గురుకులంలో డిగ్రీ ప్రవేశాలు


Sun,May 12, 2019 01:34 AM

students
తెలంగాణ సాంఘిక సంక్షేమ & గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న డిగ్రీ కాలేజీల్లో 2019-20కిగాను అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) ప్రవేశాల కోసం నిర్వహించే టీజీయూజీసెట్-2019 నోటిఫికేషన్ విడుదల చేసింది.

- టీఎస్ గురుకులం అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్
- గ్రూపులు: బీఏ/బీకామ్, బీబీఏ, బీఎస్సీ
- ఈ కోర్సులన్నీ ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తారు.
- ప్రతి గ్రూప్‌లో 40 చొప్పున సీట్లను భర్తీచేస్తారు.
- అర్హత: తెలంగాణలో 2018 /2019 సంవత్సరంలో రెండ్లేండ్ల ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలు హాజరైన విద్యార్థులు. సప్లమెంటరీ/అడ్వాన్స్‌డ్ పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తల్లిదండ్రుల ఆదాయం ఏడాదికి గ్రామీణ ప్రాంతాల్లో వారు అయితే రూ. 1,50,000/-, పట్టణ ప్రాంతాల్లో వారుఅయితే రూ. 2,00,000 మించరాదు.
- ఎంపిక: ప్రవేశపరీక్ష ఆధారంగా
- ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 90 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్, మ్యాథ్స్, ఫిజిక్స్ & కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ &కెమిస్ట్రీ, అకౌంట్స్ & కామర్స్, ఎకనామిక్స్, హిస్టరీ, ఎకనామిక్స్ & సివిక్స్ సబ్జెక్టుల నుంచి ప్రతి విభాగంలో 30 ప్రశ్నలు ఇస్తారు. బీఎస్సీ/బీకామ్, బీఏ, బీబీఏ గ్రూప్‌లను బట్టి ప్రవేశ పరీక్షలో సబ్జెక్టులు మారుతాయి.
- అప్లికేషన్ ఫీజు: రూ. 100/- (టీఎస్‌డబ్ల్యూఆర్ ఆర్మ్‌డ్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజీల్లో రూ. 350/-)
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: మే 22
- హాల్‌టికెట్ల్ల డౌన్‌లోడింగ్: జూన్ 3 నుంచి
- ప్రవేశ పరీక్ష: జూన్ 8
- వెబ్‌సైట్: http://tgtwgurukulam.telangana.gov.in

333
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles