సీఎంటీఐలో అప్రెంటిస్


Wed,May 8, 2019 12:30 AM

బెంగళూరులోని సెంట్రల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో గ్రాడ్యుయేట్, డిప్లొమా అభ్యర్థులకు అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
cmti
-గ్రాడ్యుయేట్ అప్రెంటిస్
-విభాగాలవారీగా ఖాళీలు: మెకానికల్ ఇంజినీరింగ్-10, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్-8, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్-2 ఖాళీలు ఉన్నాయి.
-టెక్నికల్ డిప్లొమా అప్రెంటిస్
-విభాగాలవారీగా ఖాళీలు: మెకానికల్ ఇంజినీరింగ్-12, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్-6, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్-2 ఖాళీలు ఉన్నాయి.
-స్టయిఫండ్: గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.4,984/-, డిప్లొమా వారికి నెలకు రూ.3,542/-
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత బ్రాంచీలో బీఈ/బీటెక్, టెక్నికల్ అప్రెంటిస్‌లకు సంబంధిత ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
-దరఖాస్తు: మొదట www.mhrdnats.gov.in రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత మెయిల్ ఐడీ([email protected])కి దరఖాస్తు పంపాలి.
-చివరితేదీ: ఎంహెచ్‌ఆర్‌డీ - మే 10
-సీఎంటీఐ-మే 15
-వెబ్‌సైట్: http://cmti-india.net

315
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles