పవనాలు-విస్తరణ


Wed,May 8, 2019 04:08 AM

పవన భూ స్వరూపాలు


పవన క్రమక్షయ ప్రక్రియలో ఏర్పడే భూ స్వరూపాలను పవన భూ స్వరూపాలు అంటారు.
ఇది ఇయోలస్ (Aeolus) అనే గ్రీకు భాష పేరుమీదుగా వచ్చింది. దీనికి పవనాల దేవుడు అని అర్థం.

పవనం

భూమికి క్షితిజ సమాంతరంగా వీచేగాలిని పవనం అంటారు. పవనాలు సాధారణంగా అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతానికి వీస్తాయి. ప్రతి పవనానికి 2 లక్షణాలుంటాయి. అవి వేగం, దిశ. పవన వేగాన్ని బట్టి, వీచే దిశను బట్టి భూ స్వరూపాలు తరుచుగా తమ ఆకారాలు మార్చుకుంటూ ఉంటాయి. అంటే పవనాల వల్ల ఏర్పడే భూస్వరూపాలు స్థిరమైనవి శాశ్వతమైనవి కాదు. పవన వేగాన్ని కొలిచే పరికరాలు అనిమోమీటర్, బ్యూపోర్డ్‌స్కేల్. పవన వేగాన్ని మైళ్లలో (MPH), కి.మీలలో (KMPH) లలో తెలుసుకుంటారు. పవన దిశను కొలిచే పరికరం- పవన సూచిక (Wind wane)
సమాన పవన వేగాలు కలిగిన ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలను ఐసోకైనటిక్స్ లైన్స్ అని పిలుస్తారు.
పవనాలు వీచే దిశను బట్టి వాటికి పేర్లు నిర్ణయిస్తారు.
ఉదా : నైరుతి నుంచి మొదలై ఈశాన్యం వైపునకు వీసే పవనాలను నైరుతి పవనాలు అని, ఈశాన్యం నుంచి మొదలై నైరుతివైపు వీచే పవనాలను ఈశాన్య పవనాలు అని, వాయవ్యం నుంచి మొదలై ఆగ్నేయంవైపు వీచే పవనాలను వాయవ్య పనాలు అని అంటారు.
గాలి నిదానంగా వీచి, హాయిగా ఉన్నపుడు దాన్ని సమీరం (తెమ్మర) అంటారు. వేగంగా వీచే గాలిని ఈదురుగాలి అని, చాలా వేగంగా వీచే గాలులను పెనుగాలి (తుఫాను) అని పిలుస్తారు.

పవనాల వర్గీకరణ

పవనాల వేగం, అవి వీచేదిశ, ఎందుకు వీస్తాయి వంటి వివిధ అంశాల ఆధారంగా పవనాలను నాలుగు రకాలుగా విభజించారు. అవి..
1. ప్రపంచ పవనాలు లేదా స్థిరపవనాలు లేదా శాశ్వత పవనాలు (Planetary winds)
2. రుతు పవనాలు లేదా కాలాన్నిబట్టి వీచే పవనాలు (Seasonal winds)
3. స్థానిక పవనాలు (Local winds)
4. అసాధారణ లేదా సక్రమంగా లేని పవనాలు (Irregular winds)

ప్రపంచ పవనాలు

ప్రపంచ పీడన మేఖలలో (ప్రపంచవ్యాప్తంగా) అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతాలకు నిరంత రాయంగా క్రమబద్ధంగా నిర్దిష్ట దిశలో వీచే పవనాలను ప్రపంచ పవనాలు అంటారు. ఇవి భూగోళం అంతటా ఏడాది పొడవునా వీస్తాయి.
ప్రపంచ పవనాలు వీచే భౌగోళిక ప్రాంతాన్ని అనుసరించి వాటిని మూడు రకాలుగా విభజించారు. అవి...

1. వ్యాపార పవనాలు (Trade wingds)- ఉష్ణమండలాల్లో
2. పశ్చిమ పవనాలు (Westerlies)- సమశీతోష్ణ మండలాల్లో
3. ధృవ పవనాలు (Poler winds)- ధృవ ప్రాంతాల్లో వీస్తాయి

వ్యాపార పవనాలు

ఉప అయనరేఖ అధిక పీడన మేఖల నుంచి భూమధ్యరేఖ అల్పపీడన మేఖల వైపు వీచే పవనాలు వ్యాపార పవనాలు అంటారు.
ఈ పవనాలు ఉత్తరార్ధగోళంలో ఈశాన్యదిశ నుంచి నైరుతి వైపు వీయడం వల్ల ఈశాన్య వ్యాపార పవనాలు అంటారు.
ఇవి దక్షిణార్ధగోళంలో ఆగ్నేయం నుంచి వాయవ్యం దిశగా వీయడంవల్ల ఆగ్నేయ వ్యాపార పవనాలు అంటారు.
ఈ పనాలు ఖండాల తూర్పు ప్రాంతాల్లో మాత్రమే వర్షాన్నిస్తాయి. పశ్చిమ ప్రాంతంలో వర్షాన్నివ్వకపోడంతో అక్కడ ఉష్ణమండల ఎడారులు ఏర్పడ్డాయి.

ఉదా: ఆసియా- థార్ ఎడారి, అరేబియా ఎడారి
ఉత్తర అమెరికా- సోనారన్ ఎడారి
దక్షిణ అమెరికా- అటకామా ఎడారి
ఆఫ్రికా- కలహారి ఎడారి, సహారా ఎడారి
ఆస్ట్రేలియా- గ్రేట్ ఆస్ట్రేలియన్ ఎడారి

గమనిక: ఉష్ణమండల ఎడారులు లేని ఖండం- అంటార్కిటికాఎడారులు లేని ఖండం- ఐరోపా (యూరప్)

పశ్చిమ పవనాలు

ఉప ఆయన రేఖ అధిక పీడన మేఖల నుంచి ఉపధృవ అల్పపీడన మేఖల వైపు 400-600ల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య వీచే పవనాలను పశ్చిమ పవనాలు అంటారు.
ఈ పవనాలను ఉత్తరార్ధ గోళంలో నైరుతి పశ్చిమ పవనాలు అని, ఈ పవనాలను దక్షిణార్ధ గోళంలో వాయవ్య పశ్చిమ పవనాలు అంటారు.
ఈ పవనాలు ఖండాల పశ్చిమ ప్రాంతంలో మాత్రమే వర్షానిచ్చి, తూర్పు ప్రాంతంలో వర్షానివ్వకపోవడంతో ఖండాల తూర్పు పారంతంలో శీతల ఎడారులు ఏర్పడాయి.
ఉదా: చైనా, మంగోలియాల్లోని గోబి ఎడారి, అర్జెంటీనాలోని పెటగోనియా ఎడారి.
పశ్చిమ పవనాలు-పేర్లు..
400ల దక్షిణ అక్షాంశాల వద్ద వీచే పశ్చిమ పవనాలను- గర్జించే నలభైలు (Roaring Forties)
500ల దక్షిణ అక్షాంశాల వద్ద వేచే పశ్చిమ పవనాలు- కోపోద్రిక్తులైన యాభైలు (Furious Fifties)
600ల దక్షిణ అక్షాంశాల వద్ద వీచే పశ్చిమ పవనాలు- విధ్వంసకరమైన అరవైలు (Screening Sixties)

ధృవపవనాలు

ధృవ అధిక పీడన మేఖల నుంచి ఉపధృవ అల్పపీడన మేఖల వైపు 900ల నుంచి 750ల ఉత్తర, దక్షిణ అక్షాంవాల మధ్య వీచే పవనాలను ధృవ పవనాలు అంటారు. వీటిని తూర్పు పవనాలు అని కూడా అంటారు.
ఈ పవనాలను ఉత్తరార్ధగోళంలో ఈశాన్యధృవ పవనాలని, దక్షిణార్ధగోళంలో ఆగ్నేయధృవ పవనాలు అని అంటారు.
వ్యాపార పవనాలు, పశ్చిమ పవనాలతో పోల్చినప్పుడు వీటికి (ధృవ పవనాలకు) వేగం, స్థిరత్వం తక్కువ.
ఇవి ధ్రువ ప్రాంతం నుంచి వీయడం వల్ల చల్లగా ఉండి, భాష్పీభవనాన్ని ఏర్పరచవు.
చల్లని ధ్రువ పవనాలు, వెచ్చని పశ్చిమ పవనాలు ఎదురెదురుగా కలిసిన చోట భయంకరమైన తుఫానులు ఏర్పడతాయి.
ప్రపంచ పవనాలు ప్రపంచవ్యాప్తంగా వేడిని, తేమను రవాణా చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

రుతుపవనాలు/కాలాన్నిబట్టి వీచే పవనాలు

రుతుపవనం అనేది ఆంగ్ల పదంలో మాన్‌సూన్ అని పిలుస్తారు. మాన్‌సూన్ అనే ఆంగ్లపదం మౌసమ్ అనే అరబిక్ పదం నుంచి వచ్చింది. అరబిక్ భాషలో
రుతువు అని అర్థం.
రుతువును అనుసరించి, సమయాన్ని అనుసరించి (నియమిత కాలంలో) గానీ తమ దిశను మార్చుకుంటూ వీచే పవనాలను కాలాన్నిబట్టి వీచే పవనాలు అంటారు.
ఉదా: రుతుపనాలు, భూజల పవనాలు, పర్వత పవనాలు, లోయ పవనాలు, సరస్సు సమీరాలు.

శీతాకాలం

దేశంలో శీతాకాలం రావడానికి ప్రధాన కారణం మధ్యదరా సముద్రం నుంచి వీచే పశ్చిమ పవనాలు (పశ్చి జెట్ స్ట్రీమ్ గంటకు 300 కి.మీ.)
ఇవి ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ మీదుగా భారతదేశంలోని ఉత్తర మైదానం వెంబడి వీచి చల్లబరుస్తాయి.
విపరీతమైన మంచుకు కారణమవుతాయి.
దీంతో హిమాచల్ నుంచి గంగామైదానం మీదుగా అరుణాచల్‌ప్రదేశ్ వరకు మంచు వల్ల ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ మంచును హేజ్ అంటారు.
ఇవి నెలకు 3-5 సార్లు సంభవిస్తాయి.
ఉత్తర భారతదేశంలో కురిసే హిమపాతాన్ని మహావత్ అంటారు.
పశ్చిమ అలజడుల వల్ల అక్కడక్కడ జల్లులు కురుస్తాయి. ఇవి వాయవ్య భారతదేశంలో రబీలో సాగయ్యే గోధుమ దిగుబడిని పెంచుతాయి.

భారత్ రుతుపవన దేశంగా మారడానికి కారణాలు

భారత్ అక్షాంశ పరంగా ఉత్తరార్ధగోళంలోను, రేఖాంశ పరంగా పూర్వార్ధగోళంలోనూ ఉండటంతో భూ, జల విస్తరణ ఇంచుమించు సమానంగా ఉండి పీడన వ్యవస్థలో మూర్పులు జరిగి రుతుపవన వ్యవస్థకు నాంది అయ్యింది.
కర్కటరేఖ భారత్ మధ్యలో నుంచి పోవడంవల్ల సూర్య గమనంలోని మార్పుల ప్రభావానికి లోనైంది.
నేల, నీరు విభిన్న రీతుల్లో ఉష్ణాన్ని గ్రహించి, చరలబరడంతో పీడన వ్యవస్థలో మార్పులు జరిగి రుతుపవన వ్యవస్థకు నాంది జరిగింది.
రుతుపవనాలు పయనించే దారిలో ప్రథమ దేశంలో భారత్ ఉండటం.
భారత్‌కి ఉత్తర సరిహద్దులో అతి ఎత్తులో ఉన్న హిమాలయాలు ఉండటం.
కన్యాకుమారి ఆగ్రం వింతైన ఆకారం (V) ఉండటంతో రుతువపనాలు రెండు శాఖలై దేశంలోని అన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది.
దేశం మూడువైపుల సముద్రం ఉండటంతో రుతుపవన విషయంలో శుభపరిణామం.

రుతుపవనాలు ఏర్పడటానికి కారణాలు..

1. సూర్యగమనాన్ని అనుసరించి ఉష్ణోగ్రత, పీడన విస్తరణలో వ్యత్యాసం
2. నేల, నీరు భిన్నరీతుల్లో ఉష్ణాన్ని గ్రహించి చల్లబడటం
3. ట్రోపో ఆవరణం పైభాగంలో అతివేగంగా వీచే జెట్ ప్రవాహాలు భారత్ ప్రధానంగా రుతుపవన దేశం. అందువల్ల మన దేశ శీతోష్ణస్థితిని అయనరేఖా రుతుపవన శీతోష్ణస్థి అంటారు.

రుతువపనాలు ముఖ్యంగా రెండు రకాలు. అవి..

1. నైరుతి రుతుపవనాలు
2. ఈశాన్య రుతుపవనాలు
భారత వాతావరణ సంస్థ (India meteorological department)వారు ఏడాదిలోని 12 నెలలను 4 ముఖ్య కాలాలుగా విభజించారు. అవి..
1. శీతాకాలం (జనవరి, ఫిబ్రవరి)
2. వేసవి కాలం (మార్చి, ఏప్రిల్, మే)
3. నైరుతి రుతుపవన కాలం
(జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్)
4. ఈశాన్య రుతుపవన కాలం
(అక్టోబర్, నవంబర్, డిసెంబర్)

211
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles