ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు


Tue,April 16, 2019 01:22 AM

ఇండియన్ ఆర్మీ పర్మినెంట్ కమిషన్ ద్వారా 2020 జనవరిలో ప్రారంభమయ్యే టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ 130) కోసం అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
TGC
టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ 130)
మొత్తం ఖాళీలు: 40
బ్రాంచీలవారీగా ఖాళీలు: సివిల్-10, ఆర్కిటెక్చర్-1, మెకానికల్-6, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్-6, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్/కంప్యూటర్ టెక్నాలజీ/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్-8, ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్-5, ఎలక్ట్రానిక్స్-1, మెటలర్జికల్-1, ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ఇన్‌స్ట్రుమెంటేషన్-1, మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రోవేవ్-1
-అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2020 జనవరి 1 లోపు డిగ్రీ పూర్తిచేయాలి.
-వయస్సు: 2020 జనవరి 1 నాటికి 20 -27 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎత్తు: 157.5 సెం,మీ ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
-పే & అలవెన్సులు: ట్రెయినింగ్‌లో నెలకు రూ.56,100/- జీతం ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక లెఫ్టినెంట్ హోదాలో పేబ్యాండ్ రూ.56,100-1,77,500/- జీతం చెల్లిస్తారు. వీటికి అదనంగా గ్రూప్ ఇన్సూరెన్స్, ఇతర సౌకర్యాలు ఉంటాయి.
-శిక్షణ వ్యవధి: ఎంపికైనవారికి డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. కోర్సును విజయవంతంగా పూర్తి చేసినవారికి ఆర్మీలో ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.
-ఎంపిక: సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ/టెస్ట్
-ఎస్‌ఎస్‌బీ అర్హత కలిగిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి, రెండు దశల్లో ఇంటర్వ్యూ /టెస్ట్‌లను నిర్వహిస్తుంది.
-ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం: ఎస్‌ఎస్‌బీ సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్, ఇంటర్వ్యూ/టెస్ట్‌లను వరుసగా ఐదురోజులపాటు అలహాబాద్, భోపాల్, బెంగళూరు, కపుర్తలా (పంజాబ్)లో నిర్వహిస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-రిజిస్ట్రేషన్ చివరితేదీ: మే 9
-వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in

240
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles