కెన్‌ఫిన్ హోమ్స్‌లో 140 ఖాళీలు


Fri,May 10, 2019 01:50 AM

can-fin-homes
బెంగళూరులోని కెనరాబ్యాంక్ సబ్సిడరీ సంస్థ అయిన కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్ వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఆఫీసర్ , మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

- పోస్టు పేరు: జూనియర్ ఆఫీసర్
- మొత్తం పోస్టుల సంఖ్య-140 (సీనియర్ మేనేజర్-10, మేనేజర్-30, జూనియర్ ఆఫీసర్-100)
- అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి జూనియర్ ఆఫీసర్ పోస్టులకు..ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. డాటా ఎంట్రీ/కంప్యూటర్ అప్లికేషన్‌లో పరిజ్ఞానం ఉండాలి. సీనియర్ మేనేజర్ పోస్టులకు బ్యాంకులు/ఫైనాన్షియల్ సంస్థల్లో సీనియర్ మేనేజర్‌గా పనిచేసి ఉండాలి.
- వయస్సు: 2019 జూన్ 1 నాటికి జూనియర్ ఆఫీసర్‌కు 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. మేనేజర్ పోస్టులకు 35 ఏండ్లు, సీనియర్ మేనేజర్‌కు 62 ఏండ్లకు మించరాదు.
గమనిక: జూనియర్ ఆఫీసర్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీచేస్తారు.
- పేస్కేల్: మొదటి ఏడాది రూ.16,000/-, రెండో ఏడాది రూ. 18,000/-, మూడో ఏడాది రూ. 21,000/- జీతం ఇస్తారు. అదనంగా మొబైల్ చార్జీలు, స్పెషల్ అలవెన్సులు అన్ని కలిపి నెలకు అదనంగా రూ. 2100/- జూనియర్ ఆఫీసర్‌కు చెల్లిస్తారు.
- మేనేజర్ పోస్టులకు రూ. 28,000-43,450/-సీనియర్ మేనేజర్ పోస్టులకు రూ. 35,000/- ఏడాది తర్వాత రూ. 5000/- ఇంక్రిమెంట్ ఇస్తారు.
- అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
- ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- దరఖాస్తులకు చివరితేదీ: మే 18
- వెబ్‌సైట్: www.canfinhomes.com

362
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles