పరీక్ష ఒకటి.. వర్సీటీలు ఏడు


Wed,May 8, 2019 04:55 AM

గతంలో ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో పీజీ ప్రవేశాల కోసం ఆయా వర్సిటీలు సొంతంగా పరీక్ష నిర్వహించుకునేవీ. ప్రస్తుతం ఈ యూనివర్సిటీలతోపాటు తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన యూనివర్సిటీ, అనుబంధ కాలేజీల్లో వివిధ విభాగాల్లో పీజీ, పీజీ డిప్లొమా, ఇంటిగ్రేటేడ్ ప్రోగ్రామ్స్‌ల్లో మొత్తం 60 సబ్జెక్టులకు ఒకే ఒక ఉమ్మడి పరీక్ష- కామన్ పోస్టుగ్రాడ్యుయేషన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్)-2019 ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. మొదటిసారి ప్రవేశపెట్టిన ఈ పరీక్షను తెలంగాణ ఉన్నత విద్యా మండలి తరపున ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది.

ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫొరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్ అండ్ మైక్రోబయాలజీ కోర్సులకు దరఖాస్తు చేసుకొనేవారికి బీసీఈఎస్‌ఎఫ్‌ఎస్‌జీ అండ్ ఎం పేరుతో విడిగా పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో పార్ట్-ఏలో కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు, పార్ట్ బీలో సంబంధిత ఆప్షనల్ సబ్జెక్టు చదివిన ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ నుంచి 60 ప్రశ్నలు ఇస్తారు.


టీఎస్ కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్

-రాష్ట్రంలోని ఆరు ప్రధాన విశ్వవిద్యాలయాలతోపాటు జేఎన్‌టీయూహెచ్‌లోని ఎమ్మెస్సీ కోర్సుల్లో 2019-20కిగాను పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్-సీపీగెట్)-2019 నోటిఫికేషన్‌ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది.
-ప్రవేశాలు కల్పించే యూనివర్సిటీలు: ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీ, జేఎన్‌టీయూహెచ్
-కోర్సులు: ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు
-అర్హత: సంబంధిత విభాగంలో ఇంటర్, బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత.
-అప్లికేషన్ ఫీజు: ఒక్కొక్క సబ్జెక్టుకు.. రూ.800/-(ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.600/-)
-ఒకటికంటే ఎక్కువ సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అదనంగా ప్రతి సబ్జెక్టుకు రూ.400/- చెల్లించాలి.

సీపీగెట్‌తో ప్రయోజనాలు

-గతంలో ఉస్మానియా, కాకతీయ, జేఎన్‌టీయూహెచ్‌లు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునేవి. దీనివల్ల విద్యార్థులు అన్ని పరీక్షలు రాసేవారు. దీంతో డబ్బుతోపాటు సమయం కూడా వృథా అయ్యేది. వీటిన్నింటికి ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షతో ఫుల్‌స్టాప్ పడనుంది. ఉన్నత విద్యామండలి తీసుకొచ్చిన సీపీగెట్ ద్వారా ఒకే ఎంట్రెన్స్‌తో ఏడు వర్సిటీలలోని ఏ కాలేజీకైనా దరఖాస్తు చేసుకొని నచ్చిన కోర్సు చేయవచ్చు.
-ఎంపిక: ఆన్‌లైన్ ప్రవేశపరీక్ష ద్వారా
Students

పరీక్ష విధానం..

-ఆబ్జెక్టివ్ ప్రవేశపరీక్షలో ప్రతి సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు-100 మార్కులకు ఉంటాయి. పరీక్షను గంటన్నర సమయంలో పూర్తిచేయాలి. ఎంపీఈడీకి మాత్రం 75 ప్రశ్నలు-75 మార్కులు, మిగతా 25 మార్కులు స్పోర్ట్స్ కేటగిరీలోని వివిధ స్థాయిలో చూపిన ప్రతిభమేరకు ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ కలుపుతుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-దరఖాస్తులకు చివరితేదీ: మే 30
-రూ.500/- ఆలస్య రుసుంతో చివరితేదీ: జూన్ 8
-రూ.2000/- ఆలస్య రుసుంతో చివరితేదీ: జూన్ 11
-ప్రవేశ పరీక్ష తేదీలు: జూన్ 14 నుంచి 26 వరకు
-వెబ్‌సైట్: www.osmania.ac.in

కోర్సులు

-ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్: ఎంఏ (ఏఐహెచ్‌సీఏ, అరబిక్, ఇంగ్లిష్, హిందీ, సంస్కృతం, తెలుగు, ఉర్దూ, ఇస్లామిక్ స్టడీస్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, థియేటర్ ఆర్ట్స్)
-ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్: ఎంఏ (ఎకనామిక్స్, జనరల్ స్టడీస్, హిస్టరీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ), ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంటీఎం.
-ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్/ఎడ్యుకేషన్: ఎంకామ్, ఎంఈడీ, ఎంపీఈడీ
-ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్: బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, జాగ్రఫీ, జియాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ, బయోటెక్నాలజీ, న్యూట్రిషన్ అండ్ డైటీషియన్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైకాలజీ.
-పీజీ డిప్లొమా కోర్సులు: రేడియోలాజికల్ ఫిజిక్స్, అప్లయిడ్ లింగ్విస్టిక్స్, చైల్డ్ సైకాలజీ, జియోగ్రాఫికల్ కార్టోగ్రఫీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, సెరికల్చర్.

ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్

-ఇందులో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ/ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ కోర్సును ఉస్మానియా/మహాత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ, కాకతీయ యూనివర్సిటీల్లో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ కాకతీయలో, ఎంఏ ఎకనమిక్స్ తెలంగాణలో, ఎంబీఏ కోర్సు తెలంగాణ, మహాత్మాగాంధీ యూనివర్సిటీల్లో అందుబాటులో ఉంది.

-తన్నీరు వెంకటేశ్వర్లు

300
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles