంపిక ఉంటుంది. మొదట దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రవేశపరీక్ష,
-తర్వాత కౌన్సెలింగ్ లేదా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ప్రతి ఒక్కరికి ఫెలోషిప్

-నైపర్‌లో సీటు పొందిన ప్రతి ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వం ఫెలోషిప్ అందిస్తుంది.
-పీజీ కోర్సుల్లో చేరినవారికి నెలకు రూ.12,400/- (ఎంబీఏ ఫార్మా తప్ప), పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన విద్యార్థులకు మొదటి రెండేండ్లు నెలకు రూ.25,000 వేలు, మూడో ఏడాది నుంచి నెలకు రూ.28 వేలు ఇస్తారు.

ఉపాధి అవకాశాలు

-నైపర్‌లలో చదివిన వారిలో ఏటా 85 శాతం మంది విద్యార్థులు ప్రముఖ ఎంఎన్‌సీలకు ఎంపికవుతున్నారు. మిగిలిన 15 శాతం విద్యార్థులు పరిశోధనలు, విదేశాలకు వెళ్తునట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

నైపర్ అందించే కోర్సులు

ఎంఎస్ (ఫార్మా)
-విభాగాలు- బయోటెక్నాలజీ, మెడిసినల్ డివైజెస్, మెడిసినల్ కెమిస్ట్రీ, నేచురల్ ప్రొడక్ట్స్, ఫార్మాకోఇన్ఫార్మాటిక్స్, ఫార్మాకాలజీ & టాక్సికాలజీ, ఫార్మాస్యూటికల్ అనాలసిస్, ఫార్మాస్యూటిక్స్, ట్రెడిషనల్ మెడిసిన్, రెగ్యులేటరీ టాక్సికాలజీ.

ఎంఫార్మసీ

-విభాగాలు- క్లినికల్ రిసెర్చ్, ఫార్మసీ ప్రాక్టిస్, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ఫార్ములేషన్).

ఎంటెక్ (ఫార్మా)

-విభాగాలు- ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (బయోటెక్నాలజీ, ప్రాసెస్ కెమిస్ట్రీ)

ఎంబీఏ (ఫార్మా)

-విభాగాలు- ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్

పీహెచ్‌డీ

-విభాగాలు- కెమికల్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్

-దరఖాస్తుః ఆన్‌లైన్‌లో
-చివరితేదీః మే 15
-ప్రవేశ పరీక్షతేదీః జూన్ 9
-వెబ్‌సైట్‌ః www.niperhyd.ac.in

199
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles