బీఎస్‌ఎఫ్‌లో 1072 ఖాళీలు


Fri,April 19, 2019 01:49 AM

రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) కమ్యూనికేషన్ విభాగంలో ఖాళీగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
WOMEN-BSF-CONSTABLE
-బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ భారతదేశ ఐదు సాయుధ పోలీస్ బలగాల్లో/దళాల్లో ఒకటి. దీనిని డిసెంబర్ 1, 1965న ఏర్పాటు చేశారు
-పోస్టు పేరు: హెడ్ కానిస్టేబుల్
-మొత్తం పోస్టుల సంఖ్య - 1072
-హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్)-300 ఖాళీలు
-హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్)-772 ఖాళీలు
గమనిక: మొత్తం ఖాళీల్లో 25 శాతం ఖాళీలను బీఎస్‌ఎఫ్‌లో పనిచేస్తున్న అభ్యర్థులకు కేటాయించారు
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్షతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
-వయస్సు: 2019, జూన్ 12 నాటికి 18 - 25 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ ద్వారా
-మొదటి దశ-ఓఎమ్‌ఆర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్
-రాత పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు-200 మార్కులుకుగాను మూడు గంటల సమయాన్ని కేటాయించారు.
-ఓఎమ్‌ఆర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్‌లో ఇంగ్లిష్ అండ్ జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబెక్టుల నుంచి ప్రశ్నలిస్తారు.
-నెగెటివ్ మార్కిగ్‌లో భాగంగా ప్రతి తప్పు సమాధానానికి 1/2 లేదా 0.50 కోత విధిస్తారు.
-రెండో దశ-పీఎస్‌టీ/పీఈటీ, మూడో దశలో డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది.
-పే స్కేల్: రూ. 25,500 -81,100/-
-అప్లికేషన్ ఫీజు: రూ. 100/- (ఎస్సీ/ఎస్టీ, బీఎస్‌ఎఫ్ ఉద్యోగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు)
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: మే 14
-చివరితేదీ: జూన్ 12
-వెబ్‌సైట్: http://bsf.nic.in

386
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles